Protein Food myths: వెజిటేరియన్ ఫుడ్ లవర్స్.. మీరనుకుంటున్నట్లు ఈ పదార్థాలు ప్రొటీన్ అవసరాలు తీర్చలేవట!
Protein Food myths: వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూ ప్రొటీన్ ఆహారం కోసం వెదికే వారు ఇది తెలుసుకోండి. చాలా సంవత్సరాలుగా మనం ప్రొటీన్ ఫుడ్ అనుకుని భావిస్తున్న ఆహార పదార్థాలపై షాకింగ్ విషయం తెలిసింది. అవి మనం అనుకున్నంత స్థాయిలో ప్రొటీన్ అవసరాలు తీర్చలేకపోతున్నాయట.
ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటున్నామని నమ్మకంగా ఉంటున్నారా.. ఇది తెలుసుకోండి. బ్యాలెన్సింగ్ డైట్ తీసుకోవాలని తపన పడేవారికి, జిమ్ కు వెళ్లి కండలు పెంచాలనుకునే వారికి ఈ విషయం కాస్త షాకింగ్ గానే అనిపించొచ్చు. తమ ఆహారంలో ప్రోటీన్‌ను అంతర్భాగంగా చేసుకోవాలని భావించే శాఖాహారులకు ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. చాలా మంది భారతీయులు ప్రొటీన్‌గా భావిస్తూ తమ డైట్‌లో చేర్చుకుంటున్న ఆహార పదార్థాలపై ప్రొటీన్ భావన తప్పు అని పోషకాహార నిపుణురాలు, ఫిట్‌నెస్ కోచ్ మోహిత మస్కరేన్హాస్ పేర్కొన్నారు.
పప్పు, చియా విత్తనాలు, బాదం పప్పు లాంటి వాటి నుంచి లభించే ప్రొటీన్ సమర్థతపై విశ్లేషణాత్మకమైన రిపోర్టు ఇచ్చారు. వాస్తవానికి, అవి చాలా తక్కువ మొత్తంలో ప్రోటీన్ను మాత్రమే కలిగి ఉంటాయని, అవి మన రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చలేవని చెబుతున్నారు. ఆమె చెప్పిన ఆహార పదార్థాలు ఏవేవి ఎంత ప్రొటీన్ కలిగి ఉన్నాయో తెలుసుకుందాం.
- పప్పు: భారతీయ వంటకాల్లో సర్వ సాధారణంగా భావించే వంటకం పప్పు. అయినప్పటికీ, అవి సాధారణంగా ప్రొటీన్ ను కలిగి ఉంటాయి. కానీ, అది చాలా తక్కువ మొత్తంలో మాత్రమే. ఒక కూర గిన్నెలో ఉండే పప్పులో 4-5 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుందట.
- శెనగలు: శెనగలతో తయారుచేసే పౌడర్‌ను కూడా చాలా బలవర్ధకమైన ప్రొటీన్‌గా భావిస్తారు. కానీ దాని ప్రోటీన్ విలువ చాలా తక్కువ ఒక గ్లాసు శెనగలతో చేసిన రసం తీసుకుంటే, దాని నుంచి వచ్చేది కేవలం 5-7 గ్రాముల ప్రొటీన్ మాత్రమే. దీని కంటే ఇతర ప్రోటీన్ వనరులను ఎంపిక చేసుకోవడం మంచిది.
- పుట్టగొడుగులు: పుట్టగొడుగులు, ప్రోటీన్ రిచ్ ఆహారంగా భావిస్తున్నారు. నిజానికి, వాటిలో కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల పుట్టగొడుగులో కేవలం 3 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవి ప్రోటీన్ వనరుగా చెప్పడం కరెక్ట్ కాదు.
- పీనట్ బటర్: పీనట్ బటర్ నుంచి అందే ప్రోటీన్ మొత్తం (10 గ్రాములు/2 టేబుల్ స్పూన్లు). ప్రొటీన్ వనరుగా కొంతవరకు పరవాలేదు. గానీ, ఇది మంచి కొవ్వు వనరుగా పనిచేస్తుంది.
- బాదం పప్పులు: బాదం పప్పులు కూడా కొవ్వు-సమ్మిళిత ప్రోటీన్ వనరుగా ఉన్నాయని చెబుతారు. అవి ప్రోటీన్ ఎక్కువ కాకపోయినా, ఆరోగ్యకరమైన కొవ్వు, ఇతర పోషకాలు కలిగి ఉంటాయి.
- క్వినోవా & మిల్లెట్: ఈ రెండు ఆహారాలు ప్రోటీన్ లో పరిమితి ఉన్నప్పటికీ, కేవలం ప్రొటీన్లు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, ఫైబర్ లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ ప్రోటీన్ పరంగా వీటి ప్రయోజనాలు గోధుమలకు సమానంగా ఉంటాయి.
- చియా సీడ్: చియా విత్తనాలు మంచి పోషకాలు (ఆంటీఆక్సిడెంట్లు, ఫైబర్) కలిగి ఉన్నప్పటికీ, వాటిలో 2 టేబుల్ స్పూన్లలో 4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇవి ప్రోటీన్ వనరుగా అధిక ప్రాముఖ్యత కలిగి ఉండవు.
ఈ ఆహార పదార్థాలు ప్రోటీన్ వనరులుగా భావించి వాడుతున్నాం. కానీ, వాటి ప్రోటీన్ స్థాయిలు తక్కువగా ఉంటాయట. ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవిగా ఉండవచ్చు, కానీ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి ఏ మాత్రం సరిపోవు. తగినంత ప్రోటీన్ అందించే ఆహారాల వివరాలు తెలుసుకుని డైట్ లో చేర్చుకోవడం మంచిదని ఫిట్‌నెస్ కోచ్ మోహిత మస్కరేన్హాస్ సూచిస్తున్నారు.
సంబంధిత కథనం