India-Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ తిరిగి పంపుతుందా?-will india send back former bangladesh pm sheikh hasina to her country what are the challenges before bharat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India-bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ తిరిగి పంపుతుందా?

India-Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ తిరిగి పంపుతుందా?

Anand Sai HT Telugu
Dec 23, 2024 10:14 PM IST

India-Bangladesh : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తన దేశానికి పంపాలని బంగ్లాదేశ్ అభ్యర్థించింది. ప్రధాని షేక్ హసీనాను అప్పగించడానికి హోం సలహాదారు జహంగీర్ ఆలం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ పంపారు. అయితే భారత్ పంపే సమాధానం ఏంటని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాజీ ప్రధాని షేక్ హసీనాను ఢాకాకు తిరిగి పంపాలని కోరుతూ భారత్‌కు దౌత్యపరమైన లేఖను పంపింది. ఈ ఏడాది ఆగస్టులో అధికారం నుంచి వైదొలిగిన షేక్ హసీనా బంగ్లాదేశ్‌ నుంచి పారిపోయి భారత్‌లో ఆశ్రయం పొందారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ వదలాల్సి వచ్చింది. షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక మరియు పౌర అధికారులపై ఢాకా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

yearly horoscope entry point

బంగ్లాదేశ్, భారతదేశం మధ్య ఇప్పటికే అప్పగింత ఒప్పందం ఉంది. ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు తీసుకురావచ్చని బంగ్లాదేశ్ అధికారులు భావిస్తున్నారు. గత నెలలో తాత్కాలిక ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాను అప్పగించాలని భారతదేశాన్ని అభ్యర్థిస్తానని చెప్పారు.

నెలల తరబడి మౌఖిక డిమాండ్ల తర్వాత బంగ్లాదేశ్ ఇప్పుడు లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆమె పాలనకు వ్యతిరేకంగా విద్యార్థుల సామూహిక నిరసనల నేపథ్యంలో ఆమె తన దేశం విడిచింది. వెంటనే నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, మారణహోమానికి హసీనా పాల్పడిందని ఆరోపించిన యూనస్ ఇప్పుడు ఆమెను అప్పగించే ప్రక్రియను భారత్ వేగవంతం చేయాలని కోరుతున్నాడు. హసీనా 200కి పైగా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటోంది. హసీనా అప్పగింతపై భారత్ స్పందించాల్సి ఉంది.

రెండు పొరుగు దేశాలు అప్పగించే ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రాథమికంగా సరిహద్దు ఉగ్రవాదం, వలసలు, మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడం కోసం 2013లో సంతకం జరిగింది. దీనిని 2016లో సవరించారు. 2016 సవరణల ప్రకారం అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బంగ్లాదేశ్ నేరానికి రుజువు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అప్పగింతకు కోర్టుల వారెంట్లు సరిపోతాయి. ప్రస్తుతం హసీనా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది.

నిజానికి హసీనా, అవామీ లీగ్ భారతదేశానికి స్నేహితులు. హసీనా అప్పగింతను తిరస్కరించేందుకు భారత్‌ చేసే ప్రయత్నాలను బంగ్లాదేశ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని యూనస్‌ న్యాయ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ స్పష్టం చేశారు.

కొంతమంది న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సైనిక నేరాలకు సంబంధించిన అప్పగింత ఒప్పందంలోని ఆర్టికల్ 8లో పేర్కొన్న నిబంధన ప్రకారం లేదా సరైన ఆధారాలు లేనందున హసీనా అప్పగింతను భారతదేశం తిరస్కరించవచ్చు. అయితే ఇక్కడ భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. నిర్మొహమాటంగా తిరస్కరిస్తే.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. హసీనాకు సహాయం చేయడమే కాకుండా పొరుగుదేశానికి దూరం కాకుండా భారత్ మధ్య మార్గాన్ని ఎంచుకోవలసి ఉంటుంది.

Whats_app_banner

టాపిక్