తెలుగు న్యూస్ / ఫోటో /
Building Permissions : భవన నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఐదంతస్తుల వరకు అనుమతులు అక్కర్లేదు
Building Permission : మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాల్లో ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనమతులు అవసరంలేదని మంత్రి నారాయణ ప్రకటించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు.
(1 / 6)
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాల్లో ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనమతులు అవసరంలేదని మంత్రి నారాయణ ప్రకటించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందన్నారు.
(2 / 6)
భవనాలు, లేఅవుట్లకు సంబంధించి మున్సిపాలిటీకి రుసుము చెల్లిస్తే అనుమతులు ఇస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 15 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భవనాలకు ముందస్తు అనుమతులు అవసరం లేదని ఇటీవల మంత్రి నారాయణ తెలిపారు. డిసెంబరు 31 నుంచి ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి సింగిల్ విండో అప్రూవల్ సిస్టమ్ ద్వారా భవనాల అనుమతులు జారీ చేస్తామన్నారు.
(3 / 6)
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో రహదారులు, తాగునీరు, వీధిదీపాలు, వరదనీరు, ఘనవ్యర్థాల నిర్వహణ అంశాలపై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. పాతపన్ను బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టాలన్నారు.
(4 / 6)
నెల్లూరు, కాకినాడ, రాజమండ్రిలో ఘనవ్యర్థాల నిర్వహణకు అనుమతి వచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో చెత్త సమస్య పరిష్కారం లభిస్తుందన్నారు.
(5 / 6)
వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖ నిధులు పక్కదారి పట్టాయని మంత్రి నారాయణ తెలిపారు. అందుకే పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడంలేదన్నారు.
ఇతర గ్యాలరీలు