Beauty Blunder: బ్యూటీ బ్లెండర్‌ను ఎలా శుభ్రం చేయాలి? ఎన్ని రోజులు ఉపయోగించాలి?-how to clean a beauty blender for how many days can it be used ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Blunder: బ్యూటీ బ్లెండర్‌ను ఎలా శుభ్రం చేయాలి? ఎన్ని రోజులు ఉపయోగించాలి?

Beauty Blunder: బ్యూటీ బ్లెండర్‌ను ఎలా శుభ్రం చేయాలి? ఎన్ని రోజులు ఉపయోగించాలి?

Ramya Sri Marka HT Telugu
Dec 23, 2024 02:00 PM IST

Beauty Blunder: మేకప్‌ సాఫీగా, నీట్‌గా వేసుకునేందుకు, మీకు మరింత నేచురల్ లుక్‌ను అందించేందుకు బ్యూటీ బ్లెండర్ చాలా బాగా సహాపయడుతుంది. మేకప్ వేసుకున్నప్పుడల్లా మీరు ఉపయోగించే బ్యూటీ బ్లండర్‌ను ఎలా శుభ్రం చేయాలో, ఎన్ని రోజులకు ఒకసారి దాన్ని మార్చాలో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి.

బ్యూటీ బ్లెండర్‌ను ఎలా శుభ్రం చేయాలి? ఎన్ని రోజులు ఉపయోగించాలి?
బ్యూటీ బ్లెండర్‌ను ఎలా శుభ్రం చేయాలి? ఎన్ని రోజులు ఉపయోగించాలి?

ఈ రోజుల్లో మహిళలు చాలా మంది మేకప్ వేసుకోవడానికి ఇష్టపడతారు. పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మేకప్ కు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు వృత్తిరీత్యా కూడా మేకప్ తప్పక వేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో మేకప్ చేయడానికి అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఈ ఉత్పత్తులతో పాటు, కొన్ని మేకప్ చేయడానికి కొన్ని సాధనాలను కూడా ఉపయోగిస్తారు. ఈ సాధనాలలో మేకప్ బ్రష్, స్పాంజ్, బ్యూటీ బ్లెండర్ ముఖ్యమైనవి. ఈ మూడు టూల్స్‌లో బ్యూటీ బ్లెండర్ ప్రతి ఒక్కరి మేకప్ కిట్‌లో తప్పకుండా ఉంటుంది.

yearly horoscope entry point

బ్యూటీ బ్లెండర్ ఉపయోగాలు..

బ్యూటీ బ్లెండర్ మేకప్ ను మరింత సాఫీగా, నీట్‌గా వేసుకోవడానికి ఉపయోగించే సాధనం. ఇది మేకప్ ప్రోడక్ట్స్ ను స్మూథ్‌గా, నేచురల్‌గా చక్కటి ఫినిషింగ్ ఇచ్చేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫౌండేషన్, కంసీలర్, క్రీమ్ ప్రోడక్ట్స్ ను సమానంగా, సాఫీగా అప్లై చేసుకోవడానికి ఇది బాగా సహాయపడుతుంది. మేకప్ ఓవర్ గా కనిపించకుండా మీకు సహజమైన లుక్ అందిస్తుంది. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ పని చేసుకునేందుకు సహాయపడుతుంది. అయితే ఈ బ్యూటీ బ్లెండర్ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీన్ని శుభ్రత, వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చర్మ సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.

బ్యూటీ బ్లెండర్ ను ఎలా శుభ్రం చేయాలి?

మేకప్ వేసుకున్న ప్రతిసారీ ఉపయోగించే బ్యూటీ బ్లెండర్ ఎలా శుభ్రం చేయాలో, ఎప్పుడు మార్చుకోవాలో తెలియక చాలా మంది మహిళలు అయోమయానికి గురవుతుంటారు. ఇక్కడ ఆ విషయాలను మీరు తెలుసుకోవచ్చు. బ్యూటీ బ్లెండర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నిత్యం వాడేటప్పుడు అది బ్యాక్టీరియాను, మేకప్ రెసిడ్యూ సేకరించవచ్చు. దీన్ని శుభ్రం చేయకపోతే మీ చర్మారోగ్యానికి హాని కలగచ్చు.

1. నీటితో శుభ్రం చేయడం

బ్యూటీ బ్లెండర్ ను నేరుగా నీటిలో కాసేపు నానబెట్టవచ్చు.ఇలా నానబెట్టడం వల్ల మేకప్ అవశేషాలన్నీ నీటిలోకి వచ్చేస్తాయి.తరువాత దాన్ని గట్టిగా రుద్దకుండా ,నీరు బ్లెండర్ లోకి ప్రవేశించకుండా దాన్ని సున్నితంగా నలిపి శుభ్రం చేయండి. షాంపూ నీటిలో కూడా బ్లెండర్ ను నానబెట్టవచ్చు. మొండి మరకల కోసం సిలికాన్ స్క్రబ్‌పై సున్నితంగా రుద్దండి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి.

2. సబ్బుతో లేదా మేకప్ బ్రష్ క్లీనర్ తో శుభ్రం చేయడం

బ్యూటీ బ్లెండర్ కు సోప్ అప్లై చేసి మేకప్ బ్రష్ క్లీనర్ తో శుభ్రం చేయచ్చు. గట్టిగా రుద్దడం వల్ల బ్లెండర్ మీరీ మెత్తగా మారి పాడయిపోతుంది. బ్యూటీ బ్లెండర్ ను అంగుళం లేదా మెత్తటి బ్రష్ తో నలపండి, దానివల్ల మేకప్ అవశేషాలు మరింత సులభంగా బయట పడతాయి.

3. నీరు పిండేయాలి

శుభ్రం చేసిన తర్వాత బ్లెండర్ లో నీరు లేకుండా టవల్ లేదా ఏదైనా క్లాతులో వేసి నొక్కి నీటిని క్రమంగా పీల్చుకునేలా చేయండి. నీరు అందులోనే ఉంటే బ్లెండర్ పాడయిపోతుంది.పచ్చిగా ఉన్న బ్లెండర్ తో మేకప్ ఎప్పుడూ వేసుకోకూడదుజ ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది.

4. ఆరబెట్టాలి

బ్యూటీ బ్లెండర్ ను శుభ్రం చేసిన తర్వాత గాలి. వెలుతురు వచ్చే ప్రదేశంలో ఆరబెట్టాలి. పూర్తిగా ఆరకపోతే బ్లెండర్ దుర్వాసన వస్తుంది. కనుక పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే మేకప్ బ్యాగ్ లో పెట్టుకోండి.

బ్యూటీ బ్లెండర్‌ను ఎప్పుడు మార్చాలి?

  • బ్యూటీ బ్లెండర్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం చర్మానికి మంచిది కాదు. ఎంత శుభ్రం చేసినా మేకప్ అవశేషాలు కొన్ని దాంట్లో ఉండిపోతాయి. కనుక ప్రతి మూడు నెలలకోసారి మార్చేసి కొత్తది తీసుకోవాలి.
  • బ్యూటీ బ్లెండర్‌ స్పాంజ్ మీద ఒక రకమైన డ్యామేజ్ కనిపించడం ప్రారంభించినప్పుడు మార్చడం మంచిది.
  • బ్యూటీ బ్లెండర్ రంగు పూర్తిగా మారినప్పుడు దాన్ని మార్చాలి.
  • మేకప్ బ్యూటీ బ్లెండర్ చెడు వాసన రావడం ప్రారంభించిందంటే దానిని మార్చాల్సిన సమయం ఆసన్నమైంది అని అర్థం.
  • బ్యూటీ బ్లెండర్ పొరపాటున కట్ అయినా.. ముక్కలు ముక్కులుగా ఊడిపోతున్నా దానిని మార్చండి.

Whats_app_banner

సంబంధిత కథనం