Samantha Review on Aavesham: ఆవేశం చిత్రానికి రివ్యూ ఇచ్చిన సమంత.. మ్యాడ్‍నెస్ అంటూ..-samantha gives her review for aavesham film praises fahadh faasil performance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Review On Aavesham: ఆవేశం చిత్రానికి రివ్యూ ఇచ్చిన సమంత.. మ్యాడ్‍నెస్ అంటూ..

Samantha Review on Aavesham: ఆవేశం చిత్రానికి రివ్యూ ఇచ్చిన సమంత.. మ్యాడ్‍నెస్ అంటూ..

Samantha Review on Aavesham Movie: ఆవేశం చిత్రంపై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ చిత్రానికి రివ్యూ రాశారు. ఈ మూవీ చూస్తున్నప్పుడు తనకు ఎలా అనిపించిందో వెల్లడించారు.

Samantha Review on Aavesham: ఆవేశం చిత్రానికి రివ్యూ ఇచ్చిన సమంత

Samantha on Aavesham: మలయాళ ఇండస్ట్రీలో ‘ఆవేశం’ మరో బ్లాక్‍బస్టర్ దిశగా దూసుకెళుతోంది. స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటి.. ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది. ఏప్రిల్ 11వ తేదీన విడుదలైన యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’ మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఫాహద్ ఫాజిల్ నటనకు మరోసారి అందరూ ఫిదా అవుతున్నారు. తాాజాగా, స్టార్ హీరోయిన్ సమంత.. ఆవేశం సినిమాపై స్పందించారు. తన రివ్యూ ఇచ్చారు.

భయపడ్డాను.. నవ్వాను

ఆవేశం చిత్రం చూస్తూ భయపడ్డానని, అలాగే నవ్వానని కూడా సమంత పేర్కొన్నారు. ఈ చిత్రం గురించి ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు. కొన్ని సినిమాలను థియేటర్లలోనే చూడాలని, ఈ మూవీ కూడా అలాంటిదేనని సమంత రాసుకొచ్చారు.

ఆవేశం చిత్రాన్ని అసలు మిస్ అవొద్దని సమంత పేర్కొన్నారు. “ఆవేశం చిత్రంలో అన్ని రకాల మ్యాడ్‍నెస్ ఉంది. అలాంటి పిచ్చి నాకు నచ్చుతుంది. ఇది రూల్స్‌ను బద్దలుకొట్టేసింది. ఒక సీన్ నుంచి మరో సీన్‍కు జానర్లే మారిపోయాయి. నేను భయపడ్డాను.. నవ్వాను.. భయపడ్డాను.. నవ్వాను. కొన్ని సినిమాలు తప్పకుండా థియేటర్లలోనే అనుభూతి చెందాలి. ఇది కూడా అలాంటి చిత్రమే!” అని సమంత రాసుకొచ్చారు.

స్టెరాయిడ్స్ తీసుకున్నట్టుగా ఫాఫా (ఫాహద్ ఫాజిల్) పర్ఫార్మెన్స్ ఉందని తాను ఎక్కడో చదివానని, ఇది సరిగ్గా సరిపోయిందని సమంత చెప్పారు. ఆయన సినిమాలను మిస్ అవొద్దని రాసుకొచ్చారు. అద్భుతమైన ఆవేశం టీమ్‍కు అభినందనలు తెలుపుతున్నానని, స్ఫూర్తివంతంగా నిలిచారని సమంత తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. చిత్రం నుంచి బయటికి రాలేకున్నానని ఇటీవల పోస్ట్ చేసిన సమంత.. ఇప్పుడు మరోసారి తన రివ్యూ రాశారు.

ఆవేశం చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర చేయగా.. హిప్‍స్టర్., మిథున్ జై చెంబన్ వినోద్, సాజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్, ఆశిష్ విద్యార్థి కీరోల్స్ చేశారు. రంగా అనే రౌడీ పాత్రలో ఈ మూవీలో ఫాదవ్ నటన అందరినీ మెప్పిస్తోంది.

ఆవేశం సినిమాను ఫాహద్ ఫాజిల్ భార్య, నటి నజ్రియా నజీమ్, అన్వర్ రషీద్ నిర్మించారు. ఈ సినిమాకు సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే రూ.100 కోట్ల మైలురాయి దాటేసింది.

మలయాళం ఇండస్ట్రీలో ఈ ఏడాది ఇప్పటికే భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ బ్లాక్‍బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఆవేశం కూడా ఆ బాబితాలోకి వచ్చేసింది. మరి ఆవేశం సినిమా తెలుగులో థియేటర్లలోకి వస్తుందా.. లేక తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతుందా అనేది చూడాలి. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.

బ్రేక్‍లో సమంత

మరోవైపు, సమంత ప్రస్తుతం సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. మయోసైటిస్‍కు చికిత్స తీసుకున్న ఆమె ఇంకా బ్రేక్‍లోనే ఉన్నారు. చివరగా గతేడాది ఖుషి చిత్రంలో సమంత కనిపించారు. త్వరలోనే ఆమె మళ్లీ చిత్రాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.