OG Release Date: పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే వస్తోందని అధికారికంగా రివీల్ చేసిన మూవీ టీమ్-og release date confirmed movie team revealed power star pawan kalyan movie release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Og Release Date: పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే వస్తోందని అధికారికంగా రివీల్ చేసిన మూవీ టీమ్

OG Release Date: పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే వస్తోందని అధికారికంగా రివీల్ చేసిన మూవీ టీమ్

Hari Prasad S HT Telugu
Feb 06, 2024 05:44 PM IST

OG Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.

పవన్ కల్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
పవన్ కల్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

OG Release Date: పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. అతని నెక్ట్స్ మూవీ ఓజీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓజీ మేకర్స్ మంగళవారం (ఫిబ్రవరి 6) అధికారికంగా అనౌన్స్ చేశారు.

సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గతేడాది బ్రో సూపర్ హిట్ అయిన తర్వాత పవన్ ఈ ఓజీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఓజీ రిలీజ్ డేట్

ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27నే చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను తెరకెక్కిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ మంగళవారం (ఫిబ్రవరి 6) తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. పవర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయినప్పటి నుంచీ సోషల్ మీడియా ఎక్స్ లో దే కాల్ హిమ్ ఓజీతోపాటు పవన్ కల్యాణ్ ట్రెండింగ్ లో ఉన్నాడు.

ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పవన్ కు సంబంధించిన ఓ స్టైలిష్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ కారు పక్కన చేతిలో చాయ్ గ్లాస్ పట్టుకొని పవర్ స్టార్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతేడాది జనవరి 30న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా 2013లో సెప్టెంబర్ 27వ తేదీనే విడుదలైంది. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది. భారీ బ్లాక్‍బాస్టర్ అయింది. దీంతో అదే సెంటిమెంట్‍తో ఈ ఏడాది 2024 సెప్టెంబర్ 27న ఓజీని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఓజీ మూవీ గురించి..

1950ల బ్యాక్‍డ్రాప్‍లో ముంబైలో గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ మూవీ ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కనిపించనున్నారు. గ్లింప్స్‌లో పవన్ యాక్షన్, స్వాగ్, స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది.

ఈ ఓజీ మూవీలో పవన్ ఓ పాట కూడా పాడనున్నట్లు ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించాడు. గతంలో తమ్ముడు, అత్తారింటికి దారేదిలాంటి సినిమాల్లో పవన్ పాట పాడిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పవన్ తన గళం విప్పితే మూవీ బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ ను మరోసారి ఓజీ ద్వారా నిరూపించాలని మేకర్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ బిజీగా ఉన్నాడు. మేలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక తన సినిమాలపై అతడు దృష్టి సారించనున్నాడు. మొదట ఓజీ మూవీని పూర్తి చేసి రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో పాల్గొననున్నాడు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు.

IPL_Entry_Point