Sai Pallavi: సాయి పల్లవి టెంపుల్ రన్.. వారణాసిలో అన్నపూర్ణ దేవిని దర్శించుకన్న నటి-sai pallavi visits annapurna devi in varanasi ranbir kapoor ramayana movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: సాయి పల్లవి టెంపుల్ రన్.. వారణాసిలో అన్నపూర్ణ దేవిని దర్శించుకన్న నటి

Sai Pallavi: సాయి పల్లవి టెంపుల్ రన్.. వారణాసిలో అన్నపూర్ణ దేవిని దర్శించుకన్న నటి

Hari Prasad S HT Telugu
Dec 23, 2024 01:59 PM IST

Sai Pallavi: సాయి పల్లవి కాశీలోని అన్నపూర్ణ దేవి ఆలయానికి వెళ్లింది. రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న రామాయణంలో సీత పాత్ర పోషిస్తున్న ఆమె.. దాని కంటే ముందు ఆలయాలను సందర్శించే పనిలో ఉంది. ఈ మధ్యే రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

సాయి పల్లవి టెంపుల్ రన్.. వారణాసిలో అన్నపూర్ణ దేవిని దర్శించుకన్న నటి
సాయి పల్లవి టెంపుల్ రన్.. వారణాసిలో అన్నపూర్ణ దేవిని దర్శించుకన్న నటి

Sai Pallavi: సాయి పల్లవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ మూవీలో నటిస్తున్న ఆమె.. అటు నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న రామాయణ మూవీలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ పాత్ర కోసం ఓవైపు సిద్ధమవుతూనే.. మరోవైపు ఆలయాల సందర్శనలో ఉంది. తాజాగా కాశీలోని అన్నపూర్ణ దేవి ఆలయానికి ఆమె వెళ్లిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

వారణాసిలో సాయి పల్లవి

సాయి పల్లవికి చెందిన ఓ ఫ్యాన్ క్లబ్ ఎక్స్ అకౌంట్ ఆమె వారణాసి టెంపుల్ రన్ కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. సోమవారం (డిసెంబర్ 23) ఉదయం ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. బ్లూ సల్వార్ సూట్, దుపట్టాలో కనిపించిన ఆమె.. అన్నపూర్ణ దేవి అమ్మవారి గర్భగుడిలో ఉన్న ఫొటోలు ఇందులో చూడొచ్చు. మెడలో బంతిపూల హారం, చేతికి రుద్రాక్షల దండతో సాయి పల్లవి కనిపించింది. రామాయణ మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది.

అందులోనూ రాముడి, సీతలా రణ్‌బీర్, సాయి పల్లవి కనిపించనుండటంతో ఈ పాన్ ఇండియా మూవీ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది. రామాయణం ఇప్పటికే సీరియల్స్ గా, సినిమాలుగా ఎన్నోసార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి నితేష్ తివారీ డైరెక్షన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రామాయణ మూవీ వస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగం 2026లో వచ్చే దీపావళికి, రెండో భాగం 2027లో వచ్చే దీపావళికి రిలీజ్ కానున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ఆ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.

సాయి పల్లవి వార్నింగ్

ఇక ఈ రామాయణ మూవీ కోసం తాను వెజిటేరియన్ గా మారినట్లు తమిళ న్యూస్ పోర్టల్ వికటన్ రాయడంపై ఈ మధ్యే సాయి పల్లవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఇలాంటి పుకార్లను తేలిగ్గా తీసుకున్నా.. ఇక నుంచీ నిరాధార వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. "చాలాసార్లు, నిజానికి ప్రతిసారీ నాపై నిరాధార పుకార్లు, తప్పుడు ప్రకటనలు, అబద్ధాలను రాసినా సైలెంట్ గా ఉంటూ వస్తున్నాను.

కానీ ఇక ఉపేక్షించను. ఎందుకంటే ఇది మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంది. అసలు ఆగేలా లేదు. ముఖ్యంగా నా సినిమా రిలీజ్, అనౌన్స్‌మెంట్ అయ్యే సమయాల్లో, నా కెరీర్లో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే క్షణాల్లో ఇలాంటివి వస్తున్నాయి. ఇక నుంచి ఏదైనా పేరున్న మీడియా లేదా వ్యక్తుల నుంచి ఇలాంటి చెత్త స్టోరీలు వార్తలు లేదా పుకార్ల రూపంలో వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను" అని సాయి పల్లవి హెచ్చరించింది.

నిజానికి సాయి పల్లవి ఎప్పుడూ వెజిటేరియనే. ఈ విషయాన్ని ఆమె గతంలోనూ పలుమార్లు చెప్పింది. అంతేకాదు తాను ఎక్కడికి వెళ్లినే తనకు కేవలం శాకాహార వంటకాలే చేసేందుకు ప్రత్యేకంగా వంటవాళ్లు కూడా ఉంటారని ఆమె తెలిపింది. తానో ప్రాణం పోతుంటే చూడలేనని, అందుకే ఎప్పుడూ వెజిటేరియన్ గానే ఉంటానని సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Whats_app_banner