Shyam Benegal Dies: ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత.. 90వ పుట్టినరోజు జరుపుకున్న కొన్ని రోజుల్లోనే..-shyam benegal dies ankur nishant manthan bhumika movies director ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shyam Benegal Dies: ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత.. 90వ పుట్టినరోజు జరుపుకున్న కొన్ని రోజుల్లోనే..

Shyam Benegal Dies: ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత.. 90వ పుట్టినరోజు జరుపుకున్న కొన్ని రోజుల్లోనే..

Hari Prasad S HT Telugu
Dec 23, 2024 08:30 PM IST

Shyam Benegal Dies: శ్యామ్ బెనెగల్ కన్నుమూశాడు. దేశం మెచ్చిన తొలితరం దర్శకుల్లో ఒకరైన ఆయన.. ఈ మధ్యే తన 90వ పుట్టిన రోజు జరుపుకోగా.. అంతలోనే కన్నుమూయడం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆయన సొంతం.

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత.. 90వ పుట్టినరోజు జరుపుకున్న కొన్ని రోజుల్లోనే..
ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత.. 90వ పుట్టినరోజు జరుపుకున్న కొన్ని రోజుల్లోనే..

Shyam Benegal Dies: ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ 90 ఏళ్ల వయసులో సోమవారం (డిసెంబర్ 23) కన్నుమూశారు. అంకుర్, భూమిక, మంథన్, నిషాంత్ లాంటి ఎన్నో అవార్డు విన్నింగ్ సినిమాలను తెరకెక్కించిన గొప్ప దర్శకుడాయన. ఈ మధ్యే తన 90వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతలోనే ఈ విషాద వార్త సినీ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.

yearly horoscope entry point

శ్యామ్ బెనెగల్ కన్నుమూత

దర్శకుడు శ్యామ్ బెనెగల్ సోమవారం (డిసెంబర్ 23) సాయంత్రం కన్నుమూసినట్లు ఆయన కూతురు వెల్లడించింది. "ముంబై సెంట్రల్లోని వాకార్డ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సాయంత్రం 6.38 గంటలకు శ్యామ్ బెనెగల్ కన్నుమూశారు. ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడ్డారు. కొన్నేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా.. ఈ మధ్య తీవ్రమైంది. ఆయన మరణానికి కారణం ఇదే" అని పీటీఐతో మాట్లాడుతూ ఆయన కూతురు తెలిపింది.

ఈ మధ్యే అంటే డిసెంబర్ 14న ముంబైలో బెనెగల్ తన 90వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. శ్యామ్ బెనెగల్ తీసిన అంకుర్ మూవీ ద్వారానే బాలీవుడ్ కు పరిచయం అయిన ప్రముఖ నటి షబానా అజ్మీ ఈ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. మరో నటుడు నసీరుద్దీన్ షా కూడా ఈ వేడుకలకు వచ్చాడు. అయితే ఆ సెలబ్రేషన్స్ తర్వాత పది రోజుల్లోనే ఆయన కన్నుమూయడం విషాదాన్ని మిగిల్చింది.

శ్యామ్ బెనెగల్ గురించి..

శ్యామ్ బెనెగల్ ఇండియా మెచ్చిన తొలితరం దర్శకుల్లో ఒకరు. సాంప్రదాయ మెయిన్‌స్ట్రీమ్ సినిమా నిబంధనలను పక్కన పెట్టి తనదైన మార్క్ మూవీస్ అందించిన ఘనత ఆయన సొంతం. సామాజిక అంశాలనే తన కథాంశాలుగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1970లు, 80ల్లో ఆయన తీసిన సినిమాలు ఎన్నో జాతీయ అవార్డులను సాధించాయి.

1976లో వచ్చిన మంథన్, 1977లో వచ్చిన భూమిక: ది రోల్, 1978లో వచ్చిన జునూన్, 1982లో వచ్చిన ఆరోహణ్, 2004లో వచ్చిన నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్‌గాటెన్ హీరో, 2010లో వచ్చిన వెల్డన్ అబ్బాలాంటి సినిమాలకు అవార్డులు వచ్చాయి. పుట్టిన రోజులు జరుపుకునేంత గొప్పగా తాను చేసిందేమీ లేదని ఈ మధ్యే తన 90వ పుట్టిన రోజు సందర్భంగా పీటీఐతో మాట్లాడుతూ శ్యామ్ బెనెగల్ అన్నారు. 2023లో వచ్చిన ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్.. ఆయన తీసిన చివరి సినిమా. ఇక ఒకప్పుడు సంచలనం సృష్టించిన మూవీ మంథన్ ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. వర్గీస్ కురియన్ శ్వేత విప్లవం ఆధారంగా తెరకెక్కించిన మూవీ ఇది. నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్ నటించారు.

Whats_app_banner