Tollywood: సీఏం రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భేటీ - మీటింగ్ ఎందుకంటే?
Allu Arjun: సంధ్య థియేటర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఒకటి చెబుతుంటే పోలీసులు మరో మాట చెబుతోన్నారు. ఈ వివాదంపై సీఏం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సీఏం వ్యాఖ్యలపై తెలంగాణ సినీ ఎగ్జిబిటర్స్ మీటింగ్ ఏర్పాటుచేయబోతున్నారు.
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు ప్రభుత్వ వర్గాలు, పోలీసులు చేస్తోన్న ఆరోపణలు సినీ, రాజకీయ వర్గాల్లో దుమరాన్ని రేపుతోన్నాయి. సీఏం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్ థియేటర్‌కు రావడం వల్లే తొక్కిసలాట జరిగి మహిళా అభిమాని మృత్యువాతపడినట్లు పేర్కొన్నాడు. సి
నిమా వాళ్ల కారణంగా ప్రజల ప్రాణాలు పోతుంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. సీఏం చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. ఇరవై రెండేళ్లు కష్టపడి తాను సంపాదించుకున్న గౌరవం, పేరు ప్రఖ్యాతులు ఒక్కరోజులో పోగొట్టారని, తన క్యారెక్టర్‌ను తక్కువచేసి మాట్లాడుతున్నారని అల్లు అర్జున్ అన్నారు. తనపై వస్తోన్నవన్నీ తప్పుడు ఆరోపణలు అని పేర్కొన్నారు.
బెయిల్ రద్దు...
అల్లు అర్జున్ కామెంట్స్‌పై పోలీసులు రియాక్ట్ అయ్యారు. పుష్ప 2 ప్రీమియర్ రోజు ఏం జరిగిందన్నది ఆధారాలతో వీడియోల ద్వారా బయటపెట్టారు. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించిన సినీ, రాజకీయ వర్గాలు ఇప్పుడు ఒక్కొక్కరూ యూటర్న్ తీసుకుంటున్నారు.
ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగ్...
కాగా ఇటీవల అసెంబ్లీలో సినీ ఇండస్ట్రీని ఉద్దేశించి సీఏం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటుచేయబోతున్నది. సంధ్య థియేటర్ ఘటనపై సీరియస్ అయిన రేవంత్ రెడ్డి ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు ఎలాంటి అనుమతులు ఇవ్వమని ప్రకటించారు. ఈ విషయమై ఎగ్జిబిటర్ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
చిన్న సినిమాలకు లాభం...
బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వల్ల పెద్ద సినిమాలు మాత్రమే ఎక్కువగా లాభాలు పొందుతోన్నాయనే వార్తలు చాలా రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోన్నాయి. టికెట్ రేట్లు పెంచుతూ పోతే థియేటర్లకు ప్రేక్షకులు దూరమవుతారని, థియేటర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఎగ్జిబిటర్లు చెబుతోన్నారు. బెనిఫిట్ షోలు రద్దు చేయడమే కాకుండా టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇవ్వకూడదని సీఏం తీసుకున్న నిర్ణయం వల్ల చిన్న సినిమాలకు మేలు చేకూరే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు భావిస్తోన్నట్లు తెలిసింది.
సీఏం నిర్ణయంపై...
సీఏం నిర్ణయంపై ఆయనకు థాంక్స్ చెప్పేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో సంధ్య థియేటర్ ఘనటతో అల్లు అర్జున్ అరెస్ట్‌పై ఎలాంటి కామెంట్స్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.