Virupaksha Teaser: విరూపాక్ష టీజ‌ర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌-sai dharam tej virupaksha teaser release date locked
Telugu News  /  Entertainment  /  Sai Dharam Tej Virupaksha Teaser Release Date Locked
సాయిధ‌ర‌మ్‌తేజ్
సాయిధ‌ర‌మ్‌తేజ్

Virupaksha Teaser: విరూపాక్ష టీజ‌ర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌

26 February 2023, 12:26 ISTNelki Naresh Kumar
26 February 2023, 12:26 IST

Virupaksha Teaser: మెగా యంగ్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ విరూపాక్ష టీజ‌ర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స‌యింది. ఈ టీజ‌ర్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

Virupaksha Teaser: విరూపాక్ష సినిమాతో దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. విరూపాక్ష టీజ‌ర్‌ను మార్చి 1న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిరంది. టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

విరూపాక్ష సినిమాతో ఫ‌స్ట్ టైమ్ పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. తెలుగుతో పాటు హిందీ, ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవ‌లే సాయిధ‌ర‌మ్‌తేజ్ రియ‌ల్‌గా చేసిన రిస్కీ బైక్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సింగిల్ షాట్‌లోనే ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో సాయిధ‌ర‌మ్‌తేజ్ పూర్తిచేసిన‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌కు జోడీగా సంయుక్త హీరోయిన్‌గా న‌టిస్తోంది. విరూపాక్ష సినిమాతో కార్తిక్ దండు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్నాడు. గ‌తంలో అత‌డు అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ వ‌ద్ద రైటింగ్ విభాగంలో అసిస్టెంట్‌గా ప‌నిచేశాడు. విరూపాక్ష సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చుతున్నారు. అజ‌నీష్ లోక‌నాథ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

కాగా 2021 సెప్టెంబ‌ర్‌లో బైక్ యాక్సిడెంట్ కార‌ణంగా తీవ్రంగా గాయ‌ప‌డ్డ సాయిధ‌ర‌మ్‌తేజ్ చాలా రోజుల పాటు సినిమా షూటింగ్‌ల‌కు దూరంగా ఉన్నారు. అందువ‌ల్లే విరూపాక్ష సినిమా షూటింగ్ ఆల‌స్య‌మైంది. ప్ర‌స్తుతం ఈ విరూపాక్ష‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మ‌రో సినిమా చేస్తోన్నాడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌.