Bride essentials: పెళ్లికూతురి మేకప్ కిట్‌లో ఈ వస్తువులు పక్కాగా ఉండాల్సిందే
Bride essentials: మీరు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లయితే, మీ బ్రైడల్ కిట్ లో ఖచ్చితంగా ఈ 5 వస్తువులను ఉంచుకోండి. ఇవి మీ అందానికి అవసరానికి పనికొస్తాయి.
పెళ్లికూతురంటే బోలెడు వస్తువులు కొనుక్కోవాలి. ఎంత షాపింగ్ చేసినా ఏదో ఒకటి మిగిలిపోయే ఉంటుంది. ముఖ్యంగా మేకప్ కిట్ విషయంలో జాగ్రత్తలు అవసరం. అందులో కేవలం మేకప్ కోసమే కాకుండా మీకు అత్యవసరంలో ఉపయోగపడే కొన్ని వస్తువులూ ఉంచుకోవాలి. అనుకోని ఇబ్బంది వచ్చినా కూడా ఈ చిన్న వస్తువులు మిమ్మల్ని కాపాడతాయి. అవేంటో చూసేయండి.
బింది బుక్:
పెళ్లికూతురు లుక్‌లో ముఖ్యమైంది నుదుటన తిలకం. మేకప్ లుక్ మార్చేస్తుందిది. మీ ముఖం ఆకారం తగ్గట్లు సరైన బింది ఎంచుకోండి. మీ బ్రైడల్ కిట్ లోనూ బింది బుక్ ఒకటి ఉంచుకోండి. స్టిక్కర్ ప్యాకెట్ కన్నా కూడా బింది బుక్ అవసరానికి బాగా పనికొస్తుంది. దీంట్లో రకరకాల ఆకారాలు, అన్ని రంగుల్లో స్టిక్కర్లుంటాయి. అవసరానికి తగ్గట్లు మీ లుక్ మార్చేసుకోవచ్చు.
డబుల్ సైడెడ్ టేప్
డబుల్ సైడెడ్ టేప్ ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కొంగు బ్లవుజు దగ్గర కాస్త కిందికి జారకుడా ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. పెళ్లిలో ఆ ఇబ్బంది లేకుండా డబుల్ సైడెడ్ టేప్ అంటించొచ్చు. ఇవి మామూలుగా కాకుండా ట్రాన్స్‌పరెంట్ రకాలు దొరుకుతాయి. వాటిని అంటించినట్లు కూడా తెలీదు. ఈ టేప్ సాయంతో నగలు కూడా కదలకుండా ఒక చోట ఉండేలా చేయొచ్చు. తలమీద ముసుగు కూడా సరిగ్గా ఉంచడానికి ఇది సాయపడుతుంది.
ఫేస్ రేజర్
పెళ్లికి ముందు వ్యాక్సింగ్ చేయించుకోవడం మామూలే. కానీ కాస్త ఎక్కువ రోజులు గ్యాప్ ఉంటే పెళ్లి రోజుకల్లా వెంట్రుకలు కాస్త పెరగొచ్చు. ముఖ్యంగా మేకప్ వేసేటప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అవసరాన్ని బట్టి వాడుకునేలా మీ దగ్గర ఒక చిన్న పోర్టబుల్ ఫేస్ రేజర్ ఉంచుకోండి.
యాంటీ యాక్నె క్రీమ్
చాలాసార్లు పెళ్లి ఒత్తిడి, అలసట వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. కాబట్టి ఏదో ఒక యాంటీ యాక్నె క్రీమ్ లేదా ఫేస్ వాష్ మీ దగ్గర ఉంచుకోండి. ఇది మీ చర్మం మొటిమలతో బాధపడకుండా కాపాడుతుంది. మేకప్ వేసుకునేటప్పుడు కూడా వీటిని యాక్నె ఇబ్బందులు ఉన్నవాళ్లు వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
నెయిల్ ఎక్స్‌టెన్షన్లు
నెయిల్ ఎక్స్‌టెన్షన్లు తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి. టెంపరరీ స్టికాన్ ఎక్స్‌టెన్షన్లు ఇప్పుడు సులువుగా దొరుకుతున్నాయి. మీరు ఇదివరకే చేయించుకున్న మ్యానిక్యూర్ కాస్త చెడిపోతే ఈ ఎక్స్‌టెన్షన్లు పనికొస్తాయి. పొరపాటునా గోరు విరగడం లాంటివి అయితే ఈ స్టికాన్ నెయిల్స్ చాలా ఉపయోగపడతాయి. మీ చేతులు చాలా అందంగానూ కనిపిస్తాయి.