Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ అరెస్ట్.. ఫొటో షేర్ చేసిన బిగ్ బి!-amitabh bachchan shared photo in social media with arrested caption ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ అరెస్ట్.. ఫొటో షేర్ చేసిన బిగ్ బి!

Amitabh Bachchan : అమితాబ్ బచ్చన్ అరెస్ట్.. ఫొటో షేర్ చేసిన బిగ్ బి!

Anand Sai HT Telugu

Amitabh Bachchan : సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ షేర్ చేసిన ఓ ఫోటో చూసి అభిమానులు షాక్ అయ్యారు. ముంబై పోలీస్ వ్యాన్ దగ్గర బిగ్ బి నిలబడి ఉన్నారు. ఆయన ముఖంలో ఆందోళన కనిపిస్తోంది.

అమితాబ్ బచ్చన్ (Instagram)

నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) అభిమానులకు షాక్ ఇచ్చే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబై పోలీస్ వ్యాన్ దగ్గర బిగ్ బి నిలబడి ఉన్నారు. ఆయన ముఖంలో ఆందోళన కనిపిస్తోంది. అలాంటి ఫోటోను సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్ దానికి 'అరెస్ట్' అని క్యాప్షన్ పెట్టారు. కొద్దిరోజుల క్రితం ఆయన హెల్మెట్ లేకుండా బైక్ నడపడంపై తీవ్ర చర్చ జరిగింది. తన తప్పేమీ లేదని బిగ్ బి వాదించారు. ఆ తర్వాత ఇలా ఓ ఫోటో షేర్ చేస్తూ ‘అరెస్ట్’ అంటూ క్యాప్షన్ పెట్టడం అందరినీ అయోమయంలో పడేస్తోంది.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఇలాంటి జిమ్మిక్కులు చేసే ట్రెండ్ ఇటీవల ఎక్కువైంది. ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ ఉన్నప్పుడు ఇలాంటి టెక్నిక్ ఉపయోగిస్తారు. అమితాబ్ బచ్చన్ కూడా అలానే చేసి ఉంటారని అందరూ ఊహించారు. అయితే దీని నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా అనేక ఆలోచనలను పంచుకుంటారు. తాజాగా తన హెల్మెట్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. 'అది ఆదివారం. చిత్రీకరణకు తగిన అనుమతి తీసుకున్నారు. ఆదివారం కార్యాలయాలన్నీ మూతపడడం, ప్రజల రాకపోకలు లేకపోవడంతో అనుమతి కోరారు. చిత్రీకరణ కోసం రోడ్డులోని కొంత భాగాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ మార్గం 30 నుంచి 40 మీటర్లు మాత్రమే. నేను వేసుకున్న డ్రెస్ సినిమా కాస్ట్యూమ్. బైక్ ఎక్కి వెనక కూర్చున్నట్టు నటించాను. రైడ్ చేయలేదు. నా గురించి పట్టించుకున్నందుకు ధన్యవాదాలు.' అని అమితాబ్ రాశారు.

అమితాబ్ బచ్చన్ చాలా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 'ప్రాజెక్ట్ కె' షూటింగ్(Project K Shooting) సమయంలో అమితాబ్ బచ్చన్ పక్కటెముకలకు గాయమైంది. దీంతో కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ వయసు 80 ఏళ్లు. ఈ వయసులోనూ నటనతో బిజీగా ఉన్నారు.