నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
Unsplash
By Anand Sai Dec 23, 2024
Hindustan Times Telugu
నల్ల జీలకర్రలో శరీరానికి అవసరమైన వివిధ పోషకాలు ఉంటాయి. దీనిలోని రసాయనాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి.
Unsplash
నల్ల జీలకర్రలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.
Unsplash
శరీరంలో ఆక్సిజన్ లోపం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంలో నల్ల జీలకర్ర ఎంతగానో సహకరిస్తుంది.
Unsplash
ఉదర సంబంధిత సమస్యలు, కిడ్నీ సంబంధిత సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలను నయం చేయడంలో నల్ల జీలకర్ర దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
Unsplash
నల్ల జీలకర్ర శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి, బీపీని నియంత్రించి, చర్మ సంబంధిత సమస్యలను నయం చేస్తుంది.
Unsplash
శరీరంలో నొప్పి, మంటను కూడా ఇది తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేస్తుంది.
Unsplash
నల్ల జీలకర్ర టీ తాగితే ఎన్నో ఉపయోగాలు. గ్లాసు నీటిలో ఒక చెంచా నల్ల జీలకర్ర వేసి, సగం గ్లాసు అయ్యే వరకు మరిగించి, వడకట్టి ఉదయాన్నే తాగాలి.