IDFC First Bank share : 2023 మల్టీబ్యాగర్​ స్టాక్​గా,, ‘ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​’!-multibagger stocks for 2023 experts predict 100 percent returns in 2023 for idfc first bank shares ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Idfc First Bank Share : 2023 మల్టీబ్యాగర్​ స్టాక్​గా,, ‘ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​’!

IDFC First Bank share : 2023 మల్టీబ్యాగర్​ స్టాక్​గా,, ‘ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​’!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 31, 2022 01:00 PM IST

Multibagger stocks for 2023 : 2023లో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్​.. మల్టీబ్యాగర్​ స్టాక్​గా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు గల కారణాలని వివరిస్తున్నారు. ఆ వివరాలు..

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​
ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​

IDFC First Bank share : 2022లో బ్యాంకింగ్​ సెక్టార్​ స్టాక్స్​ మెరుగైన ప్రదర్శన చేశాయి. ముఖ్యంగా.. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్లు.. గత ఆరు నెలల్లో మదుపర్లకు భారీ రిటర్నులు తెచ్చిపెట్టాయి. ఈ ర్యాలీ 2022తో ముగిసిపోదని.. 2023లోనూ కొనసాగుతుందని స్టాక్​ మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వడ్డీ రేట్ల పెంపు, కార్పొరేట్​ లెండింగ్​ బిజినెస్​లో వృద్ధి, కస్టమైజ్​డ్​ క్రెడిట్​ కార్డ్​ బిజినెస్​ రాణించడం, ఆన్​లైన్​ లెండింగ్​పై సంస్థ దృష్టిపెట్టడం వంటి అంశాలు.. ఐడీఎఫ్​సీకి సానుకూల విషయాలని నిపుణులు అంటున్నారు. ఫలితంగా ఇండియా మార్కెట్​లో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ అనేది 'జెన్​-ఎక్స్​ బ్యాంక్​'గా ఆవిర్భవిస్తోందని అభిప్రాయపడుతున్నారు.

IDFC First Bank share price : ఇక టెక్నికల్స్​ విషయానికొస్తే.. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​.. రూ. 45 వద్ద బ్రేకౌట్​ ఇచ్చింది. ప్రస్తుతం రూ. 45- రూ. 60 మధ్యలో ట్రేడ్​ అవుతోంది. రూ. 60 వద్ద ఉన్న రెసిస్టెన్స్​ను దాటితే.. ఈ ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్​ ధర రూ. 70కి కూడా చేరే అవకాశం ఉంది. ఇక రూ. 70 వద్ద స్థిరపడితే.. ఈ ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ స్టాక్​ ధర మూడంకెలకు చేరుతుందని, 2023 చివరిని నాటికి.. కనీసం రూ. 120కి వృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"రీటైల్​ బ్యాంకింగ్​ బిజినెస్​తో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​కు లాభం చేకూరనుంది. దీనితో పాటు.. కార్పొరేట్​ ఫండింగ్​ కూడా కలిసివస్తుంది. డాలర్​ ఇండెక్స్​ కాస్త శాంతిస్తే.. లోకల్​ లెండింగ్​ సోర్స్​లపై కార్పొరేట్​ సంస్థలు దృష్టిపెట్టొచ్చు. వీటితో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ వ్యాపారం వృద్ధిచెందుతుంది. అందువల్ల.. రానున్న కాలంలో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ మార్జిన్లు మెరుగుపడతాయని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి," అని ఐఐఎఫ్​ఎల్​ సెక్యూరిటీస్​ వైస్​ ప్రెసిడెంట్​ అనూజ్​ గుప్త వెల్లడించారు.

IDFC First Bank target : ప్రస్తుతం ఉన్న లెవల్స్​ వద్ద మదుపర్లు కొనుగోలు చేసుకుని.. 2-3ఏళ్ల వరకు హోల్డ్​ చేస్తే.. మంచి రిటర్నులు సంపాదించుకోవచ్చను ప్రొఫీషియెంట్​ ఈక్విటీస్​ ఫౌండర్​- డైరక్టర్​ మనోజ్​ దాల్మియ తెలిపారు.

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ స్టాక్​..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి.. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ స్టాక్​ రూ. 58.85కు చేరింది. ఈ ఈ స్టాక్​ గత ఐదు రోజుల్లో 9.6శాతం పెరిగింది. నెల రోజుల వ్యవధిలో 0.4శాతం వృద్ధి చెందింది.

IDFC First bank multibagger stock : కానీ ఆరు నెలల వ్యవధిలో మాత్రం.. ఏకంగా 87.12శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 18.53శాతం పెరిగింది ఈ ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు. మొత్తం మీద ఏడాది కాలంల.. 21.72శాతం వృద్ధిని నమోదు చేసి.. మదుపర్లకు సంతోషాన్నిచ్చింది.

(గమనిక:- ఇవి కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడులు చేసే ముందు.. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం