OG Movie: ఓజీ సినిమా ట్రైలర్ రెడీ అయిందట.. టైటిల్ అర్థమేంటో చెప్పేసిన డైరెక్టర్ సుజీత్-director sujeeth reveals pawan kalyan og title meaning and gives update about trailer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Og Movie: ఓజీ సినిమా ట్రైలర్ రెడీ అయిందట.. టైటిల్ అర్థమేంటో చెప్పేసిన డైరెక్టర్ సుజీత్

OG Movie: ఓజీ సినిమా ట్రైలర్ రెడీ అయిందట.. టైటిల్ అర్థమేంటో చెప్పేసిన డైరెక్టర్ సుజీత్

Chatakonda Krishna Prakash HT Telugu
May 27, 2024 02:51 PM IST

OG Movie Trailer, Title: ఓజీ సినిమా ట్రైలర్ గురించి డైరెక్టర్ సుజీత్ అప్‍డేట్ ఇచ్చారు. అలాగే, ఈ మూవీకి ఓజీ టైటిల్ ఎందుకు ఫిక్స్ చేశారో కూడా వెల్లడించారు. పవన్ కల్యాణ్ చిత్రాల్లో తనకు ఎక్కువ నచ్చినదోదే కూడా చెప్పారు.

OG Trailer: ఓజీ సినిమా ట్రైలర్ రెడీ అయిందట.. టైటిల్ అర్థమేంటో చెప్పేసిన డైరెక్టర్ సుజీత్
OG Trailer: ఓజీ సినిమా ట్రైలర్ రెడీ అయిందట.. టైటిల్ అర్థమేంటో చెప్పేసిన డైరెక్టర్ సుజీత్

OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ (They Call him OG) సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ అందరికీ తెగనచ్చేసింది. గ్యాంగ్‍స్టర్‌గా పవన్ యాక్షన్, స్వాగ్ అదిరిపోయాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఓజీ మూవీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్‍కు బ్రేక్ పడింది. ఓజీ సినిమా గురించి ఇప్పుడు తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు డైరెక్టర్ సుజీత్.

కార్తికేయ హీరోగా నటిస్తున్న భజే వాయువేగం మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ సుజీత్ పాల్గొన్నారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది . కార్తీకేయ, భజే వాయువేగం మూవీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డితో సుజీత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఓజీ సినిమా గురించిన విషయాలను సుజీత్ వెల్లడించారు.

ఓజీ టైటిల్ అర్థమిదే

ఈ సినిమాకు ఓజీ అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా సుజీత్ చెప్పారు. ‘ఓజాస్ గంభీర’ను ఓజీగా పెట్టినట్టు తెలిపారు. ఓజాస్ అంటే మాస్టర్ అనే అర్థమని, గంభీర అనేది పవన్ క్యారెక్టర్ పేరు అని సుజీత్ వివరించారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ మాస్టర్ అని అన్నారు. అలా ఓజాస్ గంభీరను ఓజీగా పెట్టామని తెలిపారు. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్ అని కూడా కలిసి వస్తుందని.. అందుకే ఆ టైటిల్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. అంటే, ఈ మూవీలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‍స్టర్‌గానూ, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌గానూ కనిపిస్తారని అర్థమవుతోంది. ఈ మూవీలో జపనీస్ రెఫరెన్సులు ఎక్కువగా ఉంటాయని సుజీత్ అన్నారు.

ట్రైలర్ రెడీ

ఓజీ సినిమా ట్రైలర్ ఇప్పటికే సిద్ధమైందని డైరెక్టర్ సుజీత్ చెప్పారు. “ట్రైలర్ ఇప్పటికే చేసేశాం. మూవీ రిలీజ్‍కు ముందు వస్తుంది. పవన్ కల్యాణ్‍ను కొత్తగా చూపించేందుకు చాలా ఎగ్జైటెడ్‍గా ఉన్నా” అని సుజీత్ చెప్పారు. అయితే, ట్రైలర్ ఎప్పుడు తీసుకొచ్చేంది ఆయన వెల్లడించలేదు. అయితే, మూవీ రిలీజ్‍కు ముందు వస్తుందని అన్నారు.

జానీ చాలా ఇష్టం

పవన్ కల్యాణ్ సినిమాల్లో తనకు జానీ అంటే చాలా ఇష్టమని సుజీత్ చెప్పారు. ఆ చిత్రంలో నిజాయితీ ఉంటుందని, డైరెక్టర్‌గా అప్పట్లో పవన్ అద్భుతం చేశారని ఆయన అన్నారు. తాను అప్పట్లో జానీ బ్యాండ్‍ను తలకు కట్టుకొని వారం తిరిగానని అన్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన జానీ చిత్రం 2003లో విడుదలైంది. కమర్షియల్‍గా ఈ మూవీ సక్సెస్ కాకపోయినా ప్రశంసలను దక్కించుకుంది. ఇక, అతడు సినిమా ప్రభావం కూడా తనపై చాలా ఉందని సుజీత్ తెలిపారు.

ఓజీ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసుకుంది. ఎన్నికల ఫలితాల సందడి అయిపోయాక త్వరలోనే ఈ మూవీ షూటింగ్‍కు పవన్ వెళ్లే అవకాశం ఉంది. షూటింగ్ ఆలస్యమైతే ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందనే రూమర్లు కూడా వస్తున్నాయి. ఓజీ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024