Salman Khan Lip lock: సల్మాన్ ఖాన్ కిస్ చేసిన ఆ ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా? ఆ స్టార్ హీరోయిన్‌తోనే..
Salman Khan Lip lock: సల్మాన్ ఖాన్ సినిమాలంటే నో లిప్ లాక్స్. కానీ అతడు కూడా ఓ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ తో చేసిన ఓ కిస్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Salman Khan Lip lock: సల్మాన్ ఖాన్ తన సినిమాల్లో హీరోయిన్లతో లిప్ లాక్, ఘాటు రొమాన్స్ సీన్లకు నో చెబుతుంటాడు. అలాంటి సీన్లు తాను చేయనని నిర్మొహమాటంగా స్పష్టం చేస్తాడు. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ ఫొటో బాగా వైరల్ అవుతోంది. అందులో సల్మాన్ ఓ స్టార్ హీరోయిన్ ను కిస్ చేస్తున్న ఫొటో. ఎప్పుడో 28 ఏళ్ల కిందట వచ్చిన సినిమాలోనే అతడీ సీన్ చేసినట్లు పలువురు నెటిజన్లు చెబుతున్నారు.
సల్మాన్ ఖాన్ లిప్ లాక్
సల్మాన్ ఖాన్ తన కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించాడు. అందులో ఐశ్వర్య రాయ్, సంగీతా బిజ్లానీ, కత్రినా కైఫ్ లాంటి వాళ్లతో నిజ జీవితంలోనూ రిలేషన్షిప్ లో ఉన్నాడు. కానీ వాళ్లెవరితోనూ స్క్రీన్ పై ఘాటు కిస్ సీన్లు చేయలేదు. అయితే ఈ మధ్యే సల్మాన్ లిప్ లాక్ ఫొటో ఒకటి ఓ రెడిట్ యూజర్ బయటపెడుతూ.. సల్లూ భాయ్ కూడా ఆ సీన్లు చేశాడని కామెంట్ చేశారు.
ఇంతకీ సల్మాన్ లిప్ లాక్ సీన్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరైన కరిష్మా కపూర్. ఆ సినిమా పేరు జీత్. 1996లో వచ్చిన ఈ సినిమాలో కరిష్మాతో లిప్ లాక్ ఫొటో ఇదే అంటూ సోషల్ మీడియాతో తెగ వైరల్ చేస్తున్నారు. తన నో కిస్ పాలసీని ఎన్నో ఏళ్ల కిందటే సల్మాన్ ఖాన్ బ్రేక్ చేశాడని రెడిట్ యూజర్లు అంటున్నారు.
అయితే మరికొందరు మాత్రం ఫొటో జాగ్రత్తగా చూడండి.. అది లిప్ లాక్ కాదు.. సల్మాన్ చెంపపై కరిష్మా కిస్ చేస్తున్నట్లుగా ఉందని కామెంట్స్ చేస్తుండటం విశేషం. నిజానికి ఇది తప్ప సల్మాన్ ఏ సినిమాలోనూ ఏ హీరోయిన్ తోనూ ఘాటు రొమాన్స్ సీన్ చేసినట్లు కనిపించదు. 2017లో టైగర్ జిందా హై సినిమాలో కత్రినా కైఫ్ తో కిస్ సీన్ చేయాలని అడిగినా.. సల్మాన్ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి.
సల్మాన్ ఖాన్ మూవీస్
సల్మాన్ ఖాన్ గతేడాది టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ పోషించాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంతగా ఆడలేదు. ఈ ఏడాది అతని సినిమాలేవీ రావడం లేదు. వచ్చే ఏడాది మాత్రం సికందర్ మూవీతో రానున్నాడు. ఇక 2026లో రేస్ 4 మూవీలోనూ సల్మాన్ నటిస్తున్నాడు.
వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే సల్మాన్ ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. తనతో నటించిన ఎంతో మంది హీరోయిన్లతో డేటింగ్ చేసినా.. ఎవరితోనూ ఆ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లలేదు. ప్రస్తుతం అతడు ఓ టీవీ ప్రెజెంటర్ లూలియా వాంటూర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. దీనిపై ఎప్పుడూ సల్మాన్ నోరు మెదపలేదు. ఆమె సల్మాన్ తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా.. అతడు తనకు కేవలం ఫ్రెండ్ అని ఆ మధ్య లూలియా చెప్పడం విశేషం.