Telangana News Live December 23, 2024: Jagtial Crime : బాలుడిపై అత్యాచారం, జగిత్యాల కోర్టు సంచలన తీర్పు-నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 23 Dec 202405:32 PM IST
Jagtial Crime : బాలుడిపై అత్యాచారం కేసులో జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది.
Mon, 23 Dec 202404:13 PM IST
Notices To Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు మరోసారి అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవ్వాలని కోరారు.
Mon, 23 Dec 202412:17 PM IST
- Hanumakonda : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. ఉద్యోగం సాధించి తమకు అండగా ఉంటాడని కొడుకును అమెరికాకు పంపిస్తే.. అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయాడని అతని తల్లిదండ్రులు రోధిస్తున్నారు
Mon, 23 Dec 202411:32 AM IST
Allu Arjun Issue : అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ నేతలతో మాట్లాడేందుకు ఆయన గాంధీ భవన్ కు వెళ్లగా...వేరే కారణాలతో వారిని కలవలేకపోయారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు.
Mon, 23 Dec 202411:09 AM IST
- Pushpa 2 Row : తెలంగాణ రాజకీయాల్లో పుష్ప 2 సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు టార్గెట్ పుష్ప కామెంట్స్ రోజురోజుకూ పెంచుతున్నారు. సీఎం నుంచి మంత్రుల వరకూ అందరూ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క బన్నీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mon, 23 Dec 202410:07 AM IST
Mohan Babu Bail Petition : మీడియా ప్రతినిధులపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కైదురైంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మోహన్ బాబు గుండె సంబంధిత అనారోగ్యంగా బాధపడుతున్నారని ఆయన తరఫున న్యాయవాది వాదించారు.
Mon, 23 Dec 202408:54 AM IST
- Medak : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి ప్రజల సమస్యల కంటే.. అల్లు అర్జున్ ఇష్యూ ముఖ్యమా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా.. ఇప్పటికీ విద్యా శాఖకు మంత్రి లేరని విమర్శలు గుప్పించారు.
Mon, 23 Dec 202408:26 AM IST
TG Students Suicides : సంధ్య థియేటర్ ఘటన విషాదకరం...అయితే ఇలాంటి ఘటనలు నిత్యం ప్రైవేట్ కాలేజీల్లో, తెలంగాణ సమాజంలో ఎన్నో జరుగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఉరితాళ్లకు వేళాడుతున్నారు. వారి మరణాలపై అసెంబ్లీ చర్చించి ఉండాల్సిందన్న వాదన వినిపిస్తుంది.
Mon, 23 Dec 202407:47 AM IST
- TG Rythu Runa Mafi : రుణమాఫీ కోసం రైతులు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా రాలేదంటా.. ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. పంట పొలాల్లో తాడుకట్టి ఉరి పెట్టుకున్నట్టు నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Mon, 23 Dec 202407:10 AM IST
- Telangana Tourism : చుట్టూ దట్టమైన అడవి. చెట్ల మధ్య నుంచి గలగలా పారే వాగులు. ఏడారిని తలపించే ఇసుక తిన్నెలు. పక్షుల కిలకిలరావాలు. జంతువుల అరుపులు. చల్లిని వాతావరణం.. ఇవన్నీ ఆస్వాదించాలంటే.. ములుగు జిల్లాకు వెళ్లాల్సిందే. పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త ఆలోచన చేసింది.
Mon, 23 Dec 202405:55 AM IST
- Attack on Allu Arjun House : అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కొందరు బన్నీ ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.
Mon, 23 Dec 202402:32 AM IST
- Hyderabad Murder: ఇన్‌స్టా గ్రామ్ రీల్స్ చేస్తున్న బాలికను మాయమాటలతో అపహరించిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏడాదిన్నర తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. ఉపాధి కోసం ఎన్టీఆర్ జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లిన కుటుంబంలో బాలికను ఆటోడ్రైవర్ అపహరించగా ఆ తర్వాత బాలిక తండ్రి అతడిని ట్రాప్ చేసి చంపేశాడు.
Mon, 23 Dec 202412:21 AM IST
- Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని బ్యాంకుకు వెళ్ళితే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయమన్నారు బ్యాంక్ అధికారులు. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే ఖాతాలోని సుమారు పది లక్షలు మాయమయ్యాయి. ఈ ఘరానా మోసం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది.