Zee5 OTT: జీ5 ఓటీటీలో టాప్ ఫైవ్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ - సీక్వెల్ కూడా రాబోతోంది
Zee5 OTT: అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరోహీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎస్.ఐ.టి థియేటర్లలో కాకుండా నేరుగా జీ5 ఓటీటీలో రిలీజైంది. జీ 5 ఓటీటీలో ఈ తెలుగు మూవీ టాప్ ఫైవ్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
Zee5 OTT: అరవింద్ కృష్ణ , రజత్ రాఘవ్ హీరోలుగా నటించిన తెలుగు మూవీ ఎస్. ఐ. టి. (S.I.T ) ఇటీవలే డైరెక్ట్‌గా జీ5 ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నటాషాదోషి, రుచితా సాదినేని హీరోయిన్లుగా నటించారు. ఎస్. ఐ. టి. (S.I.T ) మూవీకి విజయభాస్కర్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సక్సెస్ గురించి విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ….
టాప్ ఫైవ్ ట్రెడింగ్...
ఎస్. ఐ. టి మూవీ జీ5 టాప్ ఫైవ్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా కొనసాగుతోన్నట్లు దర్శకుడు తెలిపాడు. హిందీ, తమిళంతో పాటు ఇతర భాషల సినిమాలను దాటేసి తమ మూవీ ట్రెండింగ్‌లో నిలవడం ఆనందంగా ఉందని అన్నాడు. ఓటీటీ ద్వారా పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీ రీచ్ అయ్యిందని దర్శకుడు చెప్పాడు.
సీక్వెల్...
ఎస్. ఐ. టి మూవీ ఓటీటీని దృష్టిలో పెట్టుకొనే చేశాం. ఓటీటీ కంటెంట్ కాబట్టి.. ముందు నుంచి కూడా మేం ఓటీటీ కోసమే ప్రయత్నాలు చేశాం. చివరకు మా సినిమా జీ5 ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. సిట్ మూవీకి రెండో పార్ట్ ... మూడో పార్ట్ కూడా ఉండబోతుంది. సీక్వెల్‌కు సంబంధించి కథ సిద్ధం చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్‌కు మించి మలుపులు, యాక్షన్‌తో సీక్వెల్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
పోలీస్ ఆఫీసర్‌గా అరవింద్ కృష్ణ యాక్టింగ్ అందరిని మెప్పిస్తోంది. . నటుడిగా అతడి కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా సిట్ నిలిచింది. నటాషా, రజత్ రాఘవ్‌తో పాటు ప్రతి ఒక్కరికి ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది.
కడప జిల్లాలో పుట్టి పెరిగా...
‘కడప జిల్లాలోనే పుట్టి పెరిగాను. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. నా డిగ్రీ తరువాత హైదరాబాద్‌కు వచ్చాను. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశాను. ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చాను. అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా పలు దర్శకుల వద్ద పని చేశాను.పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను.
నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేయడంతో ఎస్.ఐ.టి మూవీ ప్రారంభమైంది. ఈ కథను వెబ్ సిరీస్ కంటే సినిమా తీస్తేనే బాగుంటుందని అనుకున్నాం. అందరం కలిసే ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఎస్.ఐ.టి (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు.
ఎస్.ఐ.టి కథ ఇదే..
ఓ మహిళా అనుమానాస్పద రీతిలో హత్యకు గురవుతుంది. సంచలనంగా మారిన ఈ కేసును సాల్వ్ చేసే బాధ్యతను ఎస్.ఐ.టి టీమ్ చేబడుతుంది. ఆ మహిళ భర్తే హంతకుడు అని పోలీసులు ఫిక్సవుతారు. అలాంటి టైమ్‌లోనే ఆ మర్డర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి? అవేమిటి? ఈకేసును తమ తెలివితేటలతో ఎస్ఐటి టీమ్ ఎలా సాల్వ్ చేసింది అన్నదే ఈ మూవీ కథ.
ఏ మాస్టర్ పీస్ మూవీ...
యంగ్ ఇండియా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అరవింద్ కృష్ణ. ఆ తర్వాత హీరోగా ఇట్స్ మై లవ్ స్టోరీ, రుషి, అడవి కాచిన వెన్నెల, బిస్కెట్‌తో పాటు పలు సినిమాలు చేశాడు. ఈ సినిమాలు సరైన విజయాల్ని సాధించకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు అరవింద్ కృష్ణ...ప్రేమమ్, రామారావు ఆన్ డ్యూటీతో పాటు మరికొన్ని సినిమా ల్లో కనిపించాడు. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ సినిమాలో హీరోగా నటిస్తోన్నాడు అరవింద్ కృష్ణ. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది