MG Cyberster Electric Car : ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందోచ్.. దీంట్లో వెళ్తుంటే ఆ ఫీల్ మాములుగా ఉండదు!-mg cyberster electric sports car powertrain revealed know this car detail here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Cyberster Electric Car : ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందోచ్.. దీంట్లో వెళ్తుంటే ఆ ఫీల్ మాములుగా ఉండదు!

MG Cyberster Electric Car : ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వచ్చేస్తుందోచ్.. దీంట్లో వెళ్తుంటే ఆ ఫీల్ మాములుగా ఉండదు!

Anand Sai HT Telugu
Dec 23, 2024 10:00 PM IST

MG Cyberster Electric Car : జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును 2025 జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. దీనిని మొదటిసారిగా మార్చి 2024లో భారతదేశంలో ప్రదర్శించారు.

ఎంజీ సైబర్‌స్టర్
ఎంజీ సైబర్‌స్టర్

జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును 2025 జనవరిలో విడుదల చేయనుంది. లాంచ్ కు ముందు కంపెనీ ఎంజీ సైబర్‌స్టర్ పవర్ ట్రెయిన్ ఆప్షన్ ప్రకటించింది. భారతదేశంలోని 12 నగరాల్లో 12 ఎక్స్ క్లూజివ్ లగ్జరీ షోరూమ్‌లను ప్రారంభించడానికి ఎంజీ సెలెక్ట్ సన్నాహాలు చేస్తోంది. ఎంజీ సైబర్‌స్టర్ ఈ కంపెనీ నుంచి వస్తున్న మెుదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు.

yearly horoscope entry point

ఈ కారును ఫార్ములా వన్ ఇంజనీర్ మార్కో ఫెనెల్లో ట్యూన్ చేశారు. ఈ కారు 510 పీఎస్ పవర్, 725 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు స్పోర్ట్స్ కార్ ప్రియులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది. 110 mm మందం కలిగిన 77 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది.

నిజానికి ఎంజీ సైబర్‌స్టర్ వేగం, పనితీరుకు చాలా ఫేమస్. దీని ఛాసిస్‌ను ఫార్ములా వన్ ఇంజనీర్ మార్కో ఫెనెల్లో ట్యూన్ చేశారు. ఇది కారు నిర్వహణ, నియంత్రణను మెరుగుపరుస్తుంది. ఈ కారు అధిక వేగంతో కూడా స్థిరంగా ఉంటుంది. డ్రైవర్ పూర్తిగా కారును నియంత్రణలో ఉంచుకుంటాడు. సైబర్‌స్టర్ శక్తివంతమైన డ్యూయల్ మోటార్ సిస్టమ్‌ని కలిగి ఉంది. దీనితో కారు చాలా వేగాన్ని అందుకోగలదు.

ఎంజీ సైబర్‌స్టర్ 8-లేయర్ ఫ్లాట్ వైర్ వైండింగ్, వాటర్‌ఫాల్ ఆయిల్-కూల్డ్ మోటార్‌ను కలిగి ఉంది. దీనితో మోటారు అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా సరిగ్గా పని చేస్తుంది. ఇది కారు శక్తి, సామర్థ్యం, విశ్వసనీయతను పెంచుతుంది. సైబర్‌స్టర్ ఈవీ సస్పెన్షన్ గురించి చూస్తే.. ఇది ముందు భాగంలో డబుల్ విష్‌బోన్, వెనుక భాగంలో ఫైవ్ లింక్ ఇండిపెండెంట్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇది కారు రైడ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. రోడ్డుపై కారు సాఫీగా నడుస్తుంది. హ్యాండ్లింగ్ కూడా మెరుగ్గా ఉంటుంది.

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మొదటి స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ వాహనం అయిన సైబర్‌స్టర్‌కు ఏరోడైనమిక్ డిజైన్ అందించారు. ఇది వెనుక భాగంలో వాలుగా ఉండే రూఫ్‌లైన్‌ను కలిగి ఉంది. స్పోర్టీ లుక్‌ని ఇస్తుంది. కారు వేగం, మైలేజ్ రెండింటినీ మెరుగుపరుస్తుంది. ఎంజీ సైబర్‌స్టర్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ సిజర్ డోర్‌లను కలిగి ఉంది. ఈ డోర్లు పైకి తెరుచుకుంటాయి. ఇది కారుకు ప్రత్యేకమైన స్టైలిష్ రూపాన్ని ఇస్తుంది. భద్రత కోసం ఈ డోర్లు డ్యూయల్ రాడార్ సెన్సార్లను కలిగి ఉంటాయి. ఈ సెన్సార్లు డోర్లు తెరిచేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వస్తువులను గుర్తించి అలర్ట్ ఇస్తాయి. యాంటీ-పించ్ బౌన్స్-బ్యాక్ ఫీచర్ కూడా ఉంది. ఇది తలుపు మూసే సమయంలో వేళ్లు చిక్కుకోకుండా కాపాడుతుంది.

ఎంజీ సైబర్‌స్టర్ కేవలం స్పోర్ట్స్ కారు మాత్రమే కాదు.. టెక్నాలజీతో వస్తుంది. ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు ద్వారా కంపెనీ ఒక ప్రత్యేక లగ్జరీ అనుభవాన్ని అందించాలనుకుంటోంది. ఎంజీ సైబర్‌స్టర్ సింగిల్, డ్యూయల్ మోటార్ వేరియంట్లలో లభిస్తుంది.

Whats_app_banner