Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!
08 May 2024, 17:08 IST
- Aavesham OTT Streaming Date, Deal: ఆవేశం సినిమా డిజిటిల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో మలయాళ ఇండస్ట్రీలో రికార్డుల సృష్టించిందని తెలుస్తోంది. డీల్ వివరాలు బయటికి వచ్చాయి. ఈ చిత్రం రేపు (మే 9) స్ట్రీమింగ్‍కు రానుంది.
Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో ఆవేశం మూవీ రికార్డు.. ఎన్ని కోట్లంటే.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్!
Aavesham Movie OTT: మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఈ యాక్షన్ కామెడీ సినిమాలో ఫాహద్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రంపై చాలా ప్రశంసలు వస్తూనే ఉన్నాయి. ఏప్రిల్ 11వ తేదీన ఆవేశం చిత్రం మలయాళంలో విడుదలైంది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రూ.30కోట్లతో తెరకెక్కిన ఆవేశం భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. అయితే, ఓటీటీ హక్కుల విషయంలో మలయాళ ఇండస్ట్రీలో ఈ చిత్రం రికార్డు సృష్టించిందని తెలుస్తోంది. ఆ వివరాలివే..
ఓటీటీ డీల్‍లో రికార్డు
ఆవేశం సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. రూ.35కోట్లను చెల్లించి ఈ హక్కులను ఆ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. దీంతో ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా అత్యధిక మొత్తం పొందిన మలయాళ మూవీగా ఆవేశం చిత్రం రికార్డు దక్కించుకుంది. మూవీ బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం ఓటీటీ హక్కుల రూపంలోనే ఈ చిత్రానికి వచ్చాయి.
స్ట్రీమింగ్ వివరాలివే
ఆవేశం సినిమా రేపు (మే 9) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ మలయాళ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఫుల్ హైప్ ఉండటంతో ఓటీటీలోనూ దుమ్మురేపే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ఆవేశం చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. రోమాంచం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశారు. ఆవేశం మూవీలో లోకల్ రౌడీ రంగా పాత్రలో ఫాహద్ ఫాజిల్ జీవించేశారు. ఈ క్యారెక్టర్లో ఆయన నటనకు భారీగా ప్రశంసలు వస్తున్నాయి. అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆవేశం మూవీలో ఫాహద్ ఫాజిల్‍తో పాటు హిప్‍స్టర్, మిథున్ జై, రోషన్ షానవాజ్, సాజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్, ఆశిష్ విద్యార్థి కీరోల్స్ చేశారు. ఫాదహ్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్, అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్లు నిర్మించాయి. ఫాహద్ ఆయన భార్య, నటి నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి సుశీన్ శ్యామ్ సంగీతం అందించారు.
దుమ్మురేపుతున్న మంజుమ్మల్ బాయ్స్
మలయాళ ఇండస్ట్రీలో ఆల్‍టైమ్ బ్లాక్‍బస్టర్‌గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా మే 5వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 22న మలయాళంలో రిలీజైన ఈ మూవీ సుమారు రూ.240 కోట్ల వసూళ్లను రాబట్టింది. రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించిన తొలి మలయాళ మూవీగా రికార్డు సృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మల్ బాయ్స్ ఇప్పుడు హాట్‍స్టార్ ఓటీటీలోనూ దూసుకెళుతోంది. అప్పుడే ఆ ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. మంజుమ్మల్ బాయ్స్ మూవీ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాశ్ భాసీ, బాలువర్గీస్, గణపతి, లాల్ జూనియర్ ప్రధాన పాత్రలు పోషించారు.