IDFC First Bank share : 52 వీక్​ హైని తాకిన ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్​.. ఇప్పుడు బై!-idfc first bank share price hits 52 week high good time to buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Idfc First Bank Share : 52 వీక్​ హైని తాకిన ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్​.. ఇప్పుడు బై!

IDFC First Bank share : 52 వీక్​ హైని తాకిన ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేర్​.. ఇప్పుడు బై!

Sharath Chitturi HT Telugu
Oct 06, 2022 01:28 PM IST

IDFC First Bank share price : ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు 52 వీక్​ హైని తాకింది. ఈ స్టాక్​ని ఇప్పుడు కొనొచ్చా?

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​
ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ (MINT_PRINT)

IDFC First Bank share price : ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో 52వీక్​ హైని తాకింది. ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికానికి సంబంధించి.. సంస్థ ఇచ్చిన బిజినెస్​ అప్డేట్​ పాజిటివ్​గా ఉండటంతో.. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు గత కొన్ని రోజులుగా పెరుగుతోంది.

ఇంట్రాడేలో ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు రూ. 55.15 ని తాకింది. ప్రస్తుతం రూ. 54.60 వద్ద ట్రేడ్​ అవుతోంది. రెండు రోజుల ముందు ఈ స్టాక్​ ధర రూ. 49.35గా ఉండేది. ఐదు రోజుల్లో ఈ స్టాక్​ దాదాపు 16శాతం పెరిగింది. ఇక నెల రోజుల వ్యవధిలో 9.5శాతం వృద్ధిచెందింది.

ఇప్పుడు బై..?

నిపుణుల ప్రకారం.. సంస్థ బిజినెస్​ అప్డేట్​ చాలా బలంగా ఉంది. ఇప్పటికే బుల్లిష్​గా ఉన్న ఫైనాన్స్​ సెక్టార్​కి ఇది మరింత ఊపునిచ్చింది. ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ స్టాక్​.. రూ. 53.75 వద్ద బ్రేకవుట్​ ఇచ్చింది. ఇక్కడి నుంచి షార్ట్​ టర్మ్​లో రూ. 60కి వెళ్లే అవకాశం ఉంది.

IDFC First Bank share price target : "ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ షేరు రూ. 58- రూ.60కి వెళ్లే అవకాశం ఉంది. పోర్ట్​ఫోలియోలో ఇప్పటికే ఈ స్టాక్​ ఉంటే.. ఆ లెవల్స్​ వరకు హోల్డ్​ చేయడం మంచిది. రూ. 53.75 వద్ద బలమైన బ్రేకవుట్​ ఇచ్చింది ఈ స్టాక్​," అని ఛాయిస్​ బ్రోకింగ్​ సంస్థ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమీత్​ బగాడియా అన్నారు.

యెస్​ బ్యాంక్​..

Yes bank share price : యెస్​ బ్యాంక్​ షేర్లు సైతం గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. బిజినెస్​ అప్డేట్​ ఊహించినదాని కన్నా మెరుగ్గా ఉండటంతో షేర్లు లాభపడుతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్​ సెషన్స్​లో ఈ స్టాక్​ 10శాతం పెరిగింది. ఇక గురువారం రూ. 16.85 వద్ద ఇంట్రాడే హైని తాకింది ఈ స్టాక్​.

ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​, యెస్​ బ్యాంక్​ బిజినెస్​ అప్డేట్స్​ బాగున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే.. యెస్​ బ్యాంక్​ కన్నా ఈ సమయంలో తాము ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ని పిక్​ చేస్తామని చెబుతున్నారు. ఫండమెంటల్​, టెక్నికల్​ పరంగా.. యెస్​ బ్యాంక్​ కన్నా ఐడీఎఫ్​సీ ఫస్ట్​ బ్యాంక్​ బలంగా ఉండటమే ఇందుకు కారణం అని చెబుతున్నారు.

(గమనిక: ఇది కేవలం నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు.. మీ ఫైనాన్షియర్​ ఎడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం