KKR vs SRH IPL 2024 Qualifier 1 Updates: నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన కోల్‍కతా.. హైదరాబాద్‍పై అలవోకగా గెలుపు-ipl 2024 qualifier 1 kkr vs srh live updates surisers hyderabad kolkata knight riders playoffs match live score ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kkr Vs Srh Ipl 2024 Qualifier 1 Updates: నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన కోల్‍కతా.. హైదరాబాద్‍పై అలవోకగా గెలుపు
IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates కోల్‍కతా నైట్‍రైడర్స్ వర్సెస్ సన్‍రైజర్స్ హైదరాబాద్

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates కోల్‍కతా నైట్‍రైడర్స్ వర్సెస్ సన్‍రైజర్స్ హైదరాబాద్(IPL)

KKR vs SRH IPL 2024 Qualifier 1 Updates: నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన కోల్‍కతా.. హైదరాబాద్‍పై అలవోకగా గెలుపు

Updated May 21, 2024 11:24 PM ISTUpdated May 21, 2024 11:24 PM IST
  • Share on Facebook
Updated May 21, 2024 11:24 PM IST
  • Share on Facebook

  • IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా నేడు (మే 21) జరిగిన క్వాలిఫయర్-1లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై కోల్‌కతా అలవోకగా గెలిచింది. 38 బంతులు మిగిల్చీ మరీ లక్ష్యాన్ని ఛేదించింది కేకేఆర్.

Tue, 21 May 202405:54 PM IST

హైదరాబాద్‍ ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఫైనల్ చేరేందుకు సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు మరో అవకాశం మిగిలి ఉంది. బెంగళూరు, రాజస్థాన్ మధ్య జరిగే ఎలిమినేటర్‌(మే22)లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో హైదరాబాద్ 24న తలపడనుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‍లో మే 26న కోల్‍కతాతో పోటీ పడనుంది.

Tue, 21 May 202405:49 PM IST

నాలుగోసారి ఐపీఎల్ ఫైనల్‍కు కేకేఆర్

ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ నాలుగోసారి ఫైనల్ చేరింది. 2012, 2014, 2021లో ఫైనల్ ఆడిన కేకేఆర్ ఇప్పుడు 2024 సీజన్‍లోనూ తుదిపోరుకు అర్హత సాధించింది. 2021, 2014లో టైటిల్స్ సాధించింది కేకేఆర్.

Tue, 21 May 202406:01 PM IST

KKR vs SRH IPL 2024 Qualifier 1 Live Updates: ఫైనల్ చేరిన కోల్‍కతా నైట్‍రైడర్స్ .. హైదరాబాద్‍పై గెలుపు

ఐపీఎల్ 2024 సీజన్ క్వాలిఫయర్-1లో సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై కోల్‍కతా నైట్‍రైడర్స్ అలవోకగా గెలిచింది. దీంతో ఫైనల్ చేరింది. 13.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 164 పరుగులు చేసి కేకేఆర్ గెలిచింది. వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 పరుగులు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 58 నాటౌట్) దూకుడుగా హాఫ్ సెంచరీలు చేయడంతో 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది కోల్‍కతా. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్, నటరాజన్ చెరో వికెట్ తీశారు.

Tue, 21 May 202405:00 PM IST

వెంకటేశ్ అయ్యర్ దూకుడు

కోల్‍కతా బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 38 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో 10 ఓవర్లలో కోల్‍కతా 2 వికెట్లకు 107 పరుగులు చేసింది. ఇక గెలువాలంటే 10 ఓవర్లలో కేవలం 53 పరుగులే చేయాలి. శ్రేయస్ అయ్యర్ (14 పరుగులు నాటౌట్) మరో ఎండ్‍లో ఉన్నాడు.

Tue, 21 May 202404:43 PM IST

నరైన్ ఔట్

కోల్‍కతా బ్యాటర్ సునీల్ నరైన్ (16 బంతుల్లో 21 పరుగులు) ఔటయ్యాడు. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‍లో విజయ్‍కాంత్‍కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 6.2 ఓవర్లలో 67 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది కోల్‍కతా.

Tue, 21 May 202404:40 PM IST

కోల్‍కతా జోరు

కోల్‍కతా నైట్‍రైడర్స్ బ్యాటర్లు సునీల్ నరైన్ (14 బంతుల్లో 17 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (8 బంతుల్లో12 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు. దీంతో లక్ష్యం దిశగా కోల్‍కతా జోరుగా ముందుగు సాగుతోంది. 6 ఓవర్లలో ఓ వికెట్‍కు 63 పరుగులు చేసింది.

Tue, 21 May 202404:24 PM IST

గుల్బాదిన్ ఔట్

కోల్‍కతా ఓపెనర్ గుల్బాదిన్ నైబ్ (14 బంతుల్లో 23 పరుగులు)ను హైదరాబాద్ పేసర్ నటరాజన్ ఔట్ చేశాడు. హైదరాబాద్‍కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. నాలుగో ఓవర్ రెండో బంతికి నైబ్ క్యాచౌట్ అయ్యాడు. దీంతో 44 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది కోల్‍కతా. నరైన్ (12 నాటౌట్) నిలకడగా ఆడుతున్నాడు.

Tue, 21 May 202404:13 PM IST

దూకుడుగా కోల్‍కతా

160 పరుగుల లక్ష్యఛేదనను కోల్‍కతా నైట్‍రైడర్స్ దూకుడుగా మొదలుపెట్టింది. రెండు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. కేకేఆర్ ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (12 నాటౌట్), సునీల్ నరైన్ (9 నాటౌట్) శుభారంభం చేశారు.

Tue, 21 May 202403:49 PM IST

సన్‍రైజర్స్ మోస్తరు స్కోరు

సన్‍రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. చివర్లో కెప్టెన్ కమిన్స్ 24 బంతుల్లో 30 పరుగులు చేయడంతో హైదరాబాద్‍కు మోస్తరు స్కోరు దక్కింది. చివరి ఓవర్ మూడో బంతికి కమిన్స్ ఔటయ్యాడు. కోల్‍కతా ముందు 160 పరుగుల టార్గెట్ ఉంది. కోల్‍కతా పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించాడు. వరుణ్ చక్రవర్తి రెండు, వైభవ్ ఆరోరా, నరైన్, రసెల్, రాణా చెరో వికెట్ తీశారు.

Tue, 21 May 202403:45 PM IST

కమిన్స్ అదుర్స్

సన్‍రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చివర్లో దుమ్మురేపుతున్నాడు. జట్టు 9 వికెట్లు కోల్పోయినా.. 22 బంతుల్లో 30 పరుగులతో దీటుగా ఆడుతున్నాడు. దీంతో 19 ఓవర్లలో 9 వికెట్లకు 156 రన్స్ చేసింది హైదరాబాద్.

Tue, 21 May 202403:30 PM IST

భువీ ఔట్

సన్‍రైజర్స్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ కూడా పెవిలియన్ చేరాడు. కోల్‍కతా స్పిన్నర్ బౌలింగ్‍లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో 16 ఓవర్లలో 126 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది హైదరాబాద్.

Tue, 21 May 202403:25 PM IST

సమద్ కూడా ఔట్

సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అబ్దుల్ సమాద్ (16) 15వ ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్‍లో క్యాచ్ ఔటయ్యాడు. దీంతో 14.4 ఓవర్లలో 125 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది హైదరాబాద్. దీంతో ఆలౌట్‍కు చేరువైంది.

Tue, 21 May 202403:18 PM IST

సన్వీర్ అలా వచ్చి ఇలా వెళ్లి..

త్రిపాఠి ఔటయ్యాక తదుపరి బంతికే సన్వీర్ సింగ్ (0) బౌల్డ్ అయ్యాడు. సునీల్ నరైన్ వికెట్ తీశాడు. దీంతో 121 పరుగుల వద్దే ఏడో వికెట్ కోల్పోయింది హైదరాబాద్.

Tue, 21 May 202403:18 PM IST

త్రిపాఠి రనౌట్

హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55 పరుగులు) హాఫ్ సెంచరీ తర్వాత కీలక సమయంలో రనౌట్ అయ్యాడు. దీంతో 13.2 ఓవర్లలో 121 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది సన్‍రైజర్స్.

Tue, 21 May 202403:04 PM IST

క్లాసెన్ క్యాచ్ ఔట్.. త్రిపాఠి హాఫ్ సెంచరీ

సన్‍రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ (21 బంతుల్లో 32 పరుగులు) ఔటయ్యాడు. 11వ ఓవర్ చివరి బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‍లో క్యౌచ్ ఔట్ అయ్యాడు. దీంతో 11 ఓవర్లలో 5 వికెట్లకు 101 పరుగులు చేసింది హైదరాబాద్. రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 51 పరుగులు నాటౌట్) హాఫ్ సెంచరీతో దీటుగా ఆడుతున్నాడు.

Tue, 21 May 202402:53 PM IST

త్రిపాఠి, క్లాసెన్ దూకుడు

సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 39 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (15 బంతుల్లో 24 పరుగులు నాటౌట్) దూకుడుగా ఆడుతున్నారు. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ కోలుకుంది. 9 ఓవర్లలో 4 వికెట్లకు 80 పరుగులకు చేరింది సన్‍రైజర్స్.

Tue, 21 May 202402:32 PM IST

వరుస బంతుల్లో నితీశ్, షాబాజ్ ఔట్

సన్‍రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు నితీశ్ కుమార్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. కోల్‍కతా పేసర్ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి నితీశ్ క్యాచ్ ఔట్ కాగా.. తర్వాతి బాల్‍కు షాబాజ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐదు ఓవర్లలో 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది హైదరాబాద్.

Tue, 21 May 202402:13 PM IST

అభిషేక్ శర్మ కూడా పెవిలియన్‍కు..

సన్‍రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ (3) కూడా ఔటయ్యాడు. కోల్‍కతా పేసర్ వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి అభిషేక్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ 13 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.

Tue, 21 May 202402:04 PM IST

ట్రావిస్ హెడ్ డకౌట్

తొలుత బ్యాటింగ్‍కు దిగిన సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆదిలోనే షాక్ ఎదురైంది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0) బౌల్డ్ అయ్యాడు. కోల్‍కతా నైట్‍రైడర్స్ పేసర్ స్టార్క్ బౌలింగ్‍లో ఔటయ్యాడు. దీంతో పరుగుల ఖాతాతో తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది హైదరాబాద్.

Tue, 21 May 202401:41 PM IST

తుది జట్లు ఇవే

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: సన్‍రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియస్కాంత్, నటరాజన్

కోల్‍కతా నైట్‍రైడర్స్ : సునీల్ నరైన్, రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‍దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

Tue, 21 May 202401:33 PM IST

KKR vs SRH Live Updates: టాస్ గెలిచిన సన్‍రైజర్స్ హైదరాబాద్

కోల్‍కతాతో క్వాలిఫయర్-1లో సన్‍రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచాడు. ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు.

Tue, 21 May 202401:08 PM IST

KKR vs SRH: మైలురాయికి చేరువలో భువనేశ్వర్

సన్‍రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలకమైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరొక్క వికెట్ తీస్తే టీ20 క్రికెట్‍లో 300 వికెట్లను పూర్తి చేసుకుంటాడు.

Tue, 21 May 202412:36 PM IST

KKR vs SRH IPL 2024 Qualifier 1 Live Updates: పిచ్ ఇలా..

అహ్మదాబాద్ పిచ్ నేడు బ్యాటింగ్‍కు ఎక్కువగా అనుకూలించేలా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. పేసర్ల కంటే స్పిన్నర్లకు ఈ పిచ్ నుంచి ఎక్కువ సహకారం ఉంటుందని తెలుస్తోంది.

Tue, 21 May 202411:29 AM IST

వర్షం పడి నేడు ఆట జరగకపోతే..

ఐపీఎల్ 2024 సీజన్‍లో ప్లేఆఫ్స్ మ్యాచ్‍లకు రిజర్వ్ డే ఉంది. ఒకవేళ వర్షం వల్ల నేడు హైదరాబాద్, కోల్‍కతా మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే ఉంటుంది. అంటే మరో రోజున జరుగుతుంది. అయితే, ఈ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‍లో నేడు వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

Tue, 21 May 202410:35 AM IST

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో కేకేఆర్ రికార్డు ఇదీ

ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో కేకేఆర్ రికార్డు మెరుగ్గా ఉంది. ఆ టీమ్ 13సార్లు ప్లేఆఫ్స్ చేరగా.. అందులో 8 గెలిచి, ఐదు ఓడింది. చివరిసారి 2021 ఐపీఎల్ ఫైనల్ చేరినా.. అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Tue, 21 May 202410:07 AM IST

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో సన్ రైజర్స్ రికార్డు ఇదీ

ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో సన్ రైజర్స్ 11 మ్యాచ్ లు ఆడగా ఐదు గెలిచి, ఆరు ఓడింది. అందులో మొదట బ్యాటింగ్ చేసి మూడు గెలవగా, చేజింగ్ లో రెండు గెలిచింది. అత్యధికంగా 2016 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీపై 208 రన్స్ చేసింది. అతి తక్కువ స్కోరు 2017లో క్వాలిఫయర్ 2లో కేకేఆర్ పైనే కేవలం 128 రన్స్ చేసింది.

Tue, 21 May 202409:58 AM IST

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: పవర్ ప్లేలో సన్ రైజర్స్ దూకుడు

ఐపీఎల్ 2024 మొత్తం పవర్ ప్లేలో సన్ రైజర్స్ దూకుడు కొనసాగించింది. నిజానికి ఈ దూకుడే టీమ్ ను ప్లేఆఫ్స్ కు చేర్చింది. ఓపెనర్లుగా వచ్చిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ సీజన్లో 13 ఇన్నింగ్స్ లో పవర్ ప్లేలోనే 920 రన్స్ చేయడం విశేషం. స్ట్రైక్ రేట్ ఏకంగా 185.93గా ఉంది. అంతేకాదు ఆర్సీబీపై ఆరు ఓవర్లలోనే 125 రన్స్ తో సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఇక మొత్తంగా ఈ పవర్ ప్లేల్లో 55 సిక్స్ లు బాదగా.. అందులో 28 కేవలం అభిషేక్ శర్మే బాదాడు. సీజన్ మొత్తంలో అతడు 40 సిక్స్ లు కొట్టాడు. పవర్ ప్లేలో కేకేఆర్ మాత్రం 788 రన్స్ చేసింది.

Tue, 21 May 202409:15 AM IST

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: సన్ రైజర్స్‌లో వీళ్లే కీలకం

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతోపాటు మిడిలార్డర్ లో నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ కీలకం కానున్నారు. వీళ్లు లీగ్ స్టేజ్ లో చెలరేగినట్లే ఆడితే మాత్రం సన్ రైజర్స్ గెలుపు ఖాయం.

Tue, 21 May 202408:17 AM IST

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: తొలి క్వాలిఫయర్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలి క్వాలిఫయర్ మంగళవారం (మే 21) రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ను జియో సినిమా ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. ఇక టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది.

Tue, 21 May 202407:38 AM IST

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు అంచనా

సునీల్ నరైన్, రహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, నితీష్ రానా, రింకు సింగ్, ఆండ్రి రసెల్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా

ఇంప్లాక్ట్ ప్లేయర్: వరుణ్ చక్రవర్తి

Tue, 21 May 202407:36 AM IST

IPL 2024 Qualifier 1 KKR vs SRH Live Updates: సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు అంచనా

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయ్‌కాంత్ వియస్కాంత్

ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్

Tue, 21 May 202407:22 AM IST

మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు కేకేఆర్

సన్ రైజర్స్, నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే కేకేఆర్ ఫైనల్ చేరుతుంది. లీగ్ స్టేజ్ లో పాయింట్ల టేబుల్లో టాప్ ప్లేస్ లో నిలిచిన టీమ్ ముందడుగు వేస్తుంది. అయితే మ్యాచ్ జరిగిన మంగళవారం (మే 21) అహ్మదాబాద్ లో అసలు వర్షం పడే అవకాశమే లేదని అక్కడి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అభిమానులు పరుగుల వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిందే.

Tue, 21 May 202407:18 AM IST

సన్ రైజర్స్ పై కేకేఆర్ దే పైచేయి

తొలి క్వాలిఫయర్ కు ముందు సన్ రైజర్స్ అభిమానులకు ఇది కాస్త మింగుడు పడని విషయమే. ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ 26 మ్యాచ్ లలో తలపడగా.. 17 మ్యాచ్ లలో కేకేఆర్, 9 మ్యాచ్ లలో సన్ రైజర్స్ గెలిచాయి. ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఆడగా.. అందులో 4 పరుగులతో కేకేఆర్ విజయం సాధించింది.