Daku Maharaj Update: డాకు మహారాజ్‌కు గుమ్మడికాయ కొట్టేసిన బాలకృష్ణ - సంక్రాంతికే వచ్చేస్తోంది!
Daku Maharaj Update: బాలకృష్ణ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తయినట్లు బుధవారం మేకర్స్ ప్రకటించారు. ఈ మాస్ యాక్షన్ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తోన్నాడు. సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో డాకు మహారాజ్ పోటీపడబోతుంది.
Daku Maharaj Update: బాలకృష్ణ డాకు మహారాజ్‌ను నుంచి కొత్త అప్‌డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మాస్ యాక్షన్ మూవీ షూటింగ్ పూర్తయినట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు డాకు ఇన్ యాక్షన్ పేరుతో ఓ వర్కింగ్ స్టిల్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌లో బాలకృష్ణకు సీన్ వివరిస్తూ డైరెక్టర్ బాబీ కనిపిస్తోన్నాడు. డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
109వ సినిమా…
బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 109వ సినిమా ఇది. ఇందులో ఈ మూవీలో శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
టీజర్ రిలీజ్...
ఇటీవలే డాకు మహారాజ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు...చీకటిని శాసించే రాక్షసులది కాదు...ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు...ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది...గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది...మరణాన్నే వణికించిన మహారాజుది అనే డైలాగ్‌తో టీజర్ అభిమానులను ఆకట్టుకుంది.
కంప్లీట్‌గా సరికొత్త బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు టీజర్‌తో మేకర్స్ ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చారు. డాకు మహారాజ్‌లో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ ఆవిష్కరించబోతున్నట్లు సమాచారం.
హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ...
డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా డాకు మహారాజ్ తెరకెక్కుతోంది.
గేమ్ ఛేంజర్ కూడా...
సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో డాకు మహారాజ్ పోటీపడబోతుంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతోంది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూడు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
అఖండ 2
డాకు మహారాజ్ తర్వాత బోయపాటి శ్రీనుతో అఖండ 2 మూవీ చేయబోతున్నాడు బాలకృష్ణ. అఖండకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో అఖండ 2 మొదలైంది. ఈ సినిమాకు బాలకృష్ణ కూతురు తేజస్విని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది.