Project K Release Date : ప్రాజెక్ట్ K అనుకున్న తేదీకి విడుదల కష్టమే.. కారణం అమితాబ్ బచ్చన్-prabhas project k release date may postponed because of amitabh bachchan health issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Project K Release Date May Postponed Because Of Amitabh Bachchan Health Issue

Project K Release Date : ప్రాజెక్ట్ K అనుకున్న తేదీకి విడుదల కష్టమే.. కారణం అమితాబ్ బచ్చన్

Anand Sai HT Telugu
May 11, 2023 08:38 AM IST

Project K Releaae Date : ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇంకా టైమ్ తీసుకునేలా ఉంది.

ప్రభాస్
ప్రభాస్ (HT_PRINT)

ప్రభాస్, దీపికా పదుకొనే(prabhas deepika padukone film) జంటగా నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' చిత్రాన్ని జనవరి 12, 2024న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ లెక్క.. రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్(amitabh bachchan) ఇటీవల గాయపడ్డాడు. మెల్లగా కోలుకుంటున్నాడు. ఆయన కోలుకోవడం ఆలస్యమవడంతో సినిమా పనులు ఆలస్యమవుతున్నాయి. దీంతో ' ప్రాజెక్ట్ K ' సినిమా అనుకున్న తేదీకి విడుదల కాలేదని అంటున్నారు.

'ప్రాజెక్ట్ కె' షూటింగ్(Project K Shooting) సమయంలో అమితాబ్ బచ్చన్ పక్కటెముకలకు గాయమైంది. దీంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు అమితాబ్ మెల్లగా కోలుకుంటున్నాడు. ఆయనపై ఎలాంటి ఒత్తిడి చేయకూడదని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అమితాబ్ బచ్చన్ వయసు 80 ఏళ్లు. ఈ వయసులోనూ నటనతో బిజీగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యంపై టీమ్ ఎక్కువ శ్రద్ధ చూపుతోంది.

అమితాబ్ బచ్చన్ కాస్త కోలుకున్నప్పటికీ, కొంత విశ్రాంతి అవసరం. ఇలాంటప్పుడు షూటింగ్ కు రావాలని ఒత్తిడి చేస్తే మళ్లీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ ముందుకు తీసుకెళ్లినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మాత భావిస్తున్నాడట. అందుకే దర్శకుడు నాగ్ అశ్విన్(nag ashwin) ఈ విషయంలో ఆలోచల్లో పడ్డాడట.

'బాహుబలి 2'(Bahubali 2) తర్వాత ప్రభాస్‌కి అనుకున్నంత విజయం దక్కలేదు. అందుకే సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. జూన్ 16న 'ఆదిపురుష్'(Adipurush) సినిమా విడుదలవుతోంది. దీని తర్వాత సెప్టెంబర్‌లో 'సాలార్'(salaar) రానుంది. ఈ విడుదల తర్వాత 'ప్రాజెక్ట్ కె' విడుదల కానుంది.

'ప్రాజెక్ట్ కె' చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రాజెక్ట్ కే ఫాంటసీ డ్రామా జోనర్‌లో తెరకెక్కుతోంది. ప్రభాస్ ఇందులో సరికొత్త రూపంల కనిపించనున్నారు. అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు దీపికా పదుకొణె 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. డార్లింగ్‌తో ఈ ముద్దుగుమ్మ తొలిసారి నటిస్తోంది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ఆధునిక అవతారం గురించి ఈ సినిమా ఉంటుందని అశ్విని దత్ గతంలో చెప్పారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం