తెలుగు న్యూస్ / ఫోటో /
Pakistan Cricket: చరిత్ర సృష్టించిన పాకిస్థాన్.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా..
- Pakistan Cricket Record: పాకిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ గెలిచింది. దీంతో ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- Pakistan Cricket Record: పాకిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలోనూ గెలిచింది. దీంతో ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ విజయం సాధించింది. జొహన్నెస్‍బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‍లో 36 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. దీంతో 3-0తో వన్డే సిరీస్‍ను వైట్ వాష్ చేసింది. (AP)
(2 / 5)
దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికా జట్టును ద్వైపాక్షిక వన్డే సిరీస్‍లో వైట్‍వాష్ చేసిన తొలి టీమ్‍గా పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. సిరీస్‍లో ఆల్‍రౌండ్ ప్రదర్శనతో పాక్ దుమ్మురేపింది. వరుసగా మూడు మ్యాచ్‍లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. (AFP)
(3 / 5)
వాండరర్స్ స్టేడియంలో శనివారం జరిగిన మూడో వన్డే వాన వల్ల 47 ఆటగా సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 47 ఓవర్లలో 9 వికెట్లకు 308 పరుగులు చేసింది. (AFP)
(4 / 5)
పాకిస్థాన్ యంగ్ బ్యాటర్ సైమ్ అయూబ్ 101 (94 బంతులు; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో అదరగొట్టాడు. బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ అర్ధశతకాలు బాదారు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా మూడు, మార్కో జాన్సెన్, పార్చూన్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. (AP)
(5 / 5)
లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 42 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (81) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్ సుఫియన్ మఖీమ్ నాలుగు వికెట్లతో రాణించాడు. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా తలా రెండు, మహమ్మద్ హస్నైన్, అయూబ్ చెరో వికెట్ తీసుకున్నారు. మొత్తంగా 36 పరుగుల తేడాతో గెలిచి.. 3-0తో సిరీస్ దక్కించుకుంది పాకిస్థాన్.(AFP)
ఇతర గ్యాలరీలు