Affordable Cars : సేఫ్టీ ముఖ్యం బిగిలు.. బడ్జెట్ ధరలో 6 ఎయిర్ బ్యాగులతో వచ్చే కార్లు!-affordable best cars with 6 airbags nissan magnite to hyundai aura checkout list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Affordable Cars : సేఫ్టీ ముఖ్యం బిగిలు.. బడ్జెట్ ధరలో 6 ఎయిర్ బ్యాగులతో వచ్చే కార్లు!

Affordable Cars : సేఫ్టీ ముఖ్యం బిగిలు.. బడ్జెట్ ధరలో 6 ఎయిర్ బ్యాగులతో వచ్చే కార్లు!

Anand Sai HT Telugu
Dec 23, 2024 04:29 PM IST

Safety Cars : బడ్జెట్ ధరలో వచ్చి సేఫ్టీగా ఉండే కార్లు అంటే మధ్యతరగతివారికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాంటి కార్లు చాలా ఉన్నాయి. అందుబాటు ధరలో 6 ఎయిర్ బ్యాగులతో వచ్చే కార్లను చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారత్‌లో కార్లు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అయితే దీనికి తగ్గట్టుగా వాటి సేఫ్టీని కూడా జనాలు ఎక్కువగా చూస్తున్నారు. మంచి సేఫ్టీ ఫీచర్లో వచ్చే కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఎయిర్ బ్యాగులు కార్ల ఫీచర్లలో అందించే సేఫ్టీలో ఒకటి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇవి ప్రాణాలను కూడా కాపాడుతాయి. 6 ఎయిర్ బ్యాగులతో బడ్జెట్ ధరలో వచ్చే కార్లు ఏంటో చూద్దాం..

yearly horoscope entry point

నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుండి మెుదలవుతుంది. ఇటీవల, నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX యాంకర్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్‌లను పొందుతుంది. మాగ్నైట్ రెండు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో దొరుకుతుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ మంచి కారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.5.92 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ ఏడాది నాల్గో తరం స్విఫ్ట్ భారీ అప్‌డేట్‌లతో భారత మార్కెట్లోకి వచ్చింది. 2024 స్విఫ్ట్ బేస్ వేరియంట్ ధర కేవలం రూ. 6.49 లక్షల ఎక్స్-షోరూమ్. స్విఫ్ట్‌లోని పెద్ద మార్పులలో ఒకటి బడ్జెట్ హాచ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను జోడించడం. ఈ కారు ISOFIX యాంకర్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను పొందుతుంది. ఈ కారు అద్భుతమైన ఇంధన సామర్థ్యంతో 1.2-లీటర్ ఇంజన్‌తో పనిచేస్తుంది.

మారుతి సుజుకి డిజైర్

మారుతి ఇటీవలే నాల్గో తరం డిజైర్‌ను విడుదల చేసింది. డిజైర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ అసిస్ట్ స్టాండర్డ్ ఫీచర్‌లుగా వస్తాయి. సీఎన్జీ కూడా అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్

ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్. ఈ ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుండి షురూ అవుతుంది. ఎక్స్‌టర్ అన్ని ట్రిమ్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికమైనవి. ఎక్స్‌టర్ 83 bhp శక్తిని అందించే పెట్రోల్ ఇంజన్ ఉంది. మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌టర్ సీఎన్జీ వేరియంట్‌లు కూడా అమ్మకానికి ఉన్నాయి.

హోండా అమేజ్

హోండా అమేజ్ కూడా ఇటీవల అప్‌డేట్‌గా వచ్చింది. హోండా అమేజ్ ధర రూ.7.99 లక్షల నుండి మెుదలవుతుంది. ఈ కారు బేస్ మోడల్‌కు కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. టాప్ ఎండ్ వేరియంట్ లెవెల్ 2 ఏడీఏఎస్ సూట్‌ను కూడా కలిగి ఉంది.

హ్యుందాయ్ ఆరా

ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుంచి మెుదలు. ఇది స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడా వస్తుంది. ఈ సెడాన్ ఫ్యాక్టరీకి అమర్చిన సీఎన్‌జీ కిట్‌తో కూడా వస్తుంది.

బడ్జెట్ ధరలో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చే మరికొన్ని కార్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. 7.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా పొందుతాయి. 7.99 లక్షలతో ప్రారంభమయ్యే టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో ఆరు ఎయిర్‌బ్యాగ్ సేఫ్టీతో అందిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ ప్రారంభ ధర రూ.7.94 లక్షలు. కియా సోనెట్ రూ. 7.99 లక్షలతో ప్రారంభమవుతుంది.

Whats_app_banner