Rasis who hides pain: ఎంత బాధ ఉన్నా, ఈ రాశుల వారు పైకి నవ్వుతూ లోలోపల బాధ పడతారు.. మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి-rasis who hides pain these zodiac signs hides pain and smile without letting their problem out ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rasis Who Hides Pain: ఎంత బాధ ఉన్నా, ఈ రాశుల వారు పైకి నవ్వుతూ లోలోపల బాధ పడతారు.. మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి

Rasis who hides pain: ఎంత బాధ ఉన్నా, ఈ రాశుల వారు పైకి నవ్వుతూ లోలోపల బాధ పడతారు.. మీ రాశి కూడా ఉందేమో తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu
Dec 23, 2024 10:00 AM IST

Rasis who hides pain: ఒక్కొక్కరు ఒక వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కొన్ని రాశుల వారు ఒకలా ప్రవర్తిస్తే, మరికొన్ని రాశుల వారి ప్రవర్తన, తీరు ఇంకోలా ఉంటుంది. ఈ రాశుల వారు మాత్రం బాధను అస్సలు బయటకి కనిపించనివ్వరు.

Rasis who hides pain: ఈ రాశుల వారు పైకి నవ్వుతూ లోలోపల బాధ పడతారు
Rasis who hides pain: ఈ రాశుల వారు పైకి నవ్వుతూ లోలోపల బాధ పడతారు (pixabay)

మనకి మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా భవిష్యత్తు గురించి చెప్పవచ్చు. అయితే కొన్ని రాశుల వారి తీరు, స్వభావం ఒక్కోలా ఉంటుంది. ఈ రాశుల వాళ్ళు లోపలే బాధను దాచేసుకుని పైకి నవ్వుతారు. మరి మీ రాశి కూడా ఇందులో ఉందేమో చూసుకోండి.

ఒక్కొక్కరు ఒక వ్యక్తిత్వం కలిగి ఉంటారు. కొన్ని రాశుల వారు ఒకలా ప్రవర్తిస్తే, మరికొన్ని రాశుల వారి ప్రవర్తన, తీరు ఇంకోలా ఉంటుంది. ఈ రాశుల వారు మాత్రం బాధను అస్సలు బయటకి కనిపించనివ్వరు.

కొంతమంది బాధను ఇతరులతో పంచుకుంటారు. బాధ తగ్గిపోతుందని భావిస్తారు. కానీ, కొంతమంది మాత్రం ఎంత బాధ ఉన్నా లోపల ఉంచేసుకుంటారు. పైకి నవ్వుతూ కనపడతారు. వారిని చూస్తే వారికి ఏ బాధ లేదేమో అనిపిస్తుంది. అలా ఉంటారు.

బాధని దాచుకుని బయటకు నవ్వే రాశుల వారు వీళ్ళే:

కర్కాటక రాశి

ఈ రాశి వాళ్ళు ఎంతో దయగా ఉంటారు. చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా బాధను బయటకు కనపడనివ్వరు. ఎప్పుడూ కూడా బాధని లోలోపలే ఉంచుకుంటారు. బయటకి నవ్వుతూ కనబడుతూ ఉంటారు. అందరిని నవ్విస్తారు.

తులా రాశి

తులా రాశి వారు ప్రేమ జీవితంలో బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. తులా రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వారి బాధను బయటకు చెప్పుకోవడానికి అసలు ఇష్టపడరు.

మీన రాశి

మీన రాశి వారు ఇతరులు సంతోషంగా ఉండడానికి వారి బాధను లోలోపలే ఉంచుకుంటారు. ఎమోషన్స్ ని వీళ్ళు ఎప్పుడూ కూడా ఆర్ట్ లేదా క్రియేటివిటీ వైపు చూపిస్తారు. అంతే కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా బాధలను బయటకు చెప్పుకోరు.

సింహ రాశి

సింహ రాశి వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. సింహ రాశి వారు ఎప్పుడూ కూడా బయటకు వారి బాధను చూపించరు. సంతోషంగా కనపడతారు. ఇతరులు బాధ పడితే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. అందుకని బాధను దాల్చేస్తారు.

కన్య రాశి

కన్యా రాశి వారు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు. ఈ రాశి వాళ్ళు బాధలను దాచేస్తారు. బాధని బయటకు చెప్పడం కంటే బాధను పరిష్కరించుకోవడానికి చూస్తారు.

మిధున రాశి

మిధున రాశి వారు కూడా ఎప్పుడూ బాధను బయటకు చూపించరు. లోలోపలే బాధను దాచేసుకుంటారు. ఎవరితో బాధను పంచుకోవడానికి మిధున రాశి వారికి కూడా ఇష్టం ఉండదు. అందుకని ఎంతటి బాధనైనా సరే లోపల ఉంచేసుకుంటారు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారు కూడా వారి బాధను ఇతరులకి చెప్పరు. ఎప్పుడూ కూడా ఇతరులు బాధపడడం ధనస్సు రాశి వారికి నచ్చదు. వీళ్ళు కూడా అన్నిటిని రహస్యాలుగానే ఉంచేస్తారు.

మకర రాశి

మకర రాశి వారు ఎక్కువగా వారి యొక్క గోల్స్ పై ఫోకస్ చేస్తారు. ఎప్పుడూ కూడా వారి ఇమేజ్ ఏమవుతుందని చూసుకుంటారు. బాధ వచ్చినా ఇతరులకి చెప్పరు. బలహీనతను ఇతరుల ముందు బయటపడటానికి మకర రాశి వారికి ఇష్టం ఉండదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner