Jagtial Crime : బాలుడిపై అత్యాచారం, జగిత్యాల కోర్టు సంచలన తీర్పు-నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష-jagtial court sensational verdict on boys molestation culprit will get 20 years permission ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Crime : బాలుడిపై అత్యాచారం, జగిత్యాల కోర్టు సంచలన తీర్పు-నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Jagtial Crime : బాలుడిపై అత్యాచారం, జగిత్యాల కోర్టు సంచలన తీర్పు-నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

HT Telugu Desk HT Telugu

Jagtial Crime : బాలుడిపై అత్యాచారం కేసులో జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20 వేల జరిమానా విధించింది.

బాలుడిపై అత్యాచారం, జగిత్యాల కోర్టు సంచలన తీర్పు-నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష (HT Telugu)

Jagtial Crime : బాలుడిపై అత్యాచారం చేసిన సంఘటనలో జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20 సంవత్సరాలు జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించింది. మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడు అయన గోగుల సాయికుమార్‌కు జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.2000 జరిమానా విధించింది.

ఈ కేసులో నిందితుడు గోగుల సాయికుమార్, సిరిపూర్ గ్రామానికి చెందిన బాలుడిని మామిడికాయలు తెచ్చుకుందామని చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పటి మల్లాపూర్ ఎస్సై డి. ప్రథ్వీధర్ కేసు నమోదు చేశారు. అప్పటి మెట్ పల్లి సీ.ఐ ఎం. రవికుమార్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో సాక్షులను, శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు.

జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి నీలిమ ఈ కేసు విచారణ చేపట్టి, నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించారు. ఈ కేసును సమర్థంగా నిర్వహించిన అప్పటి ఎస్సై పృథ్వీధర్, మెట్ పల్లి సీఐ ఎం. రవికుమార్‌ను, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టి విచారణను నడిపించింది. కానిస్టేబుల్‌ రంజిత్ ను జిల్లా అశోక్ కుమార్ అభినందించారు.