జుట్టుకు ఆవనూనె రాసుకోవచ్చా? ఏం జరుగుతుంది..

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Dec 23, 2024

Hindustan Times
Telugu

ఆవనూనెలో కీలకమైన విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆవనూనెను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ఈ ఆవనూనెను జుట్టుకు వాడొచ్చా.. లాభాలు ఉంటాయా అని చాలా మందికి సందేహాలు ఉంటాయి.

Photo: Pexels

ఆవనూనెను జుట్టుకు రాసుకోవచ్చు. ఈ నూనె వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి. 

Photo: Pexels

ఆవనూనెలో విటమిన్ ఏ, ఈ, కే, మెగ్నిషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. దీంతో ఈనూనె రాసుకుంటే జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. 

Photo: Pexels

ఆవనూనెలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో జుట్టును ఈ నూనె బలంగా చేసి రాలడాన్ని తగ్గించగలదు. వెంట్రుకలు చిట్లిపోవడాన్ని కూడా నిరోధిస్తుంది. 

Photo: Pexels

ఆవనూనెను జుట్టుకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. కుదుళ్లకు పోషకాలు బాగా అందుతాయి. జుట్టు మెరుపుతో స్మూత్‍గా ఉంటుంది. 

Photo: Pexels

ఆవనూనెలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. దీంతో స్కాల్ప్ క్లీన్‍గా, ఆరోగ్యంగా  ఉండేలా ఈ నూనెల తోడ్పడుతుంది. 

Photo: Pexels

ఆవనూనెలో ఉండే పోషకాలు జుట్టు పొడిబారకుండా చేయగలవు. జుట్టు చిక్కులు పడే సమస్యను తగ్గించగలవు.

Photo: Pexels

ఆల్కహాల్ లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుందా..?

Image Source From unsplash