Methi Curry: క్రీమీ వెల్లుల్లి మెంతికూర కర్రీ రెసిపీ, ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం
Methi Curry: మెంతికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో చేసే వంటకాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లి మెంతికూర కర్రీ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని అప్పుడప్పుడు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
మెంతికూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతాకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. మీ పిల్లలు ఆకుకూరలు తినకపోతే ఓసారి టేస్టీ మెంతికూర కర్రీ వండి చూడండి. క్రీమీ వెల్లుల్లి మెంతాకులు కర్రీ ఆరోగ్యకరమైన వంటకాల్లో ఒకటి. దీని రుచి పిల్లలకు, పెద్దలకు కూడా నచ్చుతుంది. క్రీమీ వెల్లుల్లి మెంతికూర రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
క్రీమీ వెల్లుల్లి మెంతి ఆకుల రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మెంతి ఆకులు - పావు కిలో
వెల్లుల్లి - ఎనిమిది
పసుపు - అరస్పూను
కారం - అరస్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
ఉల్లిపాయ తరుగు - ఒకటి
టమోటాలు - రెండు
వేరుశెనగలు - గుప్పెడు
తెల్ల నువ్వులు - రెండు స్పూన్లు
కొమ్ము శెనగలు - రెండు స్పూన్లు
క్రీమీ వెల్లుల్లి మెంతి రెసిపీ
- ముందుగా వెల్లుల్లి మెంతి కూర రెసిపీ కోసం క్రీమ్ తయారు చేసుకోవాలి.
- స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు, వేరుశెగన పలుకులు, కొమ్ము శెనగలు వేయించి మిక్సీలో వేసి నీళ్లు వేసి రుబ్బుకోవాలి.
- ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.
- తరువాత అందులో సన్నగా తరిగిన మెంతి ఆకులు వేసి వేయించాలి.
5. కొద్దిగా ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి.
6. కొద్దిగా వేయించాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
7. ఉల్లిపాయలు వేగాక టొమాటో పేస్ట్ వేసి ఉడికించాలి.
8. టమోటాలు ఉడికిన తర్వాత పసుపు, ఎండుమిర్చి, ధనియాల పొడి, కొద్దిగా గరంమసాలా వేసి వేయించాలి.
9. రెడీ చేసిన క్రీమ్ కూడా వేసి కలపాలి.
10. క్రీమ్ వెల్లుల్లి మెంతికూర రెడీ అయినట్టే.
మెంతి ఆకులు తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సిన ఆకుకూరల్లో మెంతి కూర కూడా ఒకటి. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అజీర్తి, గ్యాస్ట్రిక్ సమ్యలు, పేగు సమస్యలు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. మహిళలు మెంతికూర తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెలసరి సమస్యలు రాకుండా ఉండాలంటే మెంతికూరను ఆహారంలో భాగం చేసుకోవాలి.