Christmas Day 2024: క్రిస్మస్ రోజున పిల్లలను రెడీ చేసేటప్పుడు ఈ చిట్కాలను పాటించారంటే, చూసినవారంతా వావ్ అనాల్సిందే!-on this christmas day 2024 tips to prepare kids on christmas day that will make everyone say wow ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Christmas Day 2024: క్రిస్మస్ రోజున పిల్లలను రెడీ చేసేటప్పుడు ఈ చిట్కాలను పాటించారంటే, చూసినవారంతా వావ్ అనాల్సిందే!

Christmas Day 2024: క్రిస్మస్ రోజున పిల్లలను రెడీ చేసేటప్పుడు ఈ చిట్కాలను పాటించారంటే, చూసినవారంతా వావ్ అనాల్సిందే!

Ramya Sri Marka HT Telugu
Dec 23, 2024 08:30 PM IST

Christmas Day 2024: క్రిస్మస్ రోజున పిల్లలను ప్రత్యేకంగా రెడీ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి. చూసిన వారంతా మీ పిల్లలను మెచ్చుకోకుండా ఉండరు. ఇంకెందుకు లేటు… ఈ అందమైన క్యూట్ చిట్కాలు చూసేయండి.

క్రిస్మస్ రోజున పిల్లలను రెడీ చేసేటప్పుడు ఈ చిట్కాలు
క్రిస్మస్ రోజున పిల్లలను రెడీ చేసేటప్పుడు ఈ చిట్కాలు (shutterstock)

శాంతాక్లాజ్, గిఫ్ట్ లు అంటూ పిల్లలు ఎంతో ఆశగా ఎదురుచూసే క్రిస్టమస్ ఇంకొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఏసుక్రీస్తు జననాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, ఉత్సాహంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున పిల్లలు తమ ప్రియమైన శాంతా వస్తాడని ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఇది ఎరుపు రంగు దుస్తుల్లో వచ్చి చాలా బహుమతులను తెస్తాడని నమ్ముతారు. ఇంకా చాలా వరకూ ప్రజలు చర్చికి వెళతారు, ఇంటిని ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. ఇంటికి స్నేహితులను పిలుచుకుని కుటుంబ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో కేకులు కట్ చేసి క్రిస్మస్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారు.

yearly horoscope entry point

ఈ పార్టీలో సంబరమంతా చిన్న పిల్లలదే. శాంతాతో పాటు కేరింతలు కొడుతూ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతారు. మరి ఈ పార్టీకి మీ చిన్నారులు కూడా అటెండ్ అవుతుంటే వారిని కూడా ఇటువంటి ప్రత్యేక అలంకరణతో రెడీ చేసి ఆనందించండి.

డ్రెస్ సెలక్షన్

ముందుగా మీ పిల్లలకు సెలక్ట్ చేసిన డ్రెస్‌లు క్రిస్టమస్ థీమ్ కు దగ్గరగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ముఖ్యంగా శాంతాక్లాజ్ డ్రెస్ అయిన ఎరుపు, తెలుపు రంగుల్లో వాటిని ఉండేలా ఎంచుకోండి. లేదా క్రిస్టమస్ ట్రీ ఉండే గ్రీన్ కలర్ లో ఎంచుకున్నా పరవాలేదు. ఇంకా స్నో మ్యాన్ ఉన్న స్వెటర్ కూడా బాగా సరిపోతుంది. కచ్చితంగా ఆ డ్రెస్ బాడీ కవర్ అయ్యేలా ఉందా అని చెసుకోండి. ఇంకా ఆడపిల్లలకైతే ఏంజెల్స్ ను పోలి ఉండేలా వైట్ గౌన్, వింగ్స్ కూడా వేయొచ్చు.

డ్రెస్ తర్వాత హెయిర్ స్టైల్

క్రిస్మస్ పార్టీకి చిన్న పిల్లలను సిద్ధం చేసేటప్పుడు, వారి హెయిర్ స్టైల్ను సహజంగా ఉంచండి. ఎటువంటి ప్రత్యేకతలు యాడ్ చేయకుండా సింపుల్ గా ఉంచేసి దానిపై శాంతా ధరించే ఎరుపు టోపీ పెట్టండి. మార్కెట్లో అనేక రకాల డిజైన్లు, ఆకారాల్లో శాంతాక్లాజ్ టోపీలు లభిస్తున్నాయని మర్చిపోకండి. దీన్ని ధరించిన తర్వాత మీ పిల్లల క్యూట్ నెస్ మరింత పెరుగుతుంది.

కంఫర్ట్ ముఖ్యం

క్రిస్మస్ పార్టీకి పిల్లవాడిని రెడీ చేసే సమయంలో ప్రస్తుత సీజన్ కు తగ్గట్టుగా ఒంటినిండా కవర్ అయ్యే దుస్తులు వేయండి. అదే సమయంలో అతను లేదా ఆమెకు కంఫర్ట్ ఉందా.. లేదా అని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం పిల్లల దుస్తులు, యాక్సెసరీలు, షూస్ అన్నివేళలా సౌకర్యవంతంగా, సంతోషంగా ఉండేలా ఎంపిక చేసుకోండి.

కలర్లు అద్దడం

శాంతాక్లాజ్ నవ్వు ముఖాన్ని పోలి ఉండాలని, అదనపు మేకప్ వేసేందుకు ప్రయత్నించకండి. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వారి ముఖంపై ఎటువంటి కెమికల్స్ కలిపిన మేకప్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలగొచ్చు. సాధ్యమైనంత వరకూ సహజమైన రంగులనే వాడండి. ముఖానికి గులాబీ రంగును పూయాలనుకుంటే, వారి బుగ్గలపై బీట్ రూట్ ముక్కలను రుద్దడం ద్వారా కాస్త రంగు మార్చినట్లు అవుతుంది.

అలంకరణ

ఇంటిని క్రిస్మస్ థీమ్ లో అలంకరించండి. క్రిస్మస్ ట్రీ, గ్లాసీ డెకరేషన్లు ఉండాలి. శాంతాక్లాజ్ సింబల్స్ లేదా గిఫ్ట్ బాక్స్ వంటి డెకరేషన్లు పిల్లలకు ఇష్టపడతారు.

Whats_app_banner