Chandini Chowdary: ఒకే రోజు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కానున్న చాందిని చౌద‌రి రెండు సినిమాలు-chandini chowdary music shop murthy and yevam movies will be releasing in theaters on same day ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chandini Chowdary: ఒకే రోజు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కానున్న చాందిని చౌద‌రి రెండు సినిమాలు

Chandini Chowdary: ఒకే రోజు థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కానున్న చాందిని చౌద‌రి రెండు సినిమాలు

Nelki Naresh Kumar HT Telugu
Jun 02, 2024 06:22 AM IST

Chandini Chowdary: అచ్చ తెలుగు హీరోయిన్ చాందిని చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న మ్యూజిక్ షాప్ మూర్తి, యేవ‌మ్ సినిమాలుఒకే రోజు థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతున్నాయి. జూన్ 14న ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

చాందిని చౌద‌రి
చాందిని చౌద‌రి

Chandini Chowdary: ఓ హీరో లేదా హీరోయిన్ న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు థియేట‌ర్ల‌లో రిలీజ్ కావ‌డం అన్న‌ది అరుదుగా జ‌రుగుతుంటుంది. గ‌తంలో ఒక‌రిద్ద‌రు స్టార్‌హీరోల కెరీర్‌లో ఇలా జ‌రిగింది. తాజాగా అచ్చ తెలుగు హీరోయిన్ చాందిని చౌద‌రి న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. యేవ‌మ్‌, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు జూన్ 14న రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ఓ మూవీ కామెడీ ఎమోష‌న‌ల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కుతోండ‌గా...మ‌రో సినిమా సీరియ‌స్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.

మ్యూజిక్ షాప్ మూర్తి....

మ్యూజిక్ త‌ప్ప మ‌రోటి తెలియ‌ని మూర్తి అనే వ్య‌క్తి క‌థ‌తో మిడిల్ క్లాస్ క‌ష్టాల‌ను ఆవిష్క‌రిస్తూ మ్యూజిక్ షాప్ మూర్తి రూపొందుతోంది. మిడిల్ ఏజ్‌లో డీజే కావాల‌ని క‌ల‌లు క‌న్న మూర్తి ప్ర‌యాణం ఎలా సాగింద‌నే పాయింట్‌ను ఎమోష‌న్స్‌, కామెడీతో ద‌ర్శ‌కుడు శివ పాల‌డుగు ఈ సినిమాలో చూపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో మూర్తికి అండ‌గా నిల‌బ‌డే యువ‌తిగా చాందిని చౌద‌రి న‌టించింది.

యాక్టింగ్‌కు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఈ మూవీ మొత్తం అజ‌య్ ఘోష్‌, చాంద‌ని చౌద‌రి పాత్ర‌ల నేపథ్యంలోనే సాగనున్నట్లు టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ చూస్తే తెలుస్తోంది.మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో టైటిల్ పాత్ర‌లో అజ‌య్ ఘోష్ న‌టించాడు. ఆమ‌ని, అమిత్ శ‌ర్మ‌, భాను చంద‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

పోలీస్ ఆఫీస‌ర్‌...

యేవ‌మ్ సినిమాలో చాందిని చౌద‌రి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. సైకో కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించే ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్‌గా ఈ మూవీలో క‌నిపించ‌బోతున్న‌ది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీకి ప్ర‌కాష్ దంతులూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హీరో న‌వ‌దీప్‌తో క‌లిసి ప‌వ‌న్ గోప‌రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్స్, ట్రైలర్స్ ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి.

మ‌హిళా సాధికార‌త‌ను...

వ‌శిష్ట సింహా విల‌న్‌గా న‌టిస్తోన్న యేవమ్ మూవీలో భ‌ర‌త్‌రాజు, ఆషూరెడ్డి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతోంది. మహిళా సాధికార‌త‌ను చాటి చెప్పే క‌థ ఇద‌ని, కొత్త కంటెంట్‌, డిఫరెంట్‌ నేరేషన్‌తో యేవ‌మ్ మూవీ అందరికి నచ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని ప్ర‌మోష‌న్స్‌లో చిత్ర యూనిట్ చెబుతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి, యేవ‌మ్ రెండు సినిమాల ప్ర‌మోష‌న్స్‌లో చాందిరి చౌద‌రి పాల్గొంటోంది.

గామితో స‌క్సెస్‌....

తెలుగులో ప్రేమ ఇష్క్ కాద‌ల్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది చౌంద‌ని చౌద‌రి. మ‌ను, క‌ల‌ర్ ఫొటో, స‌మ్మ‌త‌మే తో పాటు ప‌లు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. క‌ల‌ర్ ఫొటో మూవీ నేష‌న‌ల్ అవార్డును అందుకున్న‌ది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం, నితిన్ లైతో పాటు మరికొన్ని భారీ బడ్జెట్ మూవీస్ లలో కీలక పాత్రలు చేసింది.

ఇటీవ‌ల రిలీజైన విశ్వ‌క్‌సేన్ గామిలో హీరోయిన్ గా కనిపించింది. అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యాన్ని సాధించింది. స‌బా నాయ‌గ‌న్ మూవీతో గ‌త ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం సంతాన ప్రాప్తిర‌స్తు పేరుతో ఓ మూవీ చేస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్