T20WorldCup: టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. దీనిపై మెజారిటీ మాజీ ఆటగాళ్లు ఏకీభవించగా, పలువురు విమర్శించారు. తాజాగా మాజీ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడారు. నలుగురు స్పిన్నర్లు ఎంపిక కాస్త ఎక్కువేనని అన్నారు. గతంలో చాలా సార్లు ముగ్గురు స్పిన్నర్లే ఉండే వాళ్లమన్నారు. ఇక రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఎంపికపైనా హర్భజన్ మాట్లాడారు.