Telugu News  /  Sports  /  Amitabh Bachchan Meets Messi And Ronaldo In Riyadh During An Exhibition Match
క్రిస్టియానో రొనాల్డోతో అమితాబ్ బచ్చన్
క్రిస్టియానో రొనాల్డోతో అమితాబ్ బచ్చన్ (REUTERS)

Amitabh Bachchan meets Messi and Ronaldo: మెస్సీ, రొనాల్డోలతో అమితాబ్ బచ్చన్ వేసిన జోక్ ఏంటి? వాళ్లు ఎందుకు నవ్వారు?

20 January 2023, 10:42 ISTHari Prasad S
20 January 2023, 10:42 IST

Amitabh Bachchan meets Messi and Ronaldo: మెస్సీ, రొనాల్డోలతో అమితాబ్ బచ్చన్ వేసిన జోక్ ఏంటి? వాళ్లు ఎందుకు నవ్వారు? తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఇదే అనుమానం వస్తుంది.

Amitabh Bachchan meets Messi and Ronaldo: ఓ లెజెండరీ నటడు ఇద్దరు లెజెండరీ ఫుట్ బాలర్స్ ను కలిస్తే ఎలా ఉంటుంది? అలాంటి అరుదైన సందర్భం గురువారం (జనవరి 19) కనిపించింది. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్.. అర్జెంటీనా సూపర్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోలను కలిశాడు.

ట్రెండింగ్ వార్తలు

సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో, మెస్సీ తలపడ్డారు. రియాద్ సీజన్, పారిస్ సెయింట్-జెర్మెయిన్ టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. మెస్సీ పీఎస్‌జీ తరఫున, రొనాల్డో రియాద్ సీజన్ తరఫున ఆడారు. ఈ మ్యాచ్ కు బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ గెస్ట్ గా వచ్చాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడు రెండు టీమ్స్ ప్లేయర్స్ ను కలిశాడు.

ఈ ప్లేయర్స్ లో బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్, ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కూడా ఉన్నాడు. అయితే ఈ మధ్యే అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన మెస్సీని కలిసినప్పుడు, పోర్చుగల్ స్టార్ రొనాల్డోను కలిసినప్పుడు అమితాబ్ కాస్త ఎక్కువసేపు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. ఈ సందర్భంగా వాళ్లతో బిగ్ బీ మాట్లాడగా.. ఈ ఇద్దరు ప్లేయర్స్ ముసిముసిగా నవ్వుతూ కనిపించారు.

ఫుట్‌బాల్ కు వీరాభిమాని అయిన అమితాబ్.. ఈ ప్రత్యేక సందర్భాన్ని తన ట్విటర్ అకౌంట్లోనూ షేర్ చేసుకున్నాడు. "రియాద్ లో ఓ సాయంత్రం.. ఇదో అద్భుతమైన సాయంత్రం.. క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ, ఎంబాపె, నెయ్‌మార్ కలిసి ఆడటం, గెస్ట్ గా ఈ మ్యాచ్ ను ప్రారంభించడం.. పీఎస్‌జీ వర్సెస్ రియాద్ సీజన్స్.. అద్భుతం" అని బిగ్ బీ ట్వీట్ చేశాడు.

ఈ మ్యాచ్ లో చివరికి 5-4 తేడాతో పారిస్ సెయింట్-జెర్మెయిన్ విజయం సాధించింది. అంతేకాదు రెండు టీమ్స్ తరఫున రొనాల్డో, మెస్సీలు కూడా గోల్స్ చేయడం విశేషం. 2021 సీజన్ నుంచి మెస్సీ పీఎస్‌జీ టీమ్ కు ఆడుతుండగా.. రొనాల్డో ఈ మధ్యే సౌదీకి అల్ నసర్ టీమ్ తో చేతులు కలిపిన విషయం తెలిసిందే.

టాపిక్