Mohan Babu Bail Petition : మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Mohan Babu Bail Petition : మీడియా ప్రతినిధులపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కైదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మోహన్ బాబు గుండె సంబంధిత అనారోగ్యంగా బాధపడుతున్నారని ఆయన తరఫున న్యాయవాది వాదించారు.
Mohan Babu Bail Petition : సినీ నటుడు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. మోహన్ బాబు ఆరోగ్యం బాగోలేదని, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటీవల ఆయన దుబాయ్ వెళ్లారని, అనంతరం తిరిగి వచ్చి తిరుపతిలోని తన విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటున్నారని తెలిపారు. అనారోగ్య కారణాల దృష్ట్యా మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. దాడి ఘటనలో మోహన్ బాబుకు బెయిల్ ఇవ్వొద్దని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు...మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబును పోలీసులు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మీడియా ప్రతినిధులపై దాడికేసులో సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోహన్‌బాబు. ఈ బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో మోహన్‌బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని మోహన్ బాబు ఇటీవల వివరణ ఇచ్చారు. మంచు ఫ్యామిలీలో మొదలైన ఆస్తుల వివాదం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు డీజీపీకి లేఖ రాశారు. ఏడు నెలల తన కూతురిని చూడనివ్వకుండా, ఇంట్లో అడుగుపెట్టకుండా తండ్రి మనుషులు తనను అడ్డుకుంటున్నారని, తనపై దాడులు చేశారంటూ మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ వివాదం జరుగుతున్న క్రమంలో జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. ఈ క్రమంలో తన ఇంట్లోకి ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు మోహన్ బాబు పై కేసు నమోదు చేశారు. తనను అరెస్టు చేయొద్దని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ నెల 24 వరకు ముందస్తు చర్యలొద్దని పోలీసులకు తెలిపింది. ఈ కేసులో ముందుస్తు బెయిల్ కోసం హైకోర్టు మరో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది.
మోహన్‌బాబు క్షమాపణలు
ఈ ఇంటి వివాదాన్ని కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిపై ఆవేశంలో మోహన్‌బాబు దాడిచేశాడు. అతడు హాస్పిటల్ పాలవ్వడంతో మోహన్‌బాబుపై కేసు నమోదు అయ్యింది. ఈ ఘటనపై మోహన్‌బాబుతో పాటు విష్ణు, మనోజ్ కూడా మీడియా ప్రతినిధిని స్వయంగా కలిసి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పిన కూడా కేసు మాత్రం విత్‌డ్రా కాలేదు. ఈ కేసును చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు మోహన్ బాబు సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
సంబంధిత కథనం