Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి 5న స్థానిక కోటా టోకెన్లు జారీ-tirumala srivari darshan tickets local quota released on january 5th 2025 ttd says ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి 5న స్థానిక కోటా టోకెన్లు జారీ

Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి 5న స్థానిక కోటా టోకెన్లు జారీ

Dec 23, 2024, 05:52 PM IST Bandaru Satyaprasad
Dec 23, 2024, 05:52 PM , IST

Tirumala Tickets : తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతి స్థానికులకు ప్రత్యేక కోటా కల్పిస్తున్నారు. 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతి స్థానికులకు ప్రత్యేక కోటా కల్పిస్తున్నారు. 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. 

(1 / 6)

ఇటీవల టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

(2 / 6)

2025, జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ కోటా టికెట్లు జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో, తిరుమల బాలాజీ నగర్ లో జారీ చేయనున్నారు.

(3 / 6)

తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి దర్శన టోకెన్లు పొందవలసి ఉంటుంది. 

(4 / 6)

జనవరి 10 నుంచి 19 తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.  

(5 / 6)

తిరుమల శ్రీవారి మార్చి నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.  

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు