Christmas 2024: శాంతాక్లాజ్ గ్రామానికి వెళితే ప్రతిరోజూ క్రిస్మస్ పండుగే, ఈ గ్రామం ఎక్కడ ఉంది?-if you go to santa claus village every day is christmas where is this village ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Christmas 2024: శాంతాక్లాజ్ గ్రామానికి వెళితే ప్రతిరోజూ క్రిస్మస్ పండుగే, ఈ గ్రామం ఎక్కడ ఉంది?

Christmas 2024: శాంతాక్లాజ్ గ్రామానికి వెళితే ప్రతిరోజూ క్రిస్మస్ పండుగే, ఈ గ్రామం ఎక్కడ ఉంది?

Haritha Chappa HT Telugu
Dec 23, 2024 01:15 PM IST

Christmas 2024: శాంటాక్లాజ్ విలేజ్ చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఆ గ్రామంలో ఏడాదంతా క్రిస్మస్ పండుగలాగే ఉంటుంది. వేసవి సెలవుల్లో ఇక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేయండి. కుటుంబంతో పాటూ వెళ్లేందుకు ఇది బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇంతకీ ఈ గ్రామ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

శాంతాక్లాజ్ గ్రామం
శాంతాక్లాజ్ గ్రామం

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. క్రిస్మస్ క్రైస్తవ సోదరుల పండుగ అయినప్పటికీ, దాన్ని అన్ని మతాల వారు ఆనందంగా చేసుకుంటారు. పిల్లలు క్రిస్మస్ పండుగ కోసం,   శాంతాక్లాజ్ తాత కోసం ఏడాది పొడవునా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ రోజున శాంతాక్లాజ్ వచ్చి తమకు ఇష్టమైన బహుమతులు ఇస్తాడని పిల్లలు భావిస్తారు. నిజజీవితంలో ఇలా అందరికీ జరగకపోవచ్చు కానీ  శాంతాక్లాజ్ కచ్చితంగా పిల్లలకు బహుమతులు పంచే ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం పేరు రోవానిమి. దీన్నే శాంతా క్లాజ్ గ్రామం అని పిలుస్తారు.  పిల్లలకు ప్రియమైన శాంతాక్లాజ్ గ్రామం… ఫిన్లాండ్‌లోని మంచుతో కప్పిన గ్రామం. మీకు హిమపాతాన్ని చూడటం ఇష్టమైతే ఈ గ్రామానికి కచ్చితంగా వెళ్లండి.  శాంతాక్లాజ్ గ్రామం ఫిన్లాండ్ దేశంలోని 'రోవానిమి' లో ఉంది. 

శాంతా గ్రామం ఎక్కడ ఉంది?

ఫిన్లాండ్లోని లాప్లాండ్లో ఈ రోవానిమి అనే శాంతాక్లాజ్ గ్రామం ఉంది. ఇది సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ఇది అధికారికంగా శాంతాక్లాజ్ గ్రామం హోదాను కలిగి ఉంది. ఇక్కడ పిల్లల కోసం సంవత్సరం పొడవునా బహుమతులు ప్యాక్ చేసి ఉంటాయి.  ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు శాంతాను కలవడానికి ఇక్కడకు వస్తారు. శాంతాక్లాజ్ గ్రామంలో క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 23న ప్రారంభమవుతాయి.  ఈ రోజు నుండి శాంటాక్లాజ్ ప్రజలను కలవడానికి బయలుదేరాడు.

రోవానిమి గ్రామం ప్రత్యేకత 

రోవానిమి గ్రామంలో కలపతో చేసిన గుడిసెలు ఉంటాయి.  ఇక్కడ సందర్శకులు ఎక్కడ చూసినా అక్షరాలు, బొమ్మలను చూస్తారు. విశేషమేమిటంటే శాంతా క్లాజ్ కూడా ఇక్కడకు వచ్చే ఉత్తరాలను చదివి పిల్లలకు, పెద్దలకు స్పందిస్తుంటాడు. అందుకే ఏడాది పొడవునా ప్రపంచం నలుమూలల నుంచి ఉత్తరాలు ఇక్కడికి వస్తుంటాయి. ఈ లేఖలను సేకరించడానికి ఒక బృందం పనిచేస్తుంది, వారు వాటిని శాంటాకు డెలివరీ చేయడానికి పనిచేస్తారు. శాంతా తెల్ల గడ్డం, ఎరుపు రంగు దుస్తుల్లో ఇక్కడ నివసిస్తున్నట్లు చెబుతారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు శాంతాతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తారు.  శాంతా ఇంటికి వెళ్లడానికి పర్యాటకులు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ ఫోటో తీసినందుకు ఛార్జీలు వసూలు చేస్తారు.

మీరు ఫిన్లాండ్‌కు వెళితే కచ్చితంగా కొన్ని ప్రదేశాలను చూడండి.  నార్తర్న్ లైట్స్, శాంతా క్లాజ్ విలేజ్, హెల్సింకి, లెవీ, తుర్కు, పౌర్వు, సైమా సరస్సు, ఫిన్లాండ్ నేషనల్ పార్క్, సైవోలినా, సువోన్లీనా కోట వంటి అనేక అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేయవచ్చు. 

Whats_app_banner