Guntur Kaaram సినిమా మధ్యలో వెళ్లిపోయిన త్రివిక్రమ్.. బూతులు తిడుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్-guntur kaaram public talk and mahesh babu angry on trivikram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram సినిమా మధ్యలో వెళ్లిపోయిన త్రివిక్రమ్.. బూతులు తిడుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్

Guntur Kaaram సినిమా మధ్యలో వెళ్లిపోయిన త్రివిక్రమ్.. బూతులు తిడుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్

Sanjiv Kumar HT Telugu
Jan 12, 2024 02:31 PM IST

Guntur Kaaram Trivikram: మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా జనవరి 12న విడుదలైంది. శుక్రవారం మిడ్ నైట్ నుంచే షోలు పడ్డాయి. అయితే ఆ షోలు చూసిన ప్రేక్షకులు డైరెక్టర్ తివిక్రమ్‌పై తెగ ఫైర్ అవుతున్నారు. థియేటర్‌లో ఉండుంటే అంటూ బూతులు తిడుతున్నారు.

సినిమా మధ్యలో వెళ్లిపోయిన త్రివిక్రమ్.. బూతులు తిడుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్
సినిమా మధ్యలో వెళ్లిపోయిన త్రివిక్రమ్.. బూతులు తిడుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్

Guntur Kaaram Public Talk: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మూడోసారి ఈ కాంబినేషన్‌లో మూవీ రావడంతో భారీ హైప్స్ పెరిగాయి. అలాగే ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా ప్రారంభం నుంచి ఏదో ఒక సమస్య తలెత్తిన క్రేజ్ మాత్రం తగ్గలేదు.

గుంటూరు కారం మూవీ భారీ అంచనాల నడుమ జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే మిడ్ నైట్ షోలు పడ్డాయి. దాంతో రాత్రి నుంచే గుంటూరు కారం మూవీపై పబ్లిక్ టాక్ వస్తోంది. ఇప్పుడు గుంటూరు కారంపై ఆడియెన్స్ రెస్పాన్స్ వైరల్ అవుతోంది. అయితే, ఎన్నో అంచనాలతో వచ్చిన గుంటూరు కారం మూవీకి నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్స్, సినీ లవర్స్ మూవీపై పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నెగెటివ్ టాక్‌తో గుంటూరు కారం మూవీ ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా మాటల మాంత్రికుడు, డైరెక్టర్ తివిక్రమ్‌ను మహేశ్ బాబు అభిమానులు ఘోరంగా తిడుతున్నారు. థియేటర్‌లో దొరికితే కొట్టేవాళ్లమంటూ కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో, అజ్ఞాతవాసి ఇలా సినిమాలన్నింటిని కలిపి ఏదో ఒకటి తీసినట్లుగా ఉందని మండిపడుతున్నారు. కనీసం ఈ సినిమాల్లో స్టోరీ ఉందని, గుంటూరు కారం మరీ దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు కారం సినిమాపై ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్‌గా బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారు ప్రజలు. గుంటూరు కారంలో ఏం లేదని, మరో అజ్ఞాతవాసి అయిందని అంటున్నారు. అది అజ్ఞాతవాసి అయితే.. ఇది గుంటూరు వాసి అయిందని గగ్గోలు పెడుతున్నారు. కథ లేకుండా నాలుకు కామెడీ సీన్స్, ఫైట్ సీన్స్ పెట్టి తూతూ మంత్రంగా సినిమాను నెట్టుకొచ్చినట్లు ఉందంటున్నారు. అలాగే మరోవైపు కొంతమంది బాగుందని ప్రశంసిస్తున్నారు.

గుంటూరు కారం సినిమాలో మహేశ్ బాబు మాత్రమే హైలెట్ అని చెబుతున్నారు. అందరూ మెచ్చే త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఒక్కటి కూడా లేదంటున్నారు ఆడియెన్స్. ఈ క్రమంలోనే మిడ్ నైట్ షో చూసిన ఓ అభిమాని త్రివిక్రమ్‌ను ఘోరంగా తిట్టాడు. "సినిమా ఇంటర్వెల్‌లో తివిక్రమ్ వెళ్లిపోయాడు. ఉండుంటేనా.." అంటూ ఏదో బూతు తిట్టాడు. దానికి బీప్ వేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అలాగే "సినిమా బొక్క" అని అదే వ్యక్తి చెప్పాడు. "ఇంకొక అజ్ఞాతవాసి కాలేదు అంతే.. అంతకుమించి చెప్పుకునే ఒక్క ప్లస్ పాయింట్ లేదు. ఒక్క మహేశ్ బాబు తప్పితే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు" అని మరొక వ్యక్తి తెలిపాడు. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. ఎస్. థమన్ సంగీతం అందించారు.

Whats_app_banner