Telugu Cinema News Live December 4, 2024: పెళ్లితో ఒక్కటైన నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల.. వివాహానికి హాజరైన అతిథులు వీళ్లే!
04 December 2024, 22:11 IST
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఎట్టకేలకి ఒక్కటయ్యారు. రెండేళ్లు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఈరోజు పెళ్లి చేసుకుంది.
Pushpa 2 Cast and Budget: పుష్ప మూవీ కోసం తొలుత సుకుమార్ ముగ్గురు స్టార్‌ల దగ్గరికి వెళ్తే.. భిన్నమైన కారణాలు చెప్పి నో చెప్పారట. దాంతో.. అల్లు అర్జున్, రష్మిక మంధాన, ఫహద్ ఫాజిల్ దగ్గరికి సుకుమార్ వెళ్లారు.
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల బుధవారం రాత్రి వివాహ బంధంతో ఒక్కటి అవుతున్నారు. పరిమిత సంఖ్యలో అతిథులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరుగుతోంది.
Pushpa 2 The Rule: ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మూవీ 12,500 థియేటర్లలో రిలీజ్‌కాబోతోంది. ఈ అన్ని థియేటర్లలోనూ జాట్ మూవీ సందడి చేయనుంది. ఎలా అంటే?
Pushpa 2 Release: పుష్ప 2 రిలీజ్ ముంగిట ఎట్టకేలకి మెగా ఫ్యామిలీ నుంచి స్పందన వచ్చింది. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇండస్ట్రీలోని చాలా మంది స్పందించిన.. మెగా ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్క ట్వీట్ కూడా రాలేదు. అయితే..?
Nandamuri Balakrishna: ఆదిత్య 369 మూవీ వచ్చి 33 ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ సినిమాని ట్రెండ్ సెట్టర్‌గానే చూస్తున్నారు. అంతలా ప్రేక్షకులకి గుర్తుండిపోయిన ఆ మూవీ ఎన్ని రోజుల్లో తీశారో తెలుసా? బడ్జెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Devara On OTT: మిక్స్‌డ్ టాక్‌తోనూ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లని రాబట్టిన దేవర పార్ట్ -1 మూవీ.. ఓటీటీలో అదరగొట్టేస్తోంది. ఏడు దేశాల్లో టాప్-10 ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా దేవర కొనసాగుతోంది.
- OTT Horror Comedy: ఓటీటీలోకి ఇప్పుడో కన్నడ హారర్ కామెడీ మూవీ రాబోతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజైన ఆ మూవీ.. 8 నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
- RGV on Pushpa 2 Tickets: పుష్ప 2 టికెట్ల ధరలను భారీగా పెంచడంపై వస్తున్న విమర్శలపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించాడు. సినిమా టికెట్ల ధరలపైనే మీ ఏడుపెందుకు.. ఇష్టం లేకపోతే చూడకండి అంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Naga Chaitanya Wedding Time: శోభిత ధూళిపాళ్లతో ఈరోజు వివాహ బంధంలోకి నాగచైతన్య మరోసారి అడుగుపెట్టబోతున్నాడు. రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. ఇరు వైపులా పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటోంది.
Daku Maharaj Update: బాలకృష్ణ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తయినట్లు బుధవారం మేకర్స్ ప్రకటించారు. ఈ మాస్ యాక్షన్ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తోన్నాడు. సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో డాకు మహారాజ్ పోటీపడబోతుంది.
Telugu Movies on OTT: గత వారం రెండు తెలుగు సినిమాలు ఓటీటీలో ఆధిపత్యం చెలాయించగా.. ఈ వారం కూడా రెండు మూవీస్ సిద్ధం అయిపోయాయి. ఇందులో ఒకటి రూ.300 కోట్లకిపైగా వసూళ్లు రాబట్టిన సినిమా.
Thriller OTT: అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన పొట్టేల్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యువచంద్ర హీరోగా నటించిన ఈ మూవీకి సాహిత్ మొత్కూరి దర్శకత్వం వహించాడు.
Gumasthan Review: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గుమస్తాన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమల్ కే జాబీ దర్శకత్వం వహించిన సినిమాలో జైస్ జోష్, షాజు శ్రీధర్, బిబిన్ జార్జ్ కీలక పాత్రలు పోషించారు.
- Pushpa 2 First Review: పుష్ప 2 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన ఈ సీక్వెల్ తో అల్లు అర్జున్ కు మరో నేషనల్ అవార్డు ఖాయమట. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ మరో లెవల్ అంటున్నారు.
Action Thriller OTT: విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మాస్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. మెకానిక్ రాకీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.
- OTT Thriller Web Series: ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన తెలుగు డిటెక్టివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దుమ్ము రేపుతోంది. ఈ పీరియడ్ డ్రామా జీ5 ఓటీటీలో ఐదు రోజుల్లోనే అరుదైన రికార్డును అందుకోవడం విశేషం.
- Pushpa 2 vs RRR: పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ లో మరో రికార్డు అందుకుంది. ఇప్పటికే బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్ల మార్క్ అందుకున్న ఈ అల్లు అర్జున్ సినిమా.. ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసింది.
Bigg Boss: కార్తీక దీపం ఫేమ్ శోభాశెట్టి అలియాస్ మోనిత కన్నడ బిగ్‌బాస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యింది. తన ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆటపై ఫోకస్ పెట్టలేకపోతున్నానని, అందుకే బిగ్‌బాస్ ప్రయాణానికి ముగింపు పలికానంటూ శోభాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 4 ఎపిసోడ్‌లో బాలు కారును ఫైనాన్షియర్ లాగేసుకున్న విషయం రోహిణి బయటపెడుతుంది. బాలుకు ఏం జాబ్ లేదని మనోజ్, రోహిణి అవమానిస్తారు. భర్తకు తన కళ్ల ముందే అవమానం జరగడం మీనా సహించలేకపోతుంది.
Brahmamudi: బ్రహ్మముడి డిసెంబర్ 4 ఎపిసోడ్‌లో రాజ్‌లో మార్పు కోసం భర్తకు విడాకుల నోటీసులు పంపిస్తుంది అపర్ణ. కానీ తల్లి ప్లాన్‌ను తిప్పికొడతాడు రాజ్. తండ్రికి పంపించిన విడాకుల నోటీసు వెనక్కి తీసుకోకపోతే తాను కావ్యకు విడాకులు ఇస్తానని అపర్ణను హెచ్చరిస్తాడు.
- Arjun Reddy: అర్జున్ రెడ్డిలాంటి అబ్బాయిలు నిజ జీవితంలోనూ ఉంటారని ఈ మూవీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో నటించిన నటుడు షాహిద్ కపూర్ అనడం విశేషం. అమ్మాయిలు కూడా వాళ్ల వెంటే పడతారని అతడు అభిప్రాయపడ్డాడు.
- NNS December 4th Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (డిసెంబర్ 4) ఎపిసోడ్లో మనోహరి, అంజు ప్లాన్ సక్సెస్ అవుతుంది. పిల్లలు ఎక్స్‌కర్షన్ కు వెళ్లేందుకు అమర్ అంగీకరిస్తాడు. దీంతో మిస్సమ్మలో ఆందోళన మొదలవుతుంది.
Bigg Boss Voting: బిగ్‌బాస్‌లో ఈ వారం ఓటింగ్‌లో నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా...గౌతమ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ వీక్ రోహిణి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. బిగ్‌బాస్ నుంచి ఆమె ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.