OTT Mystery Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT: మలయాళం లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ సూక్ష్మదర్శిని ఓటీటీ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకున్నది. ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో బాసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ హీరోహీరోయిన్లుగా నటించారు. కేవలం పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో యాభై ఐదు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
OTT Mystery Thriller: మలయాళం చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది సూక్ష్మదర్శిని. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో బాసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
కేవలం పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో యాభై ఐదు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది మలయాళంలో నిర్మాతలకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ థ్రిల్లర్ మూవీకి ఎమ్‌సీ జితిన్ దర్శకత్వం వహించాడు.
జీ5 ఓటీటీలో...
సూక్ష్మదర్శిని ఓటీటీ రిలీజ్ ఎప్పుడన్నది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నది. శాటిలైట్ రైట్స్‌ను కూడా జీ నెట్‌వర్క్ దక్కించుకున్నది. జనవరి రెండు, లేదా మూడో వారంలో సూక్ష్మదర్శిని మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు.
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ...
సూక్ష్మదర్శిని మూవీతో దాదాపు నాలుగేళ్ల తర్వాత మలయాళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది నజ్రియా నజీమ్. చివరగా మలయాళంలో 2020లో భర్త ఫహాద్ ఫాజిల్ ట్రాన్స్ మూవీలో హీరోయిన్‌గా నటించింది నజ్రియా నజీమ్. రీఎంట్రీలో ఫస్ట్ మూవీతోనే బ్లాక్‌బస్టర్ అందుకున్నది. సూక్ష్మదర్శిని సినిమాలో ప్రియా పాత్రలో నజ్రియా నజీమ్ తన నటనతో ఆకట్టుకుంది. కాన్సెప్ట్, బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్‌తో పాటు సినిమాలోని ట్విస్ట్‌లు అభిమానులను మెప్పించాయి.
సూక్ష్మదర్శిని కథ ఏంటంటే?
ప్రియ (నజ్రియా నజీమ్) హౌజ్ వైఫ్. భర్త, కూతురుతో కలిసి సంతోషంగా ఉంటుంది. ఇరుగుపొరుగువారి విషయాల్లో ప్రియకు ఆసక్తి ఎక్కువ. తమ పక్కింట్లోకి కొత్తగా వచ్చిన మాన్యుయేల్ (బాసిల్ జోసెఫ్) వింత ప్రవర్తన ప్రియలో అనుమానాల్ని రేకెత్తిస్తుంది. మాన్యుయేల్ తల్లి కనిపించకుండా పోతుంది.
మాన్యుయేల్ లైఫ్ గురించి ఇన్వేస్టిగేట్ చేయడం మొదలుపెడుతుంది ప్రియ. ఆ అన్వేషణలో మాన్యుయేల్ గురించి ప్రియకు ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? ఈ క్రమంలో ప్రియ ఎలా చిక్కుల్లో పడింది అన్నదే ఈ మూవీ కథ.
తెలుగులో...
నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నజ్రియా నజీమ్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.