NIFT 2025 : ఫ్యాషన్ టెక్నాలజీ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇలా అప్లై చేయాలి.. చివరి తేదీ ఇదే!
NIFT Exam Date 2025 : నిఫ్ట్ 2025 కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దేశంలోని వివిధ నిఫ్ట్ కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు nift.ac.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)లో ప్రవేశానికి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. దేశంలోని వివిధ నిఫ్ట్ కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు exams.nta.ac.in/NIFT అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 6 జనవరి 2025. అభ్యర్థులకు దరఖాస్తు కరెక్షన్ విండో 2025 జనవరి 10 నుంచి 12 వరకు అందుబాటులో ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రూ.5000 ఆలస్య రుసుము చెల్లించి జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2025-26 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నిఫ్ట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.. ఎన్టీఏకు అప్పగించింది. నిఫ్ట్ 2025 పరీక్షను 2025 ఫిబ్రవరి 9న నిర్వహించే అవకాశం ఉంది.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ దరఖాస్తు చేసుకోవడానికి రూ.3000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 ఫీజు చెల్లించాలి.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (ఎన్సీఎల్) బీడీఎస్, B.F.Tech అనే రెండు ప్రోగ్రామ్లకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.4500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు బీడీఎస్, B.F.Tech అనే రెండు కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.2250 ఫీజు చెల్లించాలి.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో అర్హత, విద్యార్హతలను సరిచూసుకోవాలి. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.