తెలుగు న్యూస్  /  Business  /  Stock Market News Today 20 January 2023 Sensex And Nifty Opens Flat

Stock market news today : ఫ్లాట్​గా స్టాక్​ మార్కెట్​లు.. నిఫ్టీకి 3 పాయింట్ల లాస్​

20 January 2023, 9:17 IST

    • Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు నష్టాల్లో ముగిశాయి.
స్టాక్​ మార్కెట్​ ఇండియా
స్టాక్​ మార్కెట్​ ఇండియా (MINT_PRINT)

స్టాక్​ మార్కెట్​ ఇండియా

Stock market news today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 44 పాయింట్ల నష్టంతో 60,815 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 3 పాయింట్లు కోల్పోయి 18,105 వద్ద ట్రేడ్​ అవుతోంది.

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పవనాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 187 పాయింట్లు కోల్పోయి 60,858 వద్ద ముగిసింది. 57 పాయింట్ల నష్టంతో 18,107 వద్ద స్థిరపడింది నిఫ్టీ. ఇక 129 పాయింట్లు పతనమైన బ్యాంక్​ నిఫ్టీ.. 42,328 లెవల్​ వద్దకు చేరింది. ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60904- 18116 వద్ద మొదలుపెట్టాయి.

పివోట్​ ఛార్ట్​ ప్రకారం ఎన్​ఎస్​ఈ సపోర్ట్​ 18,074- 18,052- 18,144 వద్ద ఉంది. నిఫ్టీ రెసిస్టెన్స్​ 18,144- 18,165- 18,200 వద్ద ఉంది.

స్టాక్స్​ టు బై..

ఆదిత్య బిర్లా క్యాపిటల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 142, టార్గెట్​ రూ. 155- రూ. 158

HDFC Bank share price target : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1598, టార్గెట్​ రూ. 1700

శ్రీ రేణుఖ షుగర్స్​​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 49, టార్గెట్​ రూ. 64

పూర్తి లిస్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

లాభాలు.. నష్టాలు..

ఇండస్​ఇండ్​, ఎన్​టీపీసీ, టాటా మోటార్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​యూఎల్​, ఏషియ్​న్​ పెయింట్స్​, మారుతీ సుజుకీ, విప్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market news : ఆర్థిక మాంద్యం భయాలతో అమెరికా మార్కెట్​లు గురువారం నష్టపోయాయి. ఎస్​ అండ్​ పీ 500 0.76శాతం, నాస్​డాక్​ 0.96శాతం మేర పడ్డాయి. డౌ జోన్స్​ 0.75శాతం మేర నష్టపోయింది.

ఆసియా మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.2శాతం, ఆస్ట్రేలియా ఎస్​ అండ్​ పీ 200 0.13శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.

త్రైమాసిక ఫలితాలు..

Reliance Q3 results 2023 : రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ ఇన్షూరెన్స్​ కంపెనీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎల్​టీఐఐ మైండ్​ట్రీ, యూనియన్​ బ్యంక్​, బంధన్​ బ్యాంక్​, ఆర్​బీఎల్​ బ్యాంక్​, హెరిటేజ్​ ఫుడ్స్​, ఇండియన్​ ఎనర్జీ ఎక్స్​ఛేంజ్​తో పాటు ఇతర సంస్థల త్రైమాసికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

HUL Q3 results 2023 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐసీఐసీఐ బ్యంక్​, కొటాక్​ మహీంద్రా బ్యాంక్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్షూరెన్స్​ కంపెనీ, అల్ట్రాటెక్​ సిమెంట్​, యెస్​ బ్యాంక్​, ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​తో పాటు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలు శనివారం వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 399.98కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 128.96కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.