IRCTC Maha Kumbh Mela : మహా కుంభ మేళా పుణ్య క్షేత్ర యాత్ర-తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ 8 రోజుల టూర్ ప్యాకేజీ
IRCTC Maha Kumbh Mela Package : మహా కుంభ మేళా పుణ్యస్నానంతో పాటు కాశీ, అయోధ్య తీర్థాలను సందర్శించేందుకు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే భారత్ గౌరవ్ ట్రైన్ 8 రోజుల పాటు పలు పుణ్య క్షేత్రాలను కవర్ చేయనుంది.
IRCTC Maha Kumbh Mela Package : మహా కుంభ మేళాకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళా ఒక పవిత్ర సంప్రదాయం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల వచ్చే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానం చేసిన వారికి జన్మ, పునర్జన్మల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద మహా కుంభమేళా నిర్వహిస్తారు. కుంభ మేళాకు వెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.
వారణాసి (కాశీ) - అయోధ్య - ప్రయాగ్‌రాజ్ పుణ్య క్షేత్రాలను కవర్ చేస్తూ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా " మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర " టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. 8 రోజుల పర్యటనలో మూడు పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వెళ్తుంది.
మహా కుంభ పుణ్య క్షేత్ర యాత్ర ముఖ్యాంశాలు
- టూర్ వ్యవధి -7 రాత్రులు/8 రోజులు
- కవర్ చేసే యాత్రా ప్రదేశాలు -వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్
- పర్యటన తేదీ : 19.01.2025
- ప్రయాణం ఇలా : వారణాసి - అయోధ్య - ప్రయాగ్‌రాజ్
- సీట్ల సంఖ్య : 576 (SL: 320, 3AC: 206, 2AC: 50)
- బోర్డింగ్ / డీ బోర్డింగ్ స్టేషన్లు : సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం.
టూర్ ధర (ప్రతి వ్యక్తికి) :
- ఎకానమీ క్లాస్(SL) -రూ 22635(పెద్దలకు)-రూ 21740(పిల్లలకు)
- స్టాండర్స్(3AC)-రూ. 31145(పెద్దలకు) -రూ. 30095 (పిల్లలకు)
- కంఫర్డ్ (2AC)-రూ 38195(పెద్దలకు)- రూ 36935 (పిల్లలకు)
టూర్ వివరాలు
- డే-01 (19.01.2025) - సికింద్రాబాద్ నుంచి ట్రైన్ బయలుదేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో బోర్డింగ్
- డే-02 (20.01.2025) - బోర్డింగ్
- డే-03 (21.01.2025) - వారణాసి (బనారస్) చేరుకుంటారు. భోజనం చేసి గంగా హారతికి వెళ్తారు.
- డే-04 (22.01.2025) - రోడ్డు మార్గంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తారు(సుమారు 120 కి.మీ.). ప్రయాగ్‌రాజ్ వద్ద టెంట్ సిటీలో స్టే చేస్తారు. భోజనం చేసి కుంభమేళాకు వెళ్తారు. సందర్శన, కుంభ స్నానం చేస్తారు. అనంతరం టెంట్ సిటీలో రాత్రి బస చేస్తారు.
- డే-05 (23.01.2024) - రోడ్డు మార్గంలో వారణాసికి వెళ్తారు. కాశీ విశ్వనాథ దేవాలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణా దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి కాశీలో బస చేస్తారు.
- డే -06 (24.01.2025) - అయోధ్య చేరుకుంటారు. శ్రీ రామజన్మ భూమి, హనుమాన్ గర్హిని సందర్శిస్తారు. సాయంత్రం 10:00 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరతారు.
- డే-07 (25.01.2025)- తిరుగు ప్రయాణం
- డే-08 (26.01.2025) - డీ బోర్డింగ్
సంబంధిత కథనం