Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి ఒకే సమయంలో రెండు, మూడు అవకాశాలు.. తిరుగేలేదు
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 23.12.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశి ఫలాలు (దిన ఫలాలు) : 23.12.2024
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ
మాసం: మార్గశిరం, వారం : సోమవారం, తిథి : కృ. అష్టమి, నక్షత్రం : ఉత్తర ఫాల్గుణి
మేష రాశి
విదేశాలలో ఉన్న మీ వాళ్లకు స్వదేశంలో గృహం ఏర్పాటు చేస్తారు. వాళ్ల పెట్టుబడులను మీరు మంచి మార్గంలో పెట్టి మీ వాళ్లకి మేలు చేస్తారు. ఒక సందర్భంలో స్నేహితులకి గోప్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంత ధనాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు.
వృషభ రాశి
ఎదురు చూస్తున్న పుట్టింటి తరపు ప్రయోజనాలు, పంపకాలు చేతికి అందివస్తాయి. ఆధునిక పరికరాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సమేతంగా విహార యాత్రలు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులకు పోకుండా ఓపికతో వ్యవహరించండి. శుభ వార్తలు వింటారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి.
మిథున రాశి
నూతన వ్యాపారం గురించి ఆలోచిస్తారు. ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసారు. కొన్ని విషయాలను గోప్యంగా ఉంచి వ్యవహరిస్తారు. విద్యార్థులకు అనుకూలం. నూతన విద్యల కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. స్కాలర్షిప్స్, రుణాలు లభిస్తాయి. ఓం నమశ్శివాయ వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి.
కర్కాటక రాశి
కొత్త పరిచయాలు. స్నేహాలు ఉపకరిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. మన భూమి వేరొకరి హస్తగతమైందన్న సమాచారం వింటారు. ప్రత్యక్షంగా మీరు నిర్ధారించుకోకుండా ఏ నిర్ణయానికీ రావద్దు. వృత్తి పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. శక్తికి మించి శ్రమించి కొన్ని ప్రాజెక్టుల బాధ్యత నిర్వహిస్తారు.
సింహ రాశి
కీళ్లనొప్పులు, నడుమునొప్పి సమస్యలు బాధిస్తాయి. మార్కెటింగ్ రంగంలో వున్నవారికి అనుకూలం. మీ ప్రవర్తన ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. వ్యాపారం అభివృద్ధి దిశలో ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. నవగ్రహాల దగ్గర అష్టమూలికా తైలం, నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి.
కన్య రాశి
తాత్కాలిక వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. కళా సాహిత్యకారులకు అనుకూలం. నూతన అవకాశాలు అందు కుంటారు. ఒకే సమయంలో రెండు మూడు అవకాశాలు రావటంతో సమయాన్ని సరిగ్గా కేటాయించలేని పరిస్థితులు ఏర్పడతాయి. పూజలలో ఆరావళి కుంకుమ ఉపయోగించండి.
తుల రాశి
సంగీతం పట్ల ఆసక్తి చూపిస్తారు. విస్తృత ప్రయత్నం చేసి గురువులను వెతుకుతారు. వా హనాల అమ్మకాలు-కొనుగోలు విషయంలో మెళకువలు పాటించి అధిక లాభాలు అందుకుంటారు. క్యాటరింగ్, పూల వ్యాపారస్తులకు అనుకూలం. ముఖ పరిచయం లేనివారికి ధన సహాయం చేయవద్దు. ఇతరులతో వ్యక్తిగత విషయాలు చర్చించకండి. మెడలో కాలభైరవ రూపు ధరించండి.
వృశ్చిక రాశి
ఎంతగానో శ్రమించి ఒక ప్రాజెక్టుని సకాలంలో క్లయింట్ కి అందచేస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. లీజు, లైసెన్సులు లభిస్తాయి. గవర్నమెంట్ ఉత్తర్వులకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు మేలు కలగజేస్తాయి. నూతన కాంట్రాక్టులు అందుకుంటారు. అన్ని వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయోజనాలు దక్కించుకుంటారు. కుటుంబ సమేతంగా విహార యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు.
ధనుస్సు రాశి
సంతాన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. వారి గురించి ఎంతగానో సమయం, ధనం వెచ్చిస్తారు. వారి బాగోగులే మీ ఆనందంగా భావిస్తారు. తల్లిదండ్రుల బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు. దైవానుగ్రహం అందుకుంటారు. క్రీడా రంగంలో వున్నవారికి అనుకూలం. మీ గుర్తింపుకు కారణమయ్యే కొన్ని విజయాలు అందుకుంటారు. ఓం నమో నారాయణ వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి.
మకర రాశి
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలం. గతంలో తీసుకున్న రుణాలు చెల్లించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్వయంకృషితో కొన్ని కార్యక్రమాలు | ప్రారంభిస్తారు. ఆదాయం సమకూర్చుకుంటారు. నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ విషయ వ్యవహారాలు అనుకూలం. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి.
కుంభ రాశి
మీ వ్యక్తిత్వాన్ని, మీ పద్ధతిని కించపరిచేవారు, అసత్య ప్రచారాలు చేసేవారు తారసపడతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలం. స్థిరాస్తి అమ్మకాల విషయాలు అనుకూలం. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని, వెంటనే అమలు పరుస్తారు. మీ శక్తిమేరకు ఇతరులకు సహాయం చేస్తారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి పూజ చేయండి.
మీన రాశి
శత్రువర్గం పన్నే పన్నాగాలు మీరు ముందుగానే గ్రహిస్తారు. స్నేహితుల ద్వారా రుణంగా తీసుకున్న ధనాన్ని తిరిగి చెల్లిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ పురోగతికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. నూతన విద్యల పట్ల ఆసక్తి కనబరుస్తారు. సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని చేతికి ధరించండి.
టాపిక్