SRH vs KKR : ‘డౌటే లేదు.. కేకేఆర్​ ఫైనల్​కి వెళుతుంది’- వసీమ్​ అక్రమ్​..-ipl 2024 qualifier 1 wasim akram picks confident and dangerous kkr as favourites against srh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Srh Vs Kkr : ‘డౌటే లేదు.. కేకేఆర్​ ఫైనల్​కి వెళుతుంది’- వసీమ్​ అక్రమ్​..

SRH vs KKR : ‘డౌటే లేదు.. కేకేఆర్​ ఫైనల్​కి వెళుతుంది’- వసీమ్​ అక్రమ్​..

Sharath Chitturi HT Telugu
May 21, 2024 12:45 PM IST

IPL 2024 Qualifier 1 : ఎస్​ఆర్​హెచ్​ని ఓడించి.. కేకేఆర్​ జట్టు ఐపీఎల్​ ఫైనల్​కి వెళుతుందని పాకిస్థాన్​ మాజీ బౌలర్​ వసీమ్​ అక్రమ్​ అభిప్రాయపడ్డాడు. ఇందుకు బలమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నాడు.

ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1లో.. కేకేఆర్​ వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​..
ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1లో.. కేకేఆర్​ వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​.. (PTI)

SRH vs KKR IPL 2024 Qualifier 1 : ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1కి సమయం ఆసన్నమైంది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా.. ఇంకొన్ని గంటల్లో కోల్​కతా నైట్​ రైడర్స్​ వర్సెస్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​ మ్యాచ్​ జరగనుంది. భీకరమైన ఫామ్​తో ప్లేఆఫ్స్​కు దూసుకెళ్లింది కేకేఆర్​. అటు ఎస్​ఆర్​హెచ్​ జట్టు బాదుడు చూస్తుంటే.. ప్రత్యర్థి జట్టు బెంబేలెత్తిపోతోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు? అనేది ఉత్కంఠగా మారింది. కానీ.. పాకిస్థాన్​ మాజీ ఫాస్ట్​ బౌలర్​ వసీమ్​ అక్రమ్​ మాత్రం.. కేకేఆర్​ గెలుస్తుందని తేల్చేశాడు! ఇందుకు కారణాలను కూడా చెప్పాడు.

ఎస్​ఆర్​హెచ్​ వర్సెస్​ కేకేఆర్​- ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1..

ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కోల్​కతా నైట్​ రైడర్స్​ విజయం సాధిస్తుందని, అందుకు కారణం శ్రేయస్​ సేన బౌలింగ్​ యూనిట్​ అని వసీమ్​ అక్రమ్​ అంటున్నాడు. కేకేఆర్​ బౌలింగ్​ యూనిట్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

SRH vs KKR qualifier 1 : "కేకేఆర్​లో కన్సిస్టెంట్​గా వికెట్లు తీసే బౌలర్లు ఉన్నారు. ఎంఐ, ఎల్​ఎస్​జీ మ్యాచుల్లో మిచెల్​ స్టార్క్​ అద్భుతంగా బౌలింగ్​ చేశాడు. ఐపీఎల్​ 2024 టాప్​ 15 బౌలర్లలో కేకేఆర్​ నుంచే నలుగురు ఉన్నారు. ఐపీఎల్​ 2024 పాయింట్స్​ టేబుల్​లో కేకేఆర్​ టాప్​లో ఉండటానికి కారణం ఆ జట్టు బౌలింగ్​ యూనిట్​. వికెట్లు తీసే జట్లు.. మ్యాచ్​లు గెలుస్తాయి. స్టార్క్​ కూడా ఒంటిచేత్తో మ్యాచ్​ గెలిపించాడు. నమ్మకం, ధైర్యం, ప్రశాంతంగా.. కేకేఆర్​ జట్టు ఫైనల్స్​కు వెళుతుంది," అని అక్రమ్​ అన్నాడు.

కేకేఆర్​కు వసీమ్​ అక్రమ్​ గతంలో బౌలింగ్​ కోచ్​గా పనిచేశాడు.

కేకేఆర్​ బౌలింగ్​ యూనిట్​పై అక్రమ చెప్పిన మాటలు నిజమే! ఈ సీజన్​లో.. వరుణ్​ చక్రవర్తి 18 వికెట్లు తీశాడు. హర్షిత్​ రాణా 16, ఆండ్రూ రస్సెల్​ 15, సునీల్​ నరైన్​ 15, మిచెల్​ స్టార్క్​ 12 వికెట్లు తీశారు.

SRH vs KKR 2024 : కోల్​కతా నైట్​ రైడర్స్​ జట్టులో దాదాపు ప్రతి ఒక్కరు ఫామ్​లో ఉన్నారని, కాకపోతే.. ఫిల్​ సాల్ట్​ లేకపోవడం టీమ్​కి నష్టం కలిగించే విషయం అని వసీమ్​ అక్రమ్​ అభిప్రాయపడ్డాడు.

"దాదాపు అందరు మంచి ప్రదర్శన చేశారు. ఒక్క మ్యాచ్​ మాత్రమే ఆడిన మనీశ్​ పాండే కూడా బాగా ఆడాడు. అందరు సంతోషంగా, నమ్మకంగా ఉన్నట్టు అర్థమవుతోంది. వాళ్లు అగ్రెసివ్​గా కూడా ఉన్నారు. అది కంట్రోల్డ్​ అగ్రెషన్​. కానీ ఫిల్​ సాల్ట్​ లేకపోవడం మైనస్​ అవుతుంది," అని పాక్​ మాజీ బౌలర్​ చెప్పుకొచ్చాడు.

ఈ ఐపీఎల్​ 2024లో కోల్​కతా నైటర్​ రైడర్స్​కు సెకెండ్​ హయ్యెస్ట్​ రన్​ స్కోరర్​గా నిలిచాడు ఫిల్​ సాల్ట్​. 12 ఇన్నింగ్స్​లలో 435 రన్స్​ చేశాడు. 4 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్​ రేట్​ 182. కానీ.. టీ20 వరల్డ్​ కప్​ ప్రిపరేషన్​ కోసం అతను ఇంగ్లాండ్​ వెళ్లిపోయాడు.

SRH vs KKR head to head : ఐపీఎల్​ 2024 క్వాలిఫయర్స్​ 1లో.. ఫిల్​ సాల్ట్​ స్థానాన్ని రహ్మతుల్లా గుర్బజ్​ భర్తీ చేసే అవకాశం ఉంది.

క్వాలిఫయర్స్​ 1లో రెండు జట్లపై పెద్దగా స్ట్రెస్​ ఉండదు. కానీ.. ఈ మ్యచ్​ గెలిచిన జట్టు.. డైరక్ట్​గా ఐపీఎల్​ ఫైనల్​లోకి అడుగుపెడుతుంది. మరో జట్టు.. (ఎలిమినేటర్​లో గెలిచిన టీమ్​తో) క్వాలిఫయర్స్​ 2 ఆడుతుంది. ఎలాగైనా డైరక్ట్​గా ఫైనల్​కి వెళ్లిపోవాలని కేకేఆర్​, ఎస్​ఆర్​హెచ్​లు కచ్చితంగా ప్రయత్నిస్తాయి. అందుకే.. ఐపీఎల్​ లవర్స్​.. పవర్​ ప్యాక్డ్​ యాక్షన్​ని ఆశిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం