iPhone 15 Discount : ఐఫోన్ 15పై సూపర్ డిస్కౌంట్.. మంచి ఆఫర్ మళ్లీ దొరకదేమో.. ఇక లేట్ చేయకండి బ్రో!-apple iphone 15 is available with huge discount know how to get this and check features and price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 15 Discount : ఐఫోన్ 15పై సూపర్ డిస్కౌంట్.. మంచి ఆఫర్ మళ్లీ దొరకదేమో.. ఇక లేట్ చేయకండి బ్రో!

iPhone 15 Discount : ఐఫోన్ 15పై సూపర్ డిస్కౌంట్.. మంచి ఆఫర్ మళ్లీ దొరకదేమో.. ఇక లేట్ చేయకండి బ్రో!

Anand Sai HT Telugu
Dec 23, 2024 08:30 PM IST

iPhone 15 Discount Offers : మీకు ఐఫోన్ కొనుక్కోవాలని ఉందా? అయితే ఇదే సరైన సమయం. ఎందుకంటే మంచి డిస్కౌంట్ నడుస్తోంది. ఐఫోన్ 15 మీద ఆఫర్ ఉంది.

ఐఫోన్ 15 మీద డిస్కౌంట్
ఐఫోన్ 15 మీద డిస్కౌంట్

మీరు ఐఫోన్ 15 కొనాలని ఆలోచిస్తుంటే ఇది రైట్ టైమ్. ఫ్లిప్ కార్ట్‌లో జరుగుతున్న బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నారు. ఐఫోన్ 15 ఫోన్‌పై డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ మీద అందుబాటులో ఉన్న ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం:

yearly horoscope entry point

ఇదే డిస్కౌంట్ ఆఫర్

ఐఫోన్ 16 లాంచ్ తర్వాత ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ధరను తగ్గించింది. రూ.69,900 ధరకు ఐఫోన్ 15ను యాపిల్ విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం మెరుగైన డీల్‌ను అందిస్తోంది. ఐఫోన్ 15ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,401 భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నారు. అంటే 16 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,499 ధరకు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా ఈఎంఐ ఆప్షన్లు నెలకు రూ .2,057 నుండి ప్రారంభమవుతాయి. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో, ఫోన్‌పై రూ .40,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. నిజానికి ఐఫోన్ 15 ప్రో మీద కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ఉండేది. కానీ స్టాక్ అయిపోయినట్టుగా చూపిస్తుంది.

ఫీచర్లు

ఐఫోన్ 15లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ డిస్‌ప్లేను అందించారు. ఐఫోన్ 15లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంది. ఐఫోన్ 15లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. ఈ ఫోన్లో 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఐఫోన్ 15 డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఇది ఐఫోన్ 14 ప్రో వంటి మునుపటి ఐఫోన్ మోడల్‌లలో కనిపించే సాంప్రదాయ నాచ్‌ను భర్తీ చేసే క్వాలిటీ. 2000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈఫోన్ అధునాతన ఏ16 బయోనిక్ చిప్‌తో అమర్చబడి ఉంది.

కెమెరా

ఇక కెమెరా విషయానికొస్తే ఐఫోన్ 15లో అప్‌గ్రేడ్ చేసిన కెమెరా ఉంది. ఇందులో క్వాడ్ పిక్సెల్ సెన్సార్‌తో 48ఎంపీ ప్రైమరీ కెమెరా, వేగవంతమైన ఆటోఫోకస్ కోసం 100 శాతం ఫోకస్ పిక్సెల్స్ ఉన్నాయి. జూమ్ చేసి చిత్రాలను తీసేందుకు టెలిఫోటో లెన్స్‌ను ఉపయోగించవచ్చు. స్మార్ట్ హెచ్‌డీఆర్, ఆటోమేటేడ్ పోర్ట్రెయిట్ ఫొటో క్యాప్చర్ వంటి కొత్త ఫీచర్లను పరిచయం చేశారు.

గమనిక : డిస్కౌంట్ ధరలు మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న ఆఫర్ ఆధారంగా కథనం ఇచ్చాం. 

Whats_app_banner