మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు శ్రేయాస్ మీడియాకు.. కోట్లాది మందికి కనెక్ట్ అయ్యేలా ప్లానింగ్!
Mahakumbh Mela 2025 : మహా కుంభ మేళా-2025లో అడ్వర్టైజింగ్ హక్కులను హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్ మీడియా దక్కించుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ అందరికీ దగ్గరైన శ్రేయాస్ మీడియా మార్కెట్‌లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. అడ్వర్టైజింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ మహా కుంభ మేళా 2025 ప్రత్యేక ప్రకటనల హక్కులను తీసుకుంది. 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. దీనికి కోట్లాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు.
ఆధ్యశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్‌లో భాగమైన శ్రేయాస్ మీడియా మహా కుంభ మేళాలో వెండింగ్ జోన్‌లు, అమ్యూజ్‌మెంట్ జోన్, ఫుడ్ కోర్ట్‌తో సహా పలు ఇతర కార్యకలాపాల హక్కులను సైతం దక్కించుకుంది. రూ.6,300 కోట్ల అంచనా బడ్జెట్‌తో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభ మేళా నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల మంది భక్తులను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆకర్షిస్తుందని అనుకుంటున్నారు. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. భారతీయ కంపెనీలు కుంభ మేళా సందర్భంగా ప్రకటనలు, బ్రాండింగ్‌కు సుమారు రూ.3,000 కోట్లు వెచ్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మహా కుంభ మేళా వేదికగా బ్రాండ్లను కోట్లాది మందికి చేర్చడానికి తమకు ఉన్న అనుభవం, నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటామని శ్రేయాస్ మీడియా తెలిపింది. బ్రాండ్‌లను జనాలతో కనెక్ట్ చేసేందుకు తమకున్న అవకాశాన్ని వాడుకుంటామని వెల్లడించింది. 'క్లయింట్ల అవసరాలకు తగ్గట్టుగా కోట్లాది మంది వినియోగదార్లకు బ్రాండ్ చేరుకునేలా వ్యూహాలను అమలు చేస్తాం.' అని శ్రేయాస్ మీడియా వ్యవస్థాపకుడు, చైర్మన్ జి.శ్రీనివాస్ రావు తెలిపారు.
బ్రాండ్స్, వారి టార్గెట్ రీచ్ అయ్యేలా శ్రేయాస్‌కు అపార నైపుణ్యం ఉందని శ్రీనివాస్ రావు చెప్పారు. హై-విజిబిలిటీ అడ్వర్టైజింగ్ స్పాట్స్ మొదలుకుని ఇంటరాక్టివ్ యాక్టివిటీ జోన్స్, పార్కింగ్ జోన్స్‌లో బ్రాండ్స్ ప్రకటనలు కోట్లాది మందికి గుర్తుండిపోయేలా ప్రయత్నాలు ఉంటాయని స్పష్టం చేశారు.
హోర్డింగ్‌లు, గ్యాంట్రీ బాక్స్‌లు, వాచ్/మీడియా టవర్లు, కరెంట్ పోల్స్ బ్రాండింగ్, ఛార్జింగ్ స్టేషన్స్, స్కై బెలూన్స్ మొదలైన వాటితో క్లయింట్ల బ్రాండ్ ప్రమోట్ చేసేందుకు వ్యూహాలు చేస్తామని శ్రీనివాస్ అన్నారు. సెక్టార్-1లోని అమ్యూజ్‌మెంట్ జోన్ మహా కుంభ మేళాలో ప్రత్యేక ఆకర్శణగా నిలవనుంది. ఈ అమ్యూజ్‌మెంట్ జోన్‌లో జెయింట్ వీల్, రాకింగ్ చైర్, మినీ రైలు వంటి వినోదం అందించేవి ఉంటాయి. హనుమాన్ మందిరం సమీపంలో కంపెనీ ఫుడ్ కోర్ట్‌ను నిర్వహించనుంది.
టాపిక్