Ola cab ride : ‘ప్రాణాల కోసం పరిగెట్టాను’- ఓలా క్యాబ్ రైడ్‌లో మహిళకు భయానక అనుభవం!
Ola cab ride : ట్రావెలింగ్ కోసం ఓలా క్యాబ్ బుక్ చేసిన ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది! కొందరు ఆమె ప్రయాణిస్తున్న క్యాబ్‌ని వెంబడించారు. డ్రైవర్ కూడా బండిని పక్కకు ఆపాడు. భయంతో ఆ మహిళ రోడ్డు మీద పరిగెత్తాల్సి వచ్చింది!
రవాణా కోసం నిత్యం వినియోగించే క్యాబ్‌లలో ప్రయాణికుల భద్రతపై ఇటీవలి కాలంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై ఓ మహిళ తాజాగా తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వెల్లడించింది. తాను ఓలా క్యాబ్‌లో వెళుతుండగా కొందరు వెంబడించారని, డ్రైవర్ కారును స్లో చేశాడని, ఆ తర్వాత భయంతో తాను పరిగెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది.
ఇదీ జరిగింది..
హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది ఈ ఘటన. టోల్ దాటిన తర్వాత నేషనల్ మీడియా సెంటర్ సమీపంలో డ్రైవర్ క్యాబ్‌ను స్లో చేశాడని.. జెన్పాక్ట్లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న షాజియా ఏ.. లింక్డ్ఇన్లో పేర్కొన్నారు. కొద్దిసేపటి తర్వాత క్యాబ్ ముందు ఇద్దరు వ్యక్తులు ఉండటాన్ని గమనించానని, డ్రైవర్‌ను బండి ఆపాలని వారు సైగ చేసినట్టు చెప్పింది. వారి సూచనల మేరకే డ్రైవర్ కారును పక్కకు పేశాడని చేశాడని బాధితురాలు తెలిపింది.
"ఎందుకు క్యాబ్ ఆపారు?" అని డ్రైవర్‌ను ప్రశ్నించగా సమాధానం రాలేదని తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఆ మహిళ తెలిపింది. మరో ఇద్దరు వ్యక్తులు వాహనాన్ని సమీపించడంతో తనకు భయం పెరిగినట్టు, డ్రైవఱ్తో సహా మొత్తం ఐదుగురు క్యాబ్ చుట్టూ నిలిచినట్టు వివరించింది. చివరికి.. డ్రైవర్ తన అప్పుల విషయాన్ని ప్రస్తావించాడని ఆమె పేర్కొంది. దీంతో తాను భయపడి క్యాబ్ నుంచి పారిపోయానని ఆమె తెలిపింది.
"అభద్రతా భావానికి లోనై కుడివైపు డోర్ తెరిచి ప్రాణాల కోసం పరిగెత్తాను. ఇది చాలా బాధాకరమైన అనుభవం. నేను ఎంత భయపడ్డానో మాటల్లో చెప్పలేను," అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
"నేను ఓలా యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ని ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు, అది పనిచేయలేదు," అని షాజియా పేర్కొన్నారు.
ఓలా ఎలా స్పందించింది?
ఈ సంఘటన తర్వాత మహిళ ఓలా కస్టమర్ సర్వీసకు ఫిర్యాదు చేసిందని పోస్ట్ వివరించింది. అప్పటి నుంచి 24 గంటలు దాటినా కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆమె వెల్లడించింది. ఈ విషయంపై ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించి ప్రయాణికుల భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని మహిళ కోరింది.
"నేను ఓలాకు ఫిర్యాదు చేశాను. కానీ ఇప్పుడు 24 గంటలు దాటింది, నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఓలా బృందం నుంచి ఈ జవాబుదారీతనం లేకపోవడం దిగ్భ్రాంతికరమైనది. తీవ్రంగా నిరాశపరిచింది. ప్రయాణికుల భద్రత అనేది కేవలం ఒక క్వాలిటీ మాత్రమే కాదు.. ఇది ప్రాథమిక బాధ్యత," అని అభిప్రాయపడింది.
సంబంధిత కథనం