Telugu News  /  Entertainment  /  Hug From Abhishek It Makes Amitabh Bachchan Emotional On Kbc 14 And Video Goes To Viral
అమితాబ్-అభిషేక్ ఎమోషనల్ వైరల్
అమితాబ్-అభిషేక్ ఎమోషనల్ వైరల్

Amitabh Bachchan Emotional Viral: తండ్రికి కంట నీరు తెప్పించిన అభిషేక్.. అమితాబ్ బచ్చన్ ఎమోషనల్.. వీడియో వైరల్

05 October 2022, 15:15 ISTMaragani Govardhan
05 October 2022, 15:15 IST

Abishek Makes Amitabh Emotonal: త్వరలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ 80వ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ కేబీసీ షో నిర్వహాకుల ద్వారా వినూత్నమైన రీతిలి తన తండ్రి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Amitabh Bachchan Emotinal: బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు దశాబ్దాలుగా వెండి తెరపై తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన బిగ్‌బీ కౌన్ బనేగా కరోడ్ పతితో బుల్లి తెరపై కూడా అలరించారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ నడుస్తోంది. త్వరలో ఆయన 80వ పుట్టినరోజు రానుంది. దీంతో షో నిర్వాహకులు వినూత్న రీతిలో ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. అమితాబ్ కుమారుడు అభిషేక్ బిగ్‌బీకి గుర్తుండిపోయే విధంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినట్లు ఈ ప్రోమో వీడియోను తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ప్రోమో వీడియోను గమనిస్తే.. అమితాబ్ స్టేజ్ మధ్యలో నిలుచుని ఉంటారు. ఇంతలో అకస్మాత్తుగా అలారం మోగుతుంది. అందరూ ఎందుకు మోగిందాని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ సమయంలోనే అభిషేక్ వాయిస్ వినపిస్తుంది. కబీ కబీ మేరే దిల్ మే కయాల్ ఆతా హై అంటూ అమితాబ్ నటించిన కబీ కబీ సినిమాలోని డైలాగ్‌తో అభిషేక్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇస్తాడు. తనయుడిని చూసిన ఆనందంలో బిగ్‌బీ ఒక్కసారిగా గుండెలకు హత్తుకుంటారు. అభిషేక్ కూడా తండ్రిని హగ్ చేసుకోవడం చూసిన వారికి ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఆ సమయంలో అమితాబ్ కాస్త భావోద్వేగానికి గురవుతారు. ఆయన కంట నీరు కూడా వస్తుంది. వెంటనే అభిషేక్ తండ్రిని ఓదారిస్తూ వీపుపై తడమడం చూసేవారికి భారంగా అనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నెటిజన్లు కూడా ఈ తండ్రి, కొడుకుల ప్రేమానురాగానికి ఫిదా అయ్యారు.

కౌన్ బనేగా కరోడ్ పతి షో గతేడాది 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయంపై అమితాబ్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. "ఈ షో ప్రారంభమై ఇప్పటికీ 21 ఏళ్ల అవుతుంది. 2000లో మొదలైన ఈ షోకు ఇంత ఆదరణ వస్తుందని నేను అనుకోలేదు. వెండి తెర నుంచి బుల్లితెరపైకి వస్తుంటే చాలా మంది నన్ను హెచ్చరించారు. నా ఇమేజ్‌కు నష్టం వాటిల్లుతుందని జోస్యం చెప్పారు. కానీ అప్పటి నా పరిస్థితులు వేరు. ఆ సమయంలో నా వద్దకు ఎలాంటి సినిమాలు రాలేదు. కానీ ఈ షో తర్వాత ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నా ప్రపంచాన్ని మార్చి వేసింది." అని బిగ్‌బీ అన్నారు.

కౌన్ బనేగా కరోడ్ పతి షో తనకు రెండో జీవితాన్ని ప్రసాదించిందని అమితాబ్ అన్నారు. అనంతరం సినిమాల్లోనూ వరుసగా ఆఫర్లు వచ్చాయి. అమితాబ్ చివరిగా అయన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మాస్త్రలో కనిపించారు. ఈ సినిమాలో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కలిసి మొదటిసారిగా నటించారు. ఇది కాకుండా ఈ విజయదశమికి రష్మికా మందన్నాతో ఆయన నటించిన గుడ్‌బై చిత్రం విడుదలైంది.