OG Glimpse Records: ఓజీ గ్లింప్స్ రికార్డ్స్: తెలుగులో టాప్.. నేషనల్ వైడ్‍గా మూడో ప్లేస్..
OG Glimpse Records: ఓజీ మూవీ గ్లింప్స్ రికార్డులను సృష్టించింది. టాలీవుడ్‍లో 24 గంటల్లో అత్యధిక లైక్‍లు సాధించిన గ్లింప్స్‌గా నిలిచింది. వివరాలివే..
OG Glimpse Records: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ రికార్డులను సృష్టించింది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 2) ఓజీ హంగ్రీ చీతా గ్లింప్స్ వచ్చింది. సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓజీ గ్లింప్స్ సంచలనంగా మారింది. స్టైలిష్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కల్యాణ్.. ఈ గ్లింప్స్‌లో కనిపించారు. యాక్షన్ ఫీస్ట్‌గా ఉన్న ఓజీ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో 24 గంటల్లోనే ఈ గ్లింప్స్ రికార్డును సృష్టించింది.
ఓజీ హంగ్రీచీతా గ్లింప్స్‌కు 24 గంటల్లోనే 7.30లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్‌గా ఓజీ హంగ్రీతా రికార్డు సృష్టించింది. ఈ విషయంలో తనను తానే బీట్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. ఆయన హీరోగా నటించిన భీమ్లానాయక్ గ్లింప్స్‌కు గతంలో 24 గంటల్లో 7.28లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పుడు భీమ్లా గ్లింప్స్‌ను ఓజీ హంగ్రీచీతా బీట్ చేసింది. తెలుగులో 24 గంటల్లో మోస్ట్ లైక్డ్ గ్లింప్స్‌గా రికార్డు సృష్టించింది. ఇక నేషనల్ రేంజ్‍లో మూడో స్థానంలో నిలిచింది ఓజీ గ్లింప్స్.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2: ది రైజ్ గ్లింప్స్ (హిందీ వెర్షన్)కు 24 గంటల్లోనే 12.9లక్షల లైక్స్ వచ్చాయి. అజిత్ ‘వాలిమై’ మూవీ గ్లింప్స్ 7.85లక్షల లైక్స్ దక్కించుకుంది. నేషనల్ రేంజ్‍లో ఈ రెండు మూవీస్ తర్వాత ఓజీ గ్లింప్స్ మూడో ప్లేస్‍లో నిలిచింది. ఓజీ గ్లింప్స్ వీడియో 24 గంటల్లో 7.30లక్షల లైక్స్ దక్కించుకుంది.
ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ స్టైల్, వాకింగ్‍లో స్వాగ్, యాక్షన్‍లో ఇంటెన్స్ అదిరిపోయాయి. పవర్ స్టార్ కత్తితో నరకడం, షూట్ చేయడం గ్లింప్స్‌లో ఉన్నాయి. బాంబేలో పవర్‌ఫుల్, వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు పవన్. పవర్ ఫుల్ డైలాగ్‍లతో వాయిస్ ఓవర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ గ్లింప్స్‌కు హైలైట్‍గా ఉన్నాయి. మరాఠీలో పవన్ డైలాగ్ కూడా ఉంది.
ఓజీ చిత్రం షూటింగ్ ఇప్పటికే 60 శాతం వరకు పూర్తయినట్టు తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ కీరోల్స్ చేస్తున్నారు.